Tuesday, February 28, 2023

11. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                🔥 *"11"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹*

*"ప్రాణులు అనే క్రమమంతా ఎక్కడిది?"* 

*"అలా కాదు ఏదో అదృశ్య శక్తి ఆకాశానికి కారణం అయి ఉండవచ్చు.."* 

*"బహుశ అది మనకు కనిపించకపోవచ్చు అని అంటే..!"*

*"అప్పుడు కూడా ఆ అదృశ్య శక్తికి ఇంకేదో మరొక శక్తి కారణం అయి ఉండాలి కదా..!"* 

*"ఆ మరొక శక్తికి కూడా మళ్ళీ ఇంకేదో ఇంకొకటి కారణం అయి ఉండాలి.!"*

*"కారణం లేకుండా కార్యం అసంభవం."* 

*ఇలా కార్యం..*

*"కార్యం యొక్క కారణం అనుకుంటూ శోధిస్తూ వెళితే ఎక్కడో ఒక చోట దీనికి కారణం దొరక్క ఆగిపోవాల్సిందే."*

*"ఈ విధంగా ఈ సృష్టికి అంటూ ఒక కారణం లభించట్లేదు"* 

*"కాబట్టి ఈ సృష్టి లేనిదే అని అర్ధం అవుతోంది."*

*"మరొక రకంగా చూసినా కూడా ఈ సృష్టి లేనిదే అని తెలుస్తోంది."*

*"అదెలాగంటే ఆకాశం నిరాకారం."* 

*"మరి లోకం లోని ప్రాణులన్నింటికీ మూలం ఆకాశంలో ఉన్నప్పుడు ఆకారం లేని ఆకాశం నుంచి ఆకారం కలిగిన ప్రాణులు ఎలా ఏర్పడతాయి?"* 

*"మట్టి నుంచి కుండ తయారయిందంటే నమ్ముతాము."* 

*"ఆకాశం నుంచి కుండలు తయారవుతున్నాయి అని చెబితే మతిస్థిమితం లేనివాడు కూడా పక పకా నవ్వుకుంటాడు."*

*"కాబట్టి ఇక్కడ అనేక రకాల ప్రాణులుగా వస్తువులుగా ఈ అయిదు లోకాలలో కనిపిస్తున్నవన్నీ కూడా వాస్తవానికి లేనివే అని గ్రహించడమే జ్ఞానం."*

*"ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా చూడండి.*
*ఆకాశానికి కదలిక లేదు.* 

*ఆకాశం నుంచి పుట్టిన వాయువుకు కదలిక ఉంది.* 
*వాయువుకు రూపం లేదు.*

*వాయువు నుంచి పుట్టిన అగ్నికి రూపం ఉంది.*

*అగ్నికి రుచి లేదు.*

*"అగ్ని నుంచి పుట్టిన జలానికి రుచి ఉంది."*

 *"జలానికి వాసన లేదు."*

*"జలం నుంచి ఏర్పడ్డ భూమి వాసన కలిగి ఉంది."*

 *"ఒక దానిలో లేని లక్షణం దాన్నుంచి పుట్టిన దానిలో కనిపిస్తోంది.* 
*ఇదెలా సంభవం?*

*"కాబట్టి ఈ సృష్టిగా కనిపించేదంతా స్వప్న మాత్రం అనేదే జ్ఞానుల అనుభవం."*

*"పంచ భూతాలుగా చెప్పబడే ఆకాశం,  వాయువు, అగ్ని, జలం, భూమి అనేవి అనేక రకాలయిన ఆకారాలుగా కంటికి కనిపిస్తున్నా వాస్తవానికి వాటి రూపమంతా నిరాకారమే అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది."*

*"ఎందుకంటే వాటన్నింటికీ మూలమయిన ఆకాశానికి ఆకారం అనేది లేదు కాబట్టి!"*

*"ఇక ఆకాశం యొక్క రహస్యం దగ్గరకు వస్తే!"*

*“ఇది ఆకాశం” అని అజ్ఞానం చేత ఆకాశాన్ని ఏదయితే ఒకటి చూస్తోందో ఆ చూసేదానిలోనే ఈ ఆకాశం ఉందని అందరూ అర్ధంచేసుకోవాలి."* 

*"ఆ చూసేదే మానవునిలోని ఆత్మ."*

*"ఆకాశాన్ని చూసే ఆత్మలోనే ఈ ఆకాశం అనేది ఉందిగాని ఆకాశం అనేది బయట ఉన్నది కాదు అనేది అజ్ఞానం తొలిగాక మానవునికి ఒకరు చెప్పకుండానే అర్ధం అవుతుంది."*

*"కాబట్టి ఆకాశంలా కనిపించేదంతా కూడా మనిషిలోని ఆత్మే."*

**ఆత్మ తప్ప ఏ ఆకాశం కూడా ఎక్కడా లేనే లేదని అందరూ అర్ధం చేసుకోవాలి."* 

*"ఎప్పుడయితే మానవుని లోని ఆత్మ చైతన్యం జ్ఞాన బలంతో నేను చూసేదంతా నేను కల్పన గావించుకున్నదే."* 

*"చూసే నాకంటే వేరుగా చూడబడే ప్రపంచం అనేదేదీ ఇంకొకటి బయట లేదు అని గ్రహిస్తుందో అప్పటి ఆ మానవుని స్థితేనే “ఆత్మ సాక్షాత్కారం” అని అంటారు."*

*"అది అకృత్రిమమయిన “ఆనంద” స్థితి."* 

*"ఆ స్థితిలో చూసే నేను చూడబడే ప్రపంచం అనేవి రెండు కాకుండా అంతా ఒక్కటే అని తెలిసిపోతుంది."* 

*“నేను” అనే భావన మాయమైపోతుంది."*

 *"మనిషి యెక్క స్థితే “ఆనందమయం” అయిపోతుంది."*

*"అట్టి స్థితిలో ఆనందాన్ని అనుభవించేవాడు – ఆనందానికి కారణమయిన వస్తువు అంటూ రెండు ఉండవు."*

*ఆ స్థితే “ఆనందమయం”.* 

*"ఆ ఆనందమయ స్థితిలో నిలిచిన తర్వాత ఈ శరీరం ఉన్నా.. పోయినా అతడికి దుఃఖం కలుగదు."*

*"కాలంతో కూడా సంబంధం తెగిపోయి అనంతంగా ఆ ఆనందంలో అతడు మునిగిపోయి వుంటాడు.*
*ఇక్కడ సృష్టి అనేది అసలు లేనే లేదు.* 
*ఉన్నది కేవలం దృష్టే."* 

*"దృష్టే సృష్టి తప్ప సృష్టి అనే మరొకటేదీ ఇక్కడ లేనే లేదని స్పష్టంగా అర్ధం కావడానికి ఇప్పుడొక ఉపమానంతో అర్ధం చేసుకుందాం."* 

*"ఒక అందమయిన స్త్రీ ఉందనుకుందాం."* 

*"ఒకడు ఆమెను చూసినప్పుడు ఆమె అందానికి ముగ్డుడయి ఆమెను తన ప్రియురాలిగా భావించుకుంటాడు."*

*"ఆ స్త్రీయొక్క తమ్ముడు ఆమెను అక్కగా భావిస్తాడు."*

*"ఆమె తండ్రి ఆమెను చూసినప్పుడు కుమార్తెగా భావిస్తాడు."*

*"ఒకవేళ ఆమె వివాహిత అయి ఉండి ఆమెకు గనక ఒక కుమారుడు ఉన్నట్లయితే అతడు ఆమెను తన తల్లిగా భావిస్తాడు."* 

*'ఒకే స్త్రీని అనేకులు అనేక రకాలుగా చూస్తూ భిన్నమయిన అనుభవాలు పొందుతున్నారంటే ఆ అనుభవాలన్నీ వున్నది ఆ స్త్రీలో కాదు గదా!"* 

*"ఎవరికి వారు వారి వారి దృష్టిలో ఏర్పరచుకున్నదే తమలో అనుభవంగా పొందుతున్నారు తప్ప ఇందులో ఆ స్త్రీ పాత్ర ఏముంది."* 

*దీన్నిబట్టి మనకు తెలిసేదేంటి?* 
*మనలో ఉన్నదే బయట కనిపిస్తుంది."* 

*"మనలో లేనిదేదీ బయట కనిపించదు."* 

*"మన బుద్ధిలోని భావనే మనకు సుఖదుఃఖాలనే అనుభవాలను ప్రసాదిస్తోంది."*

*"ఇంత మాత్రానికి ఇక్కడ సృష్టి ఏదో ఏర్పడి ఉండటం అది మనల్ని భాధించడం అనేదంతా ఒట్టి కల్పిత మాటలు కాక మరింకేంటి?"*

*"ఇప్పుడు అనేక శరీరాలుగా కనిపిస్తున్న ప్రాణులన్నీ అనేకం కాదు ఒక్కటే దృష్టి లోపం వల్ల విచారణ చేయక పోవడం వల్ల బ్రాంతి వల్ల ప్రాణులు అనేకులుగా కనిపిస్తున్నారు తప్ప అనేక ఆకారాలు లేనే లేవు ఉన్నది ఏకైక చైతన్యమే అని తెలుసుకుందాం."*
            

No comments:

Post a Comment