Wednesday, December 21, 2022

**** *అబద్ధం*, *నిజం* ఒకరికొకరు బాగా పరిచయం.

 *అబద్ధం*, *నిజం*
ఒకరికొకరు బాగా పరిచయం.

ఈ బావిలో నీళ్ళు చాలా బాగున్నాయి కలిసి స్నానం చేద్దామా అని అడిగింది *అబద్ధం, నిజంతో* ఒక రోజు ! 

ఇద్దరు బట్టలు తీసి గట్టున పెట్టి కలిసి బావిలో దిగారు, స్నానం చేశారు. అకస్మాత్తుగా  హడావుడిగా స్నానం ముగించుకొని *అబద్ధం* బావి నుంచి బయటపడి పరుగు తీసింది *నిజం* బట్టలేసుకుని !

*నిజానికి* బాగా కోపం వచ్చేసింది. మెట్లెక్కి బావి బయటకు వచ్చేసింది. *నిజానికి* తన బట్టలు కనిపించలేదు. నగ్నంగానే *నిజం* వీధుల్లోకి వచ్చింది.

*నిజాన్ని* నగ్నంగా చూసిన ప్రపంచానికి కోపమొచ్చింది. అసహ్యమేసింది, దాన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేని *నిజం,* నిస్సహాయంగా మళ్ళీ బావిలోకి దిగిపోయి శాశ్వతంగా కనపడకుండా అదృశ్యమైంది.

ఇది జరిగినప్పటినుంచి, *అబద్ధం*, *నిజం* యొక్క బట్టలేసుకుని, తన్నుతాను సింగారించుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దాన్ని చూసి సమాజం కూడా మహా సంతోషంగా ఉన్నది. 

ఎందుకంటే ప్రపంచానికి *నగ్న సత్యాన్ని* తెలుసుకోవడంపై ఎలాగు ఆసక్తి లేదు కాబట్టి!!!

No comments:

Post a Comment