Monday, January 16, 2023

శ్రీకృష్ణని మరోరూపం హరిదాసుడు

 *శ్రీకృష్ణని మరోరూపం హరిదాసుడు*
               ➖➖➖✍️


*గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం...*

*సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు...*

*హరిదాసు అంటె పరమాత్మతో సమానం..*

*శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి.*

*హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధార్మలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు.*

*నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు.*

*సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు.*

*ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.*

*ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.*

*శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.*

*హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు.*

*శ్రీమద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు.*

*అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.*

*హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.*

*హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి.*✍️

No comments:

Post a Comment