Monday, January 16, 2023

హనుమంతుడికి…* *ఒంటె ఎలావాహన మయ్యింది?

 160123h1911.    170123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*హనుమంతుడికి…*
     *ఒంటె ఎలావాహన మయ్యింది?*
                ➖➖➖✍️



*హనుమంతుడు యెజనాల కొద్దీ దూరాన్ని ఒక్క అంగలో అధిగమించగలిగినవాడు.*

*స్వయంగా రుద్రాంశ సంభూతుడు. వాయు పుత్రుడూ! సూర్యుణ్ణే  పండనుకొని భ్రమించి, సూర్య గ్రహం దాకా యెగిరి వెళ్లగలగడంలోనే ఆయన యెంత వేగంతో ఎలా ప్రయాణించగలరనేది అర్థమవుతోంది కదా!*

*అటువంటి స్వామికి ఒక వాహనం అవసరమేముంది. ఆమాటకొస్తే, త్రిమూర్తులకీ, వారి దేవేరులకీ, ఇలా దేవతా గణమందరికీ ఏదొక వాహనం ఉందికదా!*

*అయినా వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం అనేది కాస్త ఆసక్తికరమైన కథే కదూ!*

*ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.*

*దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా  అరుదనే చెప్పాలి.* 

*కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన  దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహం ఉంటుంది.*

*ఒంటె, ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాధ ఉంది.* 

*రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృత దేహాన్ని ఋష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు.* 

*ఈసంఘటనే వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణమవుతుంది.*

*మరో వైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది. ఆ ఋష్యమూక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని దుందుభి మృతదేశాన్ని….   తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి, వాలి కనుక షష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.* 

*ఆ తర్వాత సుగ్రీవుణ్ణి - వాలి చంపడానికి వెంటపడినప్పుడు, శాపోదంతం తెలుసున్న  సుగ్రీవుడు ఋష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు.* 

*ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు.*

*దాంతో మిత్రుడైన హనుమంతుడు  పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు  సుగ్రీవుడు.*

*అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం…*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment