హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏
మానవునికి ఉన్న అతి పెద్ద సమస్య గర్వము .. గర్వము అనే పునాది ... పాదు వలన అన్ని అసురీ లక్షణాలు జనిస్తున్నాయి.
గర్వం మూడు స్థాయిలు ... నేనే చేశాను ( సాత్విక అహంకారం)
నా వల్ల మాత్రమే అవుతుంది( రాజసిక)
భూమండలంలో ఎవరివల్ల కాదు( తామసిక అహంకారం)
ఇది విడిపించాలంటే ఈశ్వరుని శక్తి పూనుకోవలసిందే.
అవస్థా త్రయ భోగాన్ని అనుభవించేవాడు జీవుడు .. అవస్థా త్రయ సాక్షి ఆత్మ.. బ్రహ్మము .
మానవుడు అవస్థాత్రయ సాక్షి సాధించనిదే జీవన్ముక్తి ... స్వానుభవం రాదు.
సృష్టి ... స్థితి... లయములకు ఆవల ఉన్న స్థితి సంపాదించాలి సమిష్టి అనుభవంలో ...
పరబ్రహ్మ నిర్ణయం దగ్గర .. దశ విధ ప్రళయములందు కదలని స్థితి తప్పక నిర్ణయం పొందాలి.
ఇంద్రియాలను ఉపయోగించిన ప్రతి క్షణం ... భ్రమ తో ఉపయోగిస్తున్నానా... స్వరూప జ్ఞానంతో ఉపయోగిస్తున్నానా ... పరిశీలన చేసుకోవాలి.
ఆత్మ అనే వస్తువు లేక జీవునికి ఉనికి లేదు ... జీవుడు లేక శరీరం లేదు ... శరీరం లేక దు:ఖానుభవం లేదు ...
భౌతిక జీవనానికి ... పారమార్ధిక అనుభవానికి ... మధ్య సరాసరి సంబంధం లేదు.
మహదహంకారాన్ని కాదనగల శక్తి ని గురువు దగ్గర సముపార్జించాలి.
మానవుడు జగత్తును ఆధారం చేసికొని .. ఈశ్వరీయమైన దివ్యాత్మ స్వరూపునిగా జీవించాలి. కానీ సంశయాత్ముడై జీవించ రాదు.
సంశయం కలిగినప్పుడు ... ఈశ్వరుని గురువుగా పెట్టు లేదా... గురువునే ఈశ్వరునిగా పెట్టుకోవాలి.
కలి సంతారణ మంత్రము... హరే రామ హరే రామ రామ రామ హరే హరే .. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ..
జాగరూకులై మెలకువ .. నిద్ర.. కలలో మృత్యువుని గమనించాలి .. అను క్షణం సహజీవనం చేస్తున్నది మృత్యువు.
పరిశీలించు కోవాలి.. అనుక్షణం .. స్వరూప జ్ఞానంలో ఉన్నామా ... ఇంద్రియ విషయాలతో కాలక్షేపం చేస్తున్నామా ... సహజమైన పరబ్రహ్మ నిష్టలో ఉండాలి.
చైతన్యం... అచైతన్యం ... ఇవి రెండే సృష్టి అంతా ... రెండూ అనంతమే.
ప్రాప్త కాలజ్ఞత లేక సమయ స్ఫూర్తి పనిచేయదు ... లేనప్పుడు అవివేకమే ...
ఒక్క అడుగు పక్కకు పడితే ఒకటి నుండి పన్నెండు ... సం. లు పట్టవచ్చు.
గురువు .. ఈశ్వరుడు ... ఆత్మ అభిన్నులని తెలుసుకో....ప్రతిక్షణం
స్వరూప జ్ఞానం అనే ప్రయాణం పూర్తి చేయటానికిమేల్కొలుపు తారు గురువు ..
నిన్ను సరైన దారిలో నడిపే గురువు ద్వారా సహాయం అందించేవాడు ఈశ్వరుడు. అదీ ఈశ్వరానుగ్రహము.
మూడవది స్వాత్మ అనుగ్రహం......
శ్రీ విద్యాసాగర్ స్వామి వారు
గురుగీత --40
జై గురుదేవ 🙏
No comments:
Post a Comment