Sunday, December 11, 2022

:::: బాహ్య దృష్టి vs అంతఃదృష్టి ::::

 *:::: బాహ్య దృష్టి  vs అంతఃదృష్టి :::::::::*

    బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయాలు మనం నిరంతరం జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసు కుంటాము.( వినడం, చూడటం, తాకడం ద్వారా,) ఇలా తెలుసు కోవడం అనేది  మన దృష్టి బయటకు త్రిప్పినప్పుడు జరుగుతుంది.దీనిని *బాహ్య దృష్టి* అంటారు.
     ఇలా బాహ్య దృష్టి ద్వారా గ్రహించిన విషయాలు మనలో సంవేదనలు sensation and feeling, కలగ చేస్తాయి. అవి ఏమిటో తెలూసు కుంటాము. వీటికి మనం ప్రతిస్పందిస్తాము. 
    ఇలా అంతరంగంలో(మనస్సు లో) ఎలాంటి వేదనలు జరుగుతున్నాయి,  ఏ విజ్ఞానం కలుగుతుంది,ఎలా మన స్పందన  వుంటుంది అని తెలుసు కోవడం అనేది *అంతఃదృష్టి* ద్వారా సాధ్యం.ఇదే  *మూడో కన్ను*.(లోపలకి చూచేది).
 *ధ్యానం అంతఃదృష్టి ని ఇవ్వాలి. అలా ఇవ్వనిచో అది ధ్యానం కాదు.*
 
*షణ్ముఖానంద.            9866699774*

No comments:

Post a Comment