0501. 2d2004. 311222-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀120.
*మన ఆరోగ్యం…!
అవిసె గింజలు..
➖➖➖✍️
ఆరోగ్య ప్రయోజనాలు!
Health benefits of flax seeds in Telugu
ముఖ్యమైన పోషకాల “చిరు కాణాచి” అవిసె గింజ. అంటే మానవ ఆరోగ్యానికి లాభదాయకమైన పోషకాలను కల్గి ఉండే గొప్ప మూలం అవిసె గింజ. ఏ ఇతర తృణధాన్యాల్లోనూ లేనంతటి ఎక్కువ పరిమాణంలో “ఒమేగా 3” కొవ్వు ఆమ్లాలను అవిసె గింజ కల్గి ఉంది. కొవ్వు ఆమ్లాలను అధికంగా ఉండే చేపలు తదితరాది సముద్ర ఆహారానికి ప్రత్యామ్నాయం అవిసె గింజ. మానవ శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అవిసె గింజ పుష్కలంగా కల్గి ఉంది. ఇపుడు అవిసె గింజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం:
అవిసె గింజలోని ఈ ఫైబర్ (పీచుపదార్థం) లోని అధిక భాగం జీర్ణంకాని పీచుపదార్థం. ఈ జీర్ణము కాని పీచుపదార్ధం ఆహారంతో కలిసి పేగుల్ని నిండేలా చేస్తుంది, తద్వారా బరువు తగ్గుదలకు సహాయం చేస్తుంది
అవిసె గింజలలో ‘ఒమేగా-3’ కొవ్వు ఆమ్లాలను అధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తింటే శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది.
అవిసెలోని ఈపీచుపదార్థాలు రక్తంలోని కొవ్వులతో సులభంగా కలిసిపోయి మనం తాగే నీటిలో ఆ కొవ్వులు కలిసేలా చేస్తాయి. తద్వారా శరీర వ్యవస్థ నుండి చెడ్డకొవ్వులని బయటకు పంపివేస్తాయి, అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
బోస్టన్ (USA) లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం, అవిసెగింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండడం వలన అవి గుండెపోటు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించింది.
అవిసెలోని కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఏర్పడే కాన్సర్ కణాల్ని అపోప్టోసిస్ (apoptosis) ద్వారా చంపేస్తామని, తద్వారా కాన్సర్కుండే తీవ్రతను తగ్గిస్తాయని ఒక అధ్యయనం పేర్కొంది.
*అనామ్ల పదార్థాలు (antioxidants) పుష్కలంగా ఉన్న అవిసెగింజలు దద్దురు లేక రాషెస్, మొటిమలు, ఇతర చర్మవ్యాధుల వంటి చర్మానికి సంబంధించిన సమస్యల పై విరుద్ధంగా పోరాడడంలో సాయపడతాయి.
*అవిసెగింజల్ని ఆహారంగా (orally) తీసుకోవడం లేదా అవిసెగింజల జెల్ ను జుట్టుకు రాయడం ద్వారా పొడవైన మరియు మెరిసే జుట్టును స్వంతం చేసుకోవచ్చు.
*అవిసె గింజలలో ఎన్నో రకాల పోషక పదార్దాలు ఉన్నాయి అవి శరీర సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. బరువు
కోల్పోయేందుకు, మలబద్ధకానికి అవిసె గింజలు - Flax seeds for weight loss and constipation
మీరు భోజనప్రియులా? అధికంగా తినే స్వభావం మీకుందా? మీరు మీకు కావలసిన దానికంటే ఎక్కువ బరువు కల్గి ఉన్నారా? బరువెక్కువ కారణంగా మీకిష్టమైన టిప్-టాప్ దుస్తుల్ని ధరించలేకపోతున్నారా? మీరుండాల్సిన బరువుకంటే అదనంగా ఉన్న ఆ కొన్ని కిలోల బరువును తగ్గించుకోవడానికి సర్వప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారా? అయితే మిత్రులారా! ఇదిగో మీకు శుభవార్త!! అవిసె గింజలను మీ ఆహారంతో పాటు తీసుకుంటే అధిక బరువును కోల్పోవడంలో మీకు సహాయపడుతుందని ప్రత్యేకమైన పరిశోధన పేర్కొంది. అవిసె గింజలు 35% ఆహారపు ఫైబర్ కలిగి ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవిసె గింజలోని ఈ ఫైబర్ (పీచుపదార్థం) యొక్క సింహభాగం జీర్ణంకాని పీచుపదార్థం. ఈ జీర్ణము కాని పీచుపదార్ధం ప్రధానమైన ఆహారానికి తోడై మీ పేగుల్ని నింపుతుంది, ఇది కరగని పీచు ఆహారం (dietary fiber) కావడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియలో ప్రధాన ఆహారంలో కలిసిపోయి నెమ్మదిగా పేగు ద్వారా వెళుతుంది. దాని ఫలితంగా, మీరు ఎక్కువ సమయం ఆకలి లేకుండా కడుపు నిండిన అనుభూతిని చెందుతారు. ఇక్కడ మరో ఉత్తమ అంశం ఏమంటే ఆహారంలోని పీచుపదార్థం అందులోని పోషకాంశాలకు ఎలాంటి అవరోధం కల్గించదు. పైగా, భోజనాల మధ్య ఉండే కాలం అంతరాన్ని పెంచుతుంది. మీరు బరువు కోల్పోవాలనుకుంటే అవిసె గింజల ఆహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దానికితోడు, ఆహారంలో గనుక అవిసె గింజల్లాంటి ఫైబర్ (పీచు) పదార్థం ఉంటే మలబద్ధకం ఏర్పడకుం డా నివారించి మీ ఆరోగ్యం బావుండేట్లు సహాయపడుతుంది. కానీ మీరు జీర్ణక్రియకు తగినంతగా నీటిని తాగాలి. మరీ ముఖ్యంగా అవిసె గింజలతో కూడిన ఆహారం తీసుకున్నపుడు అది పీచు కారణంగా ప్రేగుల్లోనే చిక్కుకుపోకుండా ఉండేందుకు నీళ్లు బాగా తాగాలి. అదనంగా, అవిసె పై నిర్వహించిన తదుపరి అధ్యయనాలు చెప్పేదేమంటే అవిసె గింజల పానీయాలు, అవిసె గింజల బ్రెడ్ లేదా రొట్టెల్ని ఆహారంగా పుచ్చుకుంటే అవిసెలోని కరుగుడు స్వభావమున్న పీచుపదార్థాల కారణంగా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గిపోతుంది
*అవిసె గింజలు ముఖ్యమైన పోషకాలకు నిలయం - Flaxseeds are a rich source of essential nutrients
మొక్కల రాజ్యంలో, అవిసె గింజల్లో శరీరానికి ముఖ్యంగా కావాల్సిన “ఒమేగా -3” కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఒమేగా -3” కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే సస్యాలతో అవిసె ఒకటి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాల సమూహం. ఈ ఆమ్లాలని శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. కాబట్టి, మన శరీరం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలని బాహ్య వనరుల నుండి తప్పనిసరిగా పొందాలి. అవిసె గింజలు ఈ ‘ఒమేగా-3’ కొవ్వు ఆమ్లాలను దండిగా కల్గిన ఆహార పదార్ధంగాబట్టి వీటిని తింటే శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది.
*అవిసె గింజలలో కనిపించే కొవ్వు ఆమ్లం “అల్ఫా-లినోలెనిక్ యాసిడ్” (ALA) గా పిలువబడుతుంది. ఈ లినోలెనిక్ ఆమ్లం చేపల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చేపలకు ప్రత్యామ్నాయం అవిసె గింజలు. అందుకే అవిసెని మొక్కరూపంలోని “ఒమేగా 3” రూపాంతరంగా వర్ణిస్తారు.
ఈ కొవ్వులు శరీరంలో ఎల్లప్పుడూ జరిగే జీవక్రియలో సులభంగా కలిసిపోయి నరాల (ధమనుల) మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది కాకుండా, అవిసె గింజలు విటమిన్ ఎ, సి, ఎఫ్ మరియు ఇ, పొటాషియం,
ఇనుము, మాంగనీస్ మరియు జింక్ వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంది. అందుకే పోషకాహార నిపుణులు అవిసె గింజల్ని “ప్రయోజనాత్మక ఆహారం” (ఫంక్షనల్ ఫుడ్) అనే పేరుతో పిలుస్తారు. .
*అవిసె గింజలు రక్తంలో అధిక కొవ్వును (కొలెస్ట్రాల్) ను తగ్గిస్తాయి - Flaxseeds reduce cholesterol
అవిసె గింజల్లోని పీచుపదార్థం (ఫైబర్) యొక్క మూడింట ఒక వంతుభాగం నీటిలో కరిగిపోయేస్వభావం కలది. అందు వలన, అవిసెలోని ఈ పీచుపదార్థాలు రక్తంలోని కొవ్వులతో సులభంగా కలిసిపోయి మనం తాగే నీటిలో ఆ కొవ్వుల్ని మిళితపర్చి అనంతరం శరీర వ్యవస్థ నుండి బహిష్కరింపజేస్తుంది, అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, అవిసె గింజల్ని నిరంతరంగా ఆహారంలో తీసుకోవడం వల్ల హానికరమైన కొవ్వును వదిలించుకోవటంలో సాయపడతాయి. ఇంకా, అవిసె గింజల కారణంగా రక్తంలో కొవ్వు స్థాయిలు నియంత్రణలో ఉంటే సులభమైన మరియు ఆరోగ్యకరమైన విధంగా బరువును కోల్పోవడం సాధ్యమైనట్లే గదా! . అవిసె గింజల సేవనంతో మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉండడం జరుగుతుంది, తద్వారా, గుండెకు సంబంధించిన సమస్యల ప్రమాదం దూరమవుతుంది.
*మెదడు స్ట్రోకులను నిరోధించే అవిసె గింజలు - Flax seeds prevent brain strokes
అవిసె గింజలు మెదడు స్ట్రోకులను నిరోధిస్తాయని పలు ప్రైవేటు అధ్యయనాలు చాటుతున్నాయి. అవిసెగింజల్లో ఉండే “అల్ఫా-లినోలెనిక్ కొవ్వు ఆమ్లాలు-ALA” (అవిసె గింజల యొక్క ఒక ముఖ్యమైన భాగం) శరీరం యొక్క నాడీ వ్యవస్ధ, దానికి సంబంధించిన పరిస్థితులపై ఎలా ప్రభావాన్ని చూపుతాయన్న విషయంపై అనేక స్వతంత్ర అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. అన్ని అధ్యయనాల్లోనూ చెప్పిందేమిటంటే అవిసెగింజల్లోని కొవ్వు ఆమ్లాలు మెదడు స్ట్రోకులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయని. మరియు అవిసె గింజలు ఈ మెదడు స్ట్రోకులు వచ్చే రోగుల్లో గూడుకట్టుకుని ఉండే దుఃఖ లక్షణాల్ని తొలగిస్తుంది. అవిసెలోని అల్ఫా-లినోలెనిక్ కొవ్వు ఆమ్లాలు మెదడులోని కొన్ని నిర్దిష్ట ప్రోటీన్ల (మెదడు-ఉత్పన్నమైన న్యూరోట్రాఫిక్ కారకం) ఉత్పర్దకతను పెంచి, తద్వారా మెదడు కణాలు సరిగా పనిచేసేందుకు బాధ్యత వహిస్థాయి. ఈ ఆమ్లాలను దండిగా కలిగున్న అవిసెగింజలు నాడీ ధమనుల యొక్క విస్తరణలో సహాయపడుతుంది, తద్వారా మెదడునరాల సాగుదల గుణాన్ని లేదా “న్యూరోప్లాస్టిటీ”ని మెరుగుపరుస్తుంది. స్ట్రోకులు మరియు ఇతర నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఈ అల్ఫా-లినోలెనిక్ కొవ్వు ఆమ్లాలను వాడటం ద్వారా ఆశాజనకమైన మార్గాలు కనుగొనడంపైన కొనసాగుతున్న అధ్యయనాలు దృష్టి పెడుతున్నాయి.
*చక్కెరవ్యాధికి అవిసె గింజలు - Flaxseeds for diabtetes
భారతదేశంలో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, నిరంతరంగా అవిసెగింజల్ని సేవించినచో చెక్కెరవ్యాధి (డయాబెటిక్) రోగులలో రక్తంలోని అధిక చక్కెర స్థాయిలు తగ్గినాయి. అవిసెగింజల్లో ఉన్న ఈ చక్కెరస్థాయిల్ని తగ్గించే గుణం చెక్కెరవ్యాధి రోగులకు గణనీయంగా మేలు చేస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు. అవిసె గింజల్లో ఉన్న కొవ్వు ఆమ్లాలు ఇన్సులిన్ ద్వారా గ్లూకోజ్ను పెంచుతాయి, తద్వారా డయాబెటిక్ రోగులలో రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను నిర్వహించడంలో అవిసె సహాయపడుతుంది.
*ఆరోగ్యకరమైన గుండె కోసం అవిసె గింజలు - Flax seeds benefits for a healthy heart in Telugu
అవిసెగింజలు ఆరోగ్యకరమైన గుండెను పొందేందుకు సహాయపడతాయి. మన గుండెను ఆరోగ్యప్రదంగా నిర్వహించు కోవడమే మన జీవిత ధ్యేయాల్లో ముఖ్యమైంది. అయితే వేగవంతమైన జీవనశైలి వల్ల మన గుండె నిర్వహణ కాస్త ఖరీదైనది మరియు కష్టతర మైనదిగా మారుతోంది. ఆరోగ్యకర గుండెను నిర్వహించుకోవడమనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం, కానీ అది ఓ లగ్జరీగా మారిపోయింది ఈరోజుల్లో. కొందరికైతే ఓ 5 నిమిషాల సమయాన్ని వారి ఆరోగ్యం గురించి పట్టించుకునేందుకు కేటాయించడమే కష్టమైపోతోందీరోజుల్లో. మీరు దీని గురించి ఇక చాలా కష్టపడి యోచించాల్సిన అవసరం లేదని ఎవరైనా మీకు చెప్తున్నారా? అవును మరి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలున్న అవిసెగింజలు హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా చేయడంలోను, ఇంకా మీ ఆరోగ్యానికి ఉపకరిస్థాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అసంతృప్త కొవ్వు ఆమ్లాలుగా ఉంటాయి, ఇవి ధమనులలో ప్రమాదకరమైన ఫలకాలను ఏర్పరచవు. కాబట్టి ఆథెరోస్క్లెరోసిస్ (ధమనులలో కొవ్వు నిక్షేపణ చేయడం) అనే ప్రమాదాన్ని అవిసెగింజలని తినడం ద్వారా నివారించవచ్చు.
బోస్టన్ (USA) లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం, అవిసెగింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వినియోగం
గుండెపోటు మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని సూచించింది. ఇక మీరు చేయాల్సింది ఒకటుంది. అదేంటంటే మీరు వంటగదిలోకెళ్ళి సిద్ధంగా వండిపెట్టిన అవిసె గింజలతో కూడిన రుచికరమైన భోజనాన్ని వడ్డించుకోవాలి మరి.
*అవిసె గింజలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి - Flax seeds decrease the risk of breast cancer in Telugu
మహిళల్లో, అదీ ముఖ్యంగా ముట్లు నిలిచిపోయిన ప్రౌఢ వనితల్లో, రొమ్జు కాన్సర్ రాకుండా అవిసె గింజలు అడ్డుకుంటారాయని ఇటీవలి అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. అవిసెగింజల్లో ఉండే “లిగ్నంట్లు” అనే పదార్ధం రొమ్ము కాన్సర్ విరుద్ధంగా పోరాడే లక్షణాల్ని కలిగిఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అవిసెగింజ లిగ్నంట్లు ఓ రకమైన “ఫైటోఎస్ట్రోజెంట్లు” (Phytoestrogens) కల్గి ఉంది, అంటే స్త్రీల శరీరంలో సహజంగా “ఈస్ట్రోజెన్” పదార్థం ఉంటుంది, ఇది రొమ్ముక్యాన్సర్ విరుద్ధంగా పోరాడుతుంది. ఈ అవిసెగింజ లిగ్నంట్లు మహిళలు సేవించినపుడు ఈస్ట్రోజెన్ లాగానే పనిచేసి రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అవిసె గింజల్లో ఉండే “ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు” శరీరంలో ఉండే కాన్సర్ కణాల పరిమాణం మరియు సంఖ్యను కూడా తగ్గిస్తాయని మరో అధ్యయనం తెలుపుతోంది. అవిసెలోని కొవ్వు ఆమ్లాలు శరీరంలో జనించే కాన్సర్ కణాల్ని కొన్ని మార్పుల (apoptosis) ద్వారా చంపేస్తామని, తద్వారా కాన్సర్కుండే తీవ్రమైన నొప్పి లక్షణాలు తగ్గిపోతాయిని ఆ అధ్యయనం పేర్కొంది. రొమ్ము క్యాన్సర్
విరుద్ధంగా అవిసె గింజలసేవనం ఖచ్చితంగా ఎలా పని చేస్తుంది (mechanism), దాని ఫలసాధకం (ప్రభావశీలతను) ఎలాంటిది అనే విషయాలపై ఇంకా కొనసాగుతున్న అధ్యయనాలు దృష్టి సారిస్తున్నాయి
*రుతుక్రమం ఆగిన మహిళలకు అవిసెగింజల ప్రయోజనాలు - Flaxseed benefits for post-menopausal women in Telugu
ముట్లుడిగిన (రుతుక్రమం నిల్చిపోయిన) మహిళలకు అవిసె గింజలు చాలా ఉపకరిస్తాయని ఓ పరిశోధన వెల్లడించింది. అవిసెగింజల్లో ఉన్న “లెగ్నిన్ (legnins) ” అనే పదార్ధం ముట్లుడిగిన మహిళలకొచ్చే ఒంట్లో వేడి (hot flashes) వంటి తదితరాది రుతువిరతి రుగ్మతల లక్షణాలను మరియు హార్మోన్ల అసమానతలను తగ్గిస్తుందని ఒక పరిశోధన పేర్కొంది. అయితే ఈ పరిశోధన ఇంకా పరిశోధనాస్థాయిలోనే ఉంది కానీ, ఇందుకు రుజువును ఇంకా చూపలేదు. ఆ రుజువును కనుగొనే దిశలో పరిశోధన ఇంకా కొనసాగుతోంది.
*చర్మారోగ్యానికి అవిసె గింజలు - Flax seeds benefits for skin in Telugu
అవిసె గింజల్లో మీ చర్మారోగ్యానికి ఉపకరించే రకరకాలైన మిశ్రద్రవ్యాలు ఉన్నాయి. ఓ చెంచాడు అవిసె గింజల్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుని తిన్నారంటే ప్రకృతి ప్రసాదించే సుగుణాలనన్నింటినీ మీరు భుజించినట్లే. ప్రప్రథమంగా చెప్పాల్సిందేమంటే నొప్పితో కూడిన వాపుల విరుద్ధంగా పోరాడే గుణం, అనామ్ల పదార్థాలు (antioxidants) పుష్కలంగా ఉన్న అవిసెగింజలు దద్దురు లేక రాషెస్, మొటిమల
వ్యాధులు, విపరీతమైన మంటతో కూడిన చర్మవ్యాధుల వంటి చర్మానికి సంబంధించిన సమస్యల విరుద్ధంగా పోరాడటానికి మీకు సాయపడుతుంది. అవిసెగింజల సేవనం మీ చర్మంలోని మృతకణాలను తొలగించి మీకు ఆరోగ్యమైన మరియు కాంతివంతంగా మెరిసే చర్మాన్ని ఇస్తుంది. తద్వారా వయసు పైబడుతున్న తరుణంలో మొదట వచ్చే వృద్ధాప్య సంకేతాల విరుద్ధంగా పోరాడేందుకు మీకు సహాయపడుతుంది. అదనంగా, అవిసె గింజలు వైటమిన్-ఇ ని దండిగా కల్గి ఉంటం మూలాన అవిసె మీకు ప్రకృతిసిద్ధమైన “యాంటి-ఏజింగ్” విటమిన్ లా పని చేస్తుంది. తద్వారా, మీరు సహజసిద్ధ పోషక ప్రభావాలతో కూడిన చర్మం కల్గి మిమ్మల్ని తాజాగా మరియు నవయవ్వనపరుల్ని చేస్తుంది.
*జుట్టు ప్రయోజనాలకు అవిసె గింజలు - Flax seeds benefits for hair and scalp
దాదాపు ప్రతి ఒక్కరూ రోజువారీ కాలుష్యం కారణంగా జుట్టుకు సంబంధించిన తొందర్లను ఎదుర్కొంటూ బాధ పడుతుంటారు. జుట్టు ఊడడం, వెంట్రుకలు కఠినమైనవిగా (rough hair) తయారవడం అనే సమస్యలు ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంటాయి. మెరిసే జుట్టు మరియు ఆరోగ్యకరమైన కుదుళ్ళు, నెత్తి చర్మాన్ని (healthy scalp) పొందడానికి అందరూ కలలుకంటుంటారు. మరి ఆ కల నిజమవటానికి ఓ శుభవార్త ఇక్కడుంది! అవిసెగింజల్ని ఆహారంగా లోనికి (orally) తీసుకోవడం లేదా అవిసెగింజల జెల్ ను జుట్టుకు రాయడం ద్వారా పొడవైన మరియు మెరిసే జుట్టును మీ స్వంతం చేసుకోవచ్చు. అవిసిగింజల జెల్ ను రాయడం ద్వారా జుట్టు కుదుళ్లను ఇది బలవర్ధకంగా పోషించటానికి సహాయపడుతుంది నెత్తిపైని చర్మాన్ని ఎల్లప్పుడూ తేమకలిగినదిగా ఉండేందుకు ఉపకరిస్తుంది. అవిసెగింజల తలనూనెను (flaxseed hair oil) ను జుట్టుకు రాయడం వల్ల చుండ్రును కూడా గణనీయంగా తగ్గించుకొని జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
*మణికట్టు-అరచేయి-సంబంధ నొప్పుల ఉపశమనానికి అవిసె గింజలు - Flaxseeds relieve carpel tunnel pains
మణికట్టు-సంబంధమైన నొప్పి లేదా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి?చేతిమణికట్టు నరం పైన (మధ్యనరం పైన) కల్గిన నిరంతర ఒత్తిడి కారణంగా వచ్చే నొప్పి చేతి మణికట్టు, అరచేయి, వేళ్ళులో ఏర్పడుతుంది. ఈ నొప్పి కారణంగా నొప్పి ఉన్న చోట మొద్దుబారి తిమ్మిరెక్కడం, అరచేయి, వేళ్లలో నొప్పి, మణికట్టు వాపెక్కి నొప్పి కలగడం వంటి లక్షణాలకు దారితీయవచ్చు. ఇందుకు కారణాలు స్థిరంగా టైపింగ్ చేయడం, కీళ్ల నొప్పి లేదా థైరా యిడ్ గ్రంథి మాంద్యం ఆర్థరైటిస్ లేదా హైపోథైరాయిడిజం అనేవి కావచ్చు. ఇందుకు సాధారణ చికిత్సలలో చేతికి కట్టుకట్టేబద్దలు (అంటే హ్యాండ్ స్ప్లింటులు) లేదా స్టెరాయిడ్ మందులు లేదా శస్త్రచికిత్స ఉన్నాయి. కానీ, ఇటీవల అధ్యయనంలో తేలిందేమంటే అవిసె గింజల నూనె, లేదా జెల్లీ వాడకం వల్ల ముంజేతి-మణికట్టు నొప్పులు (కార్బల్ టన్నెల్ నొప్పులు) మరియు తత్సంబంధ ఇతర వ్యధపూరిత లక్షణాలకు చాలా ప్రభావవంతమైన ఉపశమనం కల్గించింది. ఈ అధ్యయనాన్ని 96 మంది కల్గిన ఓ బృందంపైన నిర్వహించారు. మీకూ ఒకవేళ ఇలాంటి సమస్య ఉంటె, అవిసె నూనె లేదా అవిసె జెల్లీని వాడేందుకు ముందు నిపుణుడైన మీ డాక్టర్తో సంప్రదించి సలాయా తీసుకోండి.
*అవిసెగింజల్ని ఎలా తినాలి, ఎలా ఉపయోగించాలి - How to eat and use flaxseeds in Telugu
అవిసెగింజల్ని పలు విధాలుగా తినొచ్చని చెబుతున్నారు. అయినా, ఉత్తమ ప్రయోజనాల కోసం ఈ గింజల్ని ఎలా తినాలి అన్న అంశం పై ఒకింత గందరగోళము నెలకొని ఉంది. ముఖ్యంగా, మొదటిసారిగా అవిసెగింజల్ని తినాలని అనుకునేవారికి ఈ గందరగోళం తప్పదేమో. ప్రమాణంలో చిన్నవిగానే ఉండే అవిసె విత్తనాలు రెండు వర్ణాల్లో మార్కెట్లో లభ్యం అవుతున్నాయి.అవి గోధుమ వర్ణం (బ్రౌన్) అవిసె విత్తనాలు, మరియు బంగారు వన్నె గల అవిసె విత్తనాలు. నాణ్యత విషయానికొస్తే ఈ రెండు రకాల అవిసెగింజల్లో ఏమంత వ్యత్యాసం లేదు. అయితే వినియోగదారులు చెప్పిందాన్ని బట్టి చూస్తే, గోధుమ వర్ణం అవిసెగింజలే ఎక్కువ రుచిగా ఉంటాయని తెలిసింది. ఇంక, అవిసెనూనె కు ప్రత్యేకంగా చికిత్సా విలువలెక్కువని నమ్మడమైంది. అవిసెనూనెను వంటనూనెగా కూడా విరివిగా వాడబడుతుంది. వాణిజ్యపరంగా అవిసెగింజలు మార్కెట్లో చూర్ణం, క్యాప్సూల్స్, మాత్రలు (టాబ్లెట్స్), అవిసెగింజల నూనె, అవిసెగింజల పిండి మరియు భక్ష్యాల (confectionaries) రూపాల్లో వినియోగదార్లకు లభ్యమవుతోంది. అయితే పిండి రూపంలోని అవిసె గింజలను తినడమే అన్నివిధాలుగా ఉత్తమమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే, పిండి రూపంలోని అవిసెగింజ ఆహారం గింజ కంటే బాగా జీర్ణం అవుతుందని అధ్యయనం పేర్కొంది.
*మీకు తెలుసా? Do you know?
అవిసెచెట్టు కాండాన్ని పలు ఆహారేతర ఫైబర్లను తయారు చేయడానికి ఉపయోగపడుతోంది. ఈ ఫైబర్లు వాణిజ్యపరంగా వస్త్రాలు, దారాలను, పెయింటింగ్ కాన్వాస్ లు చేయడానికి ఉపయోగిస్తారు. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేమంటే అవిసె చెట్టు ఆటోమొబైల్ పరిశ్రమలోకి ప్రవేశించింది. కార్బన్ ఫైబర్స్ స్థానంలో అవిసె ఫైబర్లు వాడకం నెమ్మది, నెమ్మదిగా పెరుగుతోంది. అదనంగా, పెయింట్స్, వార్నిష్ మొదలైన వాటిని తయారు చేసేందుకు కూడా అవిసెగింజల నూనెను (flaxseed oil) ఉపయోగిస్తున్నారు.
*ఇంట్లోనే అవిసెగింజల జెల్లీ తయారీ: అవిసెగింజలలో ఉండే మేలైన సారాన్నంతా పొందేందుకుగాను వాటిని నీటిలో ఉడికించి జిగురుగా ఉండే “అవిసెగింజల జెల్లీ” ని తయారు చేస్తారు. అవిసెగింజల జెల్లీని కిందివిధంగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు:
అవిసెగింజల తయారీ విధానం చాలా సులభం. ఓ బాణలి తీసుకుని అందులో ఓ కప్పు నీటిని పోసి, రెండు టేబుల్ స్పూన్ల అవిసెగింజల్ని వేసి అతి వేడిసెగపైన మరిగించండి. కొంతసేపటికి ఉడుకుతున్న నీటిలో బుడగలు రావడం గమనిస్తారు మీరు, ఆ వెంటనే నీరంతా బంకగా ఉండే జెల్లీలాంటి ద్రవంగా మారడం మీరు గమనించవచ్చు. ఈ తరుణంలో మంటను తగ్గించి ఓ మధ్య తరహా (మీడియం) సెగపైన కొంతసేపు ఉడకనివ్వండి. అవిసెగింజలు ఉండలు కట్టకుండా గరిట/స్పూన్ సాయంతో కలియతిప్పుతూ ఉండండి. అవిసెగింజలు ఎప్పుడైతే పైకి తేలుతాయో అప్పుడు బాణలిని స్టౌవ్ (పొయ్యి) మీది నుంచి దించేయండి. బాణలిలోంచి తయారైన శుభ్రమైన అవిసెగింజ జెల్లీని ఓ ప్రాత్రలోనికి వంచుకోండి.
చల్లారిన అవిసెగింజల జెల్లీని ఫ్రీజర్లో కనీసం ఓ వారం వరకూ నిల్వ చేసుకుని వాడవచ్చు. విటమిన్-E వంటి ప్రిజర్వేటివ్లను జెల్లీకి కలిపి వారం కంటే ఎక్కువకాలం నిల్వ చేసుకోవచ్చు. యాంటీ-ఏజింగ్ మరియు తేమను నిమిడీకృతం (moisturizing) చేయడానికిగాను, తయారైన జెల్లీలో మీకిష్టమైన నూనె ను కలపండి.
*ముందు జాగ్రత్తగా ఓ మాట: అవిసె గింజల జెల్లీలోనికి నూనెను కలిపే ముందు దాని స్వచ్ఛతను పరీక్షించండి. ఆ నూనె స్వచ్ఛమైనదైతేనే కలపండి. స్వచ్ఛతా ప్రమాణపత్రం కల్గిన నూనెను మాత్రమే కొని జెల్లీలోనికి కలపండి.
*అవిసె గింజల మోతాదు - Flax seeds dosage in Telugu
కొన్న తర్వాత అవిసె గింజలను మీరు ఎక్కువకాలంపాటు ఇంట్లో (shelf life) నిలవుంచుకోవాలంటే వాక్యూమ్ ప్యాక్ లో ప్యాక్ చేసిన అవిసె గింజల్నే కొనండి. ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత వాటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ఉంచి పైమూతను బిగుతుగా బిగించండి. అవిసె గింజలు ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అవిసెగింజల పొడిని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేస్తే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది. కానీ నిల్వ చేసిన అవిసెగింజల పొడి గాని, గింజలు కానీ చెడ్డ వాసన వస్తోంటే వాటిని పారవేయడం ఉత్తమం. సాధారణంగా, అవిసె గింజల్ని గింజ రూపంలోనే తినవచ్చు, కానీ మన శరీరం గింజరూపంలోని అవిసె కంటే అవిసె గింజల్ని పొడి చేసుకుని తింటే బాగా జీర్ణమవుతాయి, వాటి పోషకాలు ఒంటికి పడతాయి. అవిసెగింజల ప్రయోజనాలను ఉత్తమంగా పొందేందుకు రోజూ పరగడుపున్నే (ఖాళీ కడుపుతో ) ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. అయితే, మీ ఆహారంతో పాటు అవిసె గింజల్ని కూడా రోజూ రుచికరంగా తినాలంటే లెక్కలేనన్ని మార్గాలున్నాయి అందుకు. ఇందుకు కొద్దిగా తెలివి ఉపయోగించి చూస్తే చాలు. ఉదాహరణకు, రొట్టె మరియు పరంథాలు (పరోటాలు) తయారు చేసేందుకు కలుపుకునే పిండిలోనే అవిసెగింజల పొడిని కలిపేసి చపాతీ, పరోటాలను చేసుకుని తినొచ్చు. ప్రతి ఉదయం మీరు తీసుకునే హెల్త్ డ్రింక్ లో మరింత ఆరోగ్యకరమైన అవిసెగింజల పొడిని కలిపి తాగొచ్చు. అవిసెగింజల పొడిని కొందరు సలాడ్లుపై చల్లి డ్రెస్సింగ్ చేసి తింటారు. అవిసెగింజల నూనెను కూడా ఆహారపదార్థాలపై డ్రెస్సింగ్ గా చేర్చి తినవచ్చు. కొందరు ప్రకృతివైద్యులు వంట కోసం అవిసెగింజల చమురును ఉపయోగించవద్దని సూచించారు, దానికి బదులుగా, మీరు అవిసెగింజ నూనెను మీ ఆహారంలో లేదా సలాడ్లలో గింజలపొడిచ్చే రుచి కోసం ఉపయోగించవచ్చు. మీరు అవిసె గింజలను పొడి లేదా గింజల రూపంలో తినడానికి ఇష్టపడకపోతే దాన్ని జెల్లీగా తయారు చేసుకుని తినొచ్చు, తద్వారా , అవిసెగింజల ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ ఇంటిలోనే అవిసె గింజల జెల్లీని తయారు చేసుకోవచ్చు. అవిసెగింజల జెల్లీని చర్మానికి పూతగా కూడా ఉపయోగించి సుతిమెత్తని చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇంట్లోనే అవిసెగింజల జెల్లీని సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
*అవిసెగింజల దుష్ప్రభావాలు - Flaxseeds side effects in Telugu
అవిసె గింజల్ని మితానికి మించి తీసుకోవడం వల్ల మీ జీర్ణశయాంతర ప్రేగులను నులిపెట్టినట్లు చేసి చొక్కిస్తుంది, తద్వారా మీకు మలబద్ధకం రావచ్చు లేదా అతిసారం ఏర్పడవచ్చు. ‘
*(మరింత సమాచారం: కడుపు నొప్పి మందులు)
మీరు అవిసె గింజల్ని ఆహారంతోపాటు తీసుకుంటున్నప్పుడు ఎపుడూ మంచి నీటిని అధికంగా తాగడం చాలా అవసరం, ఎందుకంటే, అవిసెగింజపదార్థంలో ఉన్న పీచు పేగులగుండా సులభంగా వెళ్లేందుకు అధికప్రమాణం నీరు బాగా తోడ్పడుతుంది.
పచ్చి అవిసెగింజలు లేదా బాగా పండని అవిసెగింజలు తినడం సురక్షితం కాదు.
అవిసె గింజలు తినడం వల్ల స్త్రీలలో లైంగిక హార్మోన్ (ఈస్ట్రోజెన్-వంటి) ప్రభావాలు కల్గించే కారణంగా వీటిని గర్భధారణ సమయంలో లేదా బిడ్డకు-తల్లి చనుపాలను పట్టే తరుణంలో గాని తీసుకోవడం మంచిది కాదు.
చక్కెరవ్యాధి వంటి ఇతర జబ్బులకు మీరు ఇప్పటికే వైద్యుడు నిర్దేశించిన మందులు తీసుకుంటున్నట్లైనచో మీ వైద్యుడ్ని సంప్రదించిన తర్వాతే అవిసె గింజలను సేవించండి. డాక్టర్ని సంప్రదించకుండా అవిసె గింజల్ని మీ ఆహారంతో పాటు తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే, ప్రత్యేకించి డయాబెటిస్ విషయంలో, అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తాయి కాబట్టి!✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment