Tuesday, February 28, 2023

నిజమైన ప్రార్థన

 *నిజమైన ప్రార్థన*
🙏🪷🪷🌹🌹🕉️🪷🪷🌹🌹🙏

🙏 *కృష్ణం వందే జగద్గురుమ్* 🙏

*బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |*
*వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభ: ||*
            (-- భ.గీ.. 7అ.19శ్లో.)

🪷 "జ్ఞానవంతుడైనవాడు బహు జన్మమృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలిసికొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు" అని శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు ప్రబోధించాడు.

🪷 భక్తియుతసేవను ఒనరించుచు మనిషి పలుజన్మల పిదప శ్రీకృష్ణభగవానుడే ఆధ్యాత్మికానుభవపు చరమ లక్ష్యమనే దివ్యమైన శుద్ధ జ్ఞానమును పొందగలడు. మనిషి  స్వార్థ పూరిత,  భౌతిక సుఖాలకు దూరమయ్యే ప్రయత్నంలో సఫలం అయినప్పుడు ఆధ్యాత్మిక జీవనములో చేసే పలు కర్మలే భక్తియుత సేవాకార్యములనియు అర్థం అవుతుంది.

🪷 ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క వికృత ప్రతిబింబమనియు, ప్రతిదీ దేవదేవుడైన శ్రీకృష్ణునితో ఒక సంబంధము అంతటా కలిగియున్నదనియు, శ్రీకృష్ణభగవానుని కరుణయే సర్వస్వమనియు, అతడే సర్వకారణములకు కారణమనియు, విశ్వము అతని నుండి స్వతంత్రమై యుండదనియు, ప్రతిదానిని వాసుదేవపరముగా లేదా కృష్ణపరముగా భావిస్తాడు. 

🪷 అట్టి భక్తి విశ్వాసములతో కూడిన వాసుదేవదృష్టి శ్రీకృష్ణభగవానుని శరణుపొందుటయే ఉత్తమోత్తమ గమ్యమనెడి భావనకు చేర్చగలదు. కాని అట్టి శరణాగతులైన మహాత్ములు అతి అరుదుగానుందురు.

🪷 భగవంతుణ్ని సేవించే భక్తులను నాలుగు తెగలుగా చెబుతారు - *ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని.* ఈ నలుగురిలో ఆయనకు చాలా దగ్గరివాడు జ్ఞాని అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.

🪷 భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం గుండెల్లో ఆరడి చేస్తూనే ఉన్నది. కారణం ఏదో ఒకమూల స్వార్థపిశాచం పీడించడం వల్లే అలా మనసు అల్లాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు... తక్కినదంతా ఆయనే చూసుకుంటాడు. ఆ మాట కూడా గీతాచార్యుడు చాలా స్పష్టంగానే చెప్పాడు. అయినా అజ్ఞానం, అహంకారం, మమకారం... ఈ మూడూ ఏకమై మనల్ని పెడదారికి ఈడుస్తూ ఉంటాయి.

🪷 అలా జరగకుండా.... *మనసును నిర్మలంగా ఉంచమని, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమని, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమని, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే నిజమైన ప్రార్థన. ఆ ప్రార్థన సన్నని వెలుగై మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది.*

🪷 *‘సర్వేజనాః సుఖినో భవంతు’* అనే ఒక గొప్ప ప్రార్థనను వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారిదీపమై వెలుగు చూపాలని అర్థించాలి. అదే మనం చేయవలసిన ప్రార్థన!

🙏 *సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు* 🙏

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

🙏🪷🪷🌹🌹🕉️🪷🪷🌹🌹🙏

No comments:

Post a Comment