Tuesday, January 17, 2023

ధ్యానం అంటే నిద్రలో మనం రోజూ పొందే శాంతి లాంటిదేనా ?

 💖💖💖
       💖💖 *"441"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"ధ్యానం అంటే నిద్రలో మనం రోజూ పొందే శాంతి లాంటిదేనా ?"*

*"ధ్యానం ఉద్దేశం మనసు రోజంతా ప్రశాంతంగా ఉండటం. అది కేవలం చెడు ఆలోచనలను తాత్కాలికంగా మర్చిపోతే వచ్చేది కాదు. చెడు ఆలోచనలు మనసులోనే లేకుండా చేసుకుంటే శాంతి కలుగుతుంది. లేదంటే కేవలం ప్రతిరోజు మనం నిద్రలో పొందే తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొంది దాన్ని ధ్యానం అని మురిసిపోవాల్సి వస్తుంది. ధ్యానం అనేది తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇచ్చేది అయితే అది మనం కష్టపడకుండా రోజూ నిద్రలో పొందుతూనే ఉన్నాం కదా ! ధ్యానం అంటే కేవలం చెడు ఆలోచనలు గుర్తురాకుండా చేసుకోవటం కాదు. అసలు గుర్తే లేకుండా చూసుకోవాలి. అలా చేసుకోగలిగితే మనసు శుద్ధిగా ఉంటుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం")"*
             

No comments:

Post a Comment