🔥 *"2"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాస తో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*
*"భగవంతుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినప్పుడు ఆయనను తయారు చేసేదొకటి ఆయనకంటే ముందే ఎక్కడ ఏర్పడి ఉండగలదు?"*
*"కాబట్టి ఇదంతా కూడా పసలేని వాదనే అనుకోక తప్పదు."*
*"ఇలా సృష్టిలోని ప్రతిదానికీ మరొకటేదో కారణం అనుకుంటూ వెళితే ఆ ప్రతి కారణానికీ కూడా మళ్ళీ ఇంకొక కారణం ఉండి ఉండాల్సిందే గదా!"*
*"ఎందుకంటే కారణం లేకుండా కార్యం ఉండదు."*
*"ప్రతి కార్యానికీ కారణం ఉండాల్సిందే గదా!"*
**మరి దీనికి అంతెక్కడ?"*
**అలాగే ఇక్కడ ఇంకో సమస్య కూడా దాగి ఉంది."*
*"ప్రాణి జన్మకు కేవలం తల్లిదండ్రులు కారణం అనుకుంటే ఆ జన్మించినవారికి అదే మొదటి జన్మ అవుతుంది."*
**అంటే పుట్టిన వారికి క్రితం జన్మ అనేది లేదనుకోవాలి."*
*"అలాంటప్పుడు మరణం తర్వాత మరొక జన్మ కూడా ఉండదనే భావించాల్సి ఉంటుంది."*
*"ఎందుకంటే ప్రాణి యొక్క జన్మకు అతడి గత జన్మలలోని పాపపుణ్యాలు, సంస్కారాలు కారణం కాకుండా జన్మలనేవి కేవలం ఒకరు ప్రసాదించేవి అయితే అవి ఆ ఒక్క జన్మతోనే మరణంతో అక్కడే ఆగిపోవలసిందే గదా !"*
*"తర్వాతి జన్మలకు కొనసాగడం అనేది ఇక ఎక్కడ ఉంటుంది."*
*"వెనుకటి జన్మ అనేది లేనప్పుడు తర్వాతి జన్మ అనేది మాత్రం ఇక ఎక్కడ ఉంటుంది?"*
*"మరి అలాంటప్పుడు ఈ లోకంలో పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, సత్యం పలకడం లాంటి నియమాలతో పనేముంది?"*
*"ఒకరి వలన జన్మించి ఒకరోజు మరణంతో అన్నీ ఆగిపోయేపని అయితే ఈ లోకంలోని జీవులు అసలు దేనికీ భయపడాల్సిన పని ఉండేది కాదు."*
*"కానీ లోకంలోని ప్రాణుల హృదయాలలో కర్మలు చేసే సమయాలలో పాపపుణ్యాల భీతి ఏర్పడుతోంది గదా!"*
*"ధర్మ విరుద్ధమయిన పని చెయ్యాలంటే ప్రాణుల హృదయంలో భయం కలుగుతోంది గదా."*
*"దీన్నిబట్టి తేలేదేమంటే మనం గత జన్మలోనూ ఉన్నాం."*
*"గత జన్మ మరణంతో ముగిసేటప్పటికి మనస్సులో ఏర్పడి ఉన్న అప్పటి సంస్కారాలనుంచే ఇప్పటి ఈ జన్మలోకి ప్రవేశించాం."*
**ఈ జన్మలో ముక్తిని పొందలేకపోతే తర్వాత రాబోవు జన్మలోనూ ఉంటాం అని."*
*"కాబట్టి మరణమనే అత్యంత చేదు మిళితమైవున్న ఎంతో దుఃఖకారణమయిన ఈ జన్మలనే బ్రమలనుంచి ముక్తిని పొందటానికి అత్యంత యోగ్యమయిన మానవదేహాన్ని దానిలో ప్రాణాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు అందరూ సదా కృతజ్ఞులై ఉండాలి."*
*"తల్లిదండ్రులు వృద్ధులు అయినప్పుడు వారి వద్దనే ఉండి శ్రద్ధతో వారికి కష్టం కలుగకుండా వారిని రక్షించడం అనేది వారినుంచి శరీరాన్ని పొందిన ప్రతి ప్రాణియొక్క అత్యంత ముఖ్యమయిన “కర్తవ్యం” అని సర్వులూ గుర్తుంచుకోవాలి."*
*"ఒక రైతు ఉన్నాడు."*
*"అతడికి కొద్ది భూమి ఉంది. అందులో ఏ పంటా లేదు. పంట లేని ఆ భూమికి రైతు వెళ్లి రోజూ నీళ్ళు పెడతాడా? పెట్టడు."*
*"ఎందుకంటే బీడు భూమికి మతి స్థిమితం లేనివాడు కూడా రోజూ వెళ్లి నీళ్ళు పెట్టే పని చెయ్యడు."*
*"ఆ భూమిలో గనక ఏదయినా పంట ఉంటే అప్పుడు మాత్రమే ఎవరయినా ఆ భూమికి రోజూ వెళ్లి నీళ్ళు పెడతారు."*
*"అలా ఎందుకంటే పంట ఉన్న ఆ భూమినుంచి వారికి ఒక ఫలితం లభిస్తుంది కాబట్టి."*
**దీనర్ధం మనం దేన్నయినా కాపాడుకుంటున్నాము అంటే దానినుంచి మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండటం వల్లేనని ఇక్కడ అర్ధం అవుతోంది."*
*"మరి మానవుడు లోకంలో పగలంతా తిరిగి ఎంతో శ్రమించి కొద్దిపాటి ధనం సంపాదించి తన శరీరానికి ఆహారం తెచ్చి పెడుతూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు గదా!"*
*"ఏ పలితం కొరకు?"*
*"ఈ శరీరం నుంచి ఏ ప్రయోజనం పొందడం కొరకు శరీరాన్ని కాపాడుకుంటున్నాడు అనేదే ఇక్కడ ప్రశ్న."*
*తన శరీరానికి ఆహారం అయితే పెడుతున్నాడు గాని ఎందుకు పెడుతున్నాను అనే ప్రశ్న వద్దకే మానవుడు రాలేకపోతున్నాడు."*
*"కొద్ది కాలం మాత్రమే తనతో ఉండి ఆ తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ శరీరం నుంచి నేను పొందాల్సింది ఏమిటి అనే ఆలోచనే మానవుడు చెయ్యలేకపోతున్నాడు."*
**శరీరం నుంచి ఏదో ప్రయోజనమే లేకపోతే దానికి ఆహారం పెట్టి రక్షించుకోవాల్సిన అవసరమే మానవునికి ఉండేది కాదు."*
*"నిజానికి ఇదంతా బహు ఆశ్చర్యకరం."*
💖🔥💖🔥💖
💖🕉️💖
No comments:
Post a Comment