050123a1757. 060123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀730.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*"మనం నిత్య జీవితంలో ఏపనిలోవున్నా ఇతర ఆలోచనలు ఆపాలనుకోవటం లేదు. చివరికి దేవుడి పూజలోవున్నా ఆలోచనలు కొనసాగిస్తూనే ఉన్నాం.*
*కానీ మంత్రజపం, నామస్మరణ, శ్వాసమీద ధ్యాస చేయాల్సి రాగానే అందుకు అవరోధంగా ఉన్న ఆలోచనలు మనకి అడ్డం అనిపిస్తున్నాయి.*
*నిజానికి ధ్యానం అనేది ఒక పనికాదు. మనలోని శాంతి స్థితిని అనుభవించటానికి పెట్టిన పేరే ధ్యానం.*
*రోగం క్రొత్తగా వచ్చేదే కానీ ఆరోగ్యం పాతదే ! క్రొత్తగా వచ్చిన అనారోగ్యాన్ని తొలగించుకుంటే మనకి మునుపటి ఆరోగ్యం ఎలాగైతే వస్తుందో; అలాగే క్రొత్తగా వచ్చిన అశాంతిని తీసేస్తే మనకు సహజసిద్ధంగా ఉన్న శాంతి తెలుస్తుంది.*
*చిలుము పట్టిన పాత్రను తోమితే దాని సహజమైన మెరుపు కనిపిస్తుంది. అలాగే కోర్కెలను తొలగించుకుంటే మన సహజశాంతి వ్యక్తం అవుతుంది.*
*అంతేగాని తాత్కాలిక శాంతి కోసంచేసే ప్రక్రియలు పాత్రకు పూతరంగులు పూసినట్లే సహజమైన గుణాన్ని తెలుపలేవు !"*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment