291222a1955. 311222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀714.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*కనిపించని శత్రువులు…*
*శత్రువు మీద గెలిచినప్పుడే ఎవరికైనా ప్రశాంతంగా కునుకు పడుతుంది.*
*కనిపించే శత్రువును జయించగలిగినా, నిలువెల్లా నిండి కనిపించని అంతశ్శత్రువులైన ఆరింటి ధాటికి నిలవలేక విలవిల్లాడుతున్నాడు మనిషి.*
*కామాన్ని జయించలేక, క్రోధాన్ని విడనాడలేక, లోభాన్ని తరిమికొట్టలేక, మోహభ్రమకు బానిసై, పాతాళానికి తొక్కేస్తున్న మదమాత్సర్యాల బారినపడి జీవితాన్ని కోల్పోతున్నాడు.*
*వీటి జతగాళ్లయిన మరికొన్ని శత్రువులకూ దాసుడవుతున్నాడు. తన అనాలోచిత _చర్యలతో ప్రాణాలనే పణంగా పెడుతున్నాడు.*
*మనిషిని మందబుద్ధిని చేసేవి- నిర్లక్ష్యం, అజాగ్రత్తలు, అవి కౌగిట బంధించి ఉక్కిరిబిక్కిరి చేసి ముప్పు తెచ్చే మహమ్మారులు, వాటి బలం అనూహ్యం.*
*మనుగడకు సాయపడే కాలాన్ని, ధనాన్ని, గౌరవాన్ని, ఆహార ఆరోగ్యాలను అవి కరిగించివేస్తాయి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment