Thursday, January 5, 2023

జీవితానుభవాలు అంతే...

 *🍌అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి , రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులలో నుండి పాడైనవి...  కుళ్ళిపోయినవి తీసేస్తాడు.నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.*

*మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు.వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు.*

*'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు.వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది...'*

*_జీవితానుభవాలు అంతే..._*

*బాధ కలిగించే ఆలోచనలను,  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులోంచి తీసేయాలి...*

*ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి...క్షమించాల్సిన వాటిని క్షమించాలి...సానుభూత చూపాల్సిన వారిపై సానుభూతి చూపాలి... విస్మరించిన వాళ్లను విస్మరించాలి... ప్రశంసించిన వాళ్లను ప్రశంసించాలి...*

*మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి...*

*చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది...*

*_✍చిరునవ్వు ,ఆనందం కవల పిల్లలు...ఒకటి లేకుండా మరొకటి లేదు.._*

No comments:

Post a Comment