200123a2002. 210123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀745.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*ప్రార్థన అనేది ఒక మానసిక భోజనం లాంటిది. శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో, మనస్సు కూడా ఆరోగ్యముగా, శక్తివంతముగా స్వచ్ఛముగా ఉండడానికి ప్రార్థన కూడా అంతే అవసరముగా చేస్తుండాలి.*
*ప్రార్థన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చలేదు కానీ మన మనస్సుని ప్రభావితం చేసి శాంతిని చేకూరుస్తుంది.*
*కోరికలతో చేసే ప్రార్థనలు దైవమును కదిలించలేవు. అవి వృథాగా పోవాల్సిందే! కానీ దిక్కుతోచని, అతి క్లిష్ట పరిస్థితుల్లో హృదయాంతరాళం నుండి పొంగిపొరలి వచ్చే ప్రార్థనలు వెనువెంటనే దేవుని చేరతాయి. ఫలితాలు కూడా వెనువెంటనే అనుగ్రహించబడవచ్చు కూడా.*
*అయితే కొన్నిసార్లు ఫలితాలు సమయ సందర్భాలకు అనుగుణముగా ఇవ్వడం జరుగవచ్చు. అది కూడా మన మంచికే తప్ప చెడు ఏమీ ఉండదు.*
*ఏది ఏమైనా సరే ప్రార్థనను మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన ఇహలోక శాంతులే కాక పరలోక శాంతులు కూడా సొంతమవుతాయి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment