Monday, February 6, 2023

5. ఆత్మ జ్ఞానం, మోక్షమార్గం

 🙏🕉️🙏                     ...... *"శ్రీ"*

                 🔥 *"5"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹*

*ప్రారంభం*
*******"""
*"అడవి మొత్తం చెట్లతో నిండి ఉంటుంది.*

*చెట్లన్నీ కొమ్మలు, ఆకులతో పచ్చగా ఉంటాయి.* 

*కొన్ని చెట్లు ఫలాలనిస్తాయి.* 

*మరికొన్ని చెట్లు పుష్పాలను ఇస్తాయి."* 

*"ఏవో కొన్ని చెట్ల ఆకుల రసం మాత్రమే విషాన్ని చంపగలిగే శక్తిని కలిగి ఉంటుంది."* 

*"పళ్ళు, పుష్పాలు కంటికి కనిపించేవి కాబట్టి అందరూ వెళ్లి కోసుకుని అవసరం తీర్చుకుంటారు."* 

*"కానీ శరీర గాయాలను, శరీరంలోకి ప్రవేశించిన విషాన్ని చంపగలిగే శక్తి కలిగిన ఆకులను అందరూ కనిపెట్టలేరు."*

*"అడవి మీద బాగా అవగాహన ఉన్న వారికి మాత్రమే ఆ ఆకుల యొక్క రహస్యం తెలుస్తుంది."* 

*"తెలిసిన వారు తెలియనివారిని అన్నిరకాలుగా రక్షించడమే లోకంలోని అన్ని ధర్మాలలోకల్లా అత్యుత్తమ ధర్మం."* 

*"మరి శరీర గాయాల రక్షణకయితే ఆకుల రసం సరిపోతుంది."*

*"మానవుడిలో కలుగుతున్న దుఃఖానికి ఏ రసాన్ని వాడాలి?"* 

*"దుఃఖానికి ఒక ఆకారం అంటూ లేదు కాబట్టి దుఃఖాన్ని తొలగించేది కూడా ఆకారం లేనిదే అయ్యుండాలి గదా!"* 

*"మరి మానవుడు ఆకారం అంటూ లేని తనలోని దుఃఖాన్ని తొలగించుకోవడానికి లోకంలోని ఏవేవో వస్తువులు, ధనం అనే ఆకారాలమీద ఆధారపడుతున్నాడు."* 

*"ఇవన్నీ ఆకారం లేని దుఃఖం నుంచి మానవునికి శాశ్వతమయిన విముక్తిని కలిగిస్తాయా?"*

*"మానవుడు నిరంతరం తన “ఆనందం” కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఈ లోకంలో జీవిస్తున్నాడు."*

*"మానవునికి ఆనందం అనేది ఎప్పుడు లభిస్తుంది. తనలోని దుఃఖానికి కారణమయినదాన్ని అధిగమిస్తే మానవునికి ఆనందం లభిస్తుంది."* 

*"మానవుడు తనలోని చిన్న చిన్న దుఃఖాలు తొలగించుకుంటే చిన్న చిన్న ఆనందాలు మాత్రమే అతడికి లభిస్తాయి."*

*"అలా కాకుండా ఎప్పటికీ కోల్పోని అతి పెద్ద ఆనందాన్ని గనక అతడు పొందాలనుకుంటే తనకు అతి పెద్ద దుఃఖమేదో అతడు తెలుసుకుని దాన్ని తొలగించుకోవాలి."* 

*"అప్పుడు మానవునికి శాశ్వతమయిన ఆనందం లభిస్తుంది. మరి మానవుడికి అన్నింటికంటే పెద్ద దుఃఖం ఏది అని పరిశీలించినప్పుడు అతడి మరణమే అతడికి అన్నింటికంటే పెద్ద దుఃఖం అని తెలుస్తోంది."*

*"కాబట్టి మానవుడు ఈ మరణం అనే అతి పెద్ద దుఃఖాన్ని గనక తొలగించుకుంటే ఇక అతడి ఆనందానికి ఎట్టి అవరోధం ఉండదు."* 

*"మరి ఈ మరణం అనేదాన్ని మానవుడు ఎలా తొలగించుకోవాలి?"*

*"అది తెలుసుకోవాలంటే ఈ మరణం అనేది తనలో దేనికో ముందు మానవుడు తెలుసుకోవాలి."* 

*"మరణం వల్ల మానవుడు కోల్పోయేది ఏది అని పరిశీలించినప్పుడు ఈ “శరీరం” అని తెలుస్తోంది."* 

*"కాబట్టి మరణంతో కోల్పోయే ఈ శరీరం నేను కాదు."* 

*"ఈ శరీరం నేను అని అనుకోవడంవల్లే ఈ శరీర మరణం నా మరణం అని దుఃఖిస్తున్నాను అనే సత్యాన్ని మానవుడు జ్ఞాన బలంతో తెలుసుకోవడమే మరణాన్ని జయించడం అంటే!"* 

*"కొందరు స్నేహితులు ఒక అడవిలోకి విహారయాత్రకు వెళ్ళారు."*

*"అందరూ అడవి అందాలను చూస్తున్న సమయంలో ‘పులి పులి’ అని ఎవరో అరిచారు."*

*"ఒక్క దెబ్బతో అందరూ భయంతో తలా ఒక దిక్కుకు పరుగులు తీసారు."* 

*"కాసేపటికి పులి పులి అని అరచినవాడు పులీ లేదు గిలీ లేదు రండిరా అని మళ్ళీ గట్టిగా అరిచాడు."* 

*"పారిపోయి దాక్కున్న వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అదే చోటకు వచ్చి చేరారు."* 

*"మళ్ళీ సరదా మాటలలో మునిగిపోయారు."*

*"కొద్దిసేపటి తర్వాత వారిలోని ఒకడి కాలు క్రింద చల్లగా అనిపిస్తే వంగి చూసాడు…. రక్తం."*

*"రక్తం ఎక్కడనుంచి వచ్చిందని అందరూ గమనించి చూస్తే అతడి కాలు మొత్తం కోసుకుపోయి ప్యాంటు అంతా రక్తంతో తడిచిపోయి ఉంది."* 

*"అతడికి అప్పుడు అర్ధమయింది పులి పులి అన్న అరుపులు విని పారిపోతున్నప్పుడు ఏదో చెట్టు కొమ్మ కాలును చీల్చిందని."* 

*"కానీ అతడి కాలుకి గాయం ఏర్పడిన సమయంలో ఆ గాయం గురించి అతడికి తెలియలేదు."* 

*"కనీసం నొప్పి అనే అనుభవం కూడా అతడికి ఆ సమయంలో కలుగలేదు."*

*చూసారా విచిత్రం.* 

*"పులి భయం వల్ల అతడి మనస్సు యొక్క దృష్టి ఆ పరిగెత్తే సమయంలో అతడి శరీరం మీద లేదు కాబట్టి అంతపెద్ద ఆ శరీర గాయం కూడా అతడికి ఆ సమయంలో తెలియలేదు."* 

*"మరి ఈ శరీరం గనక అతడు అయితే అతడి శరీరానికి ఏ సమయంలో, ఏ పరిస్థితిలో గాయం అయినా అతడికి తప్పక తెలియాలి గదా.!* 

*అలా తెలియలేదంటే అర్ధం ఏంటి?*

*"అర్ధం ఏంటి అంటే అన్నింటినీ తెలుసుకునేవాడు ఒకడు ఈ శరీరంలో ఉన్నాడు గాని ఈ శరీరం అతడు కాదు అని."*

 *"అయితే ఈ శరీరం నేను అనిగనక అతడు భావిస్తే ఈ శరీరం యొక్క వృద్ధి క్షయాలు అతడికి కలుగుతున్నాయి."*

 *"అలా కాకుండా ఈ శరీరం నేను కాదు అనిగనక అతడు భావించి శరీరాన్ని విస్మరిస్తే అప్పుడు ఈ శరీరం యొక్క వృద్ధి క్షయాలు అతడికి చెందడం లేదు."* 

*అంతే!*

*"ఈ లోకం యొక్క రహస్యం ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు."*

*"కాబట్టి “నేను-నాది” అనుకున్నదే దుఃఖాన్ని కలిగిస్తుంది."* 

*"త్యజించబడింది ఏదీ దుఃఖాన్ని కలిగించలేదు."*

*"మానవుడు “ఈ శరీరం నేను” అని అనుకోవడం నుంచి “ఈ శరీరం నేను కాదు” అని అనుకోవడం లోకి మారిన మరుక్షణం ఇక ఈ శరీర మరణం అతడి మరణం కాజాలదు."*

*అతడికి మోక్షం లభించినట్లే.*  

*కాబట్టి ఇక్కడ ఏది నాది?* 
*ఏది నాది కాదు?* 
*ఏది నేను?"*

*"ఏది నేను కాదని మానవుడు విచారణ చేసి సత్యాన్ని గ్రహించి దుఃఖాన్ని తొలగించుకోవాలి."*

*"ఒక గ్రామంలోని ఒక మిత్రుని ఇంటికి ఒకరోజు పట్నం నుంచి అతని బాల్య స్నేహితుడు ఒకరు వచ్చారు."* 

*"తాను ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని కొన్ని వ్యవసాయ భూములు చూసి వాటిని కొనే పనిమీద వచ్చినట్లుగా అతను తన మిత్రునికి చెబుతాడు."* 

*"అయితే తన వద్ద ఉన్న కొన్ని బంగారు ఆభరణాలను భద్రంగా దాచమని తిరిగి పట్నం వెళ్ళేటప్పుడు తనతో తీసికెళతానని చెప్పి అతని మిత్రునికి వాటిని అప్పజెప్పి భూములు కొనే పనిమీద బయటకు వెళ్ళిపోతాడు."* 

*"తన మిత్రుడు దాచమని ఇచ్చిన బంగారు ఆభరణాలను అతడు భద్రంగా తన గృహంలోని ఒక పెట్టెలో పెట్టి ఉంచుతాడు."* 

*"ఇది జరిగిన ఒక రోజు తర్వాత పట్నంలో చదువుకుంటున్న ఆ గ్రామస్తుని కుమార్తె సెలవులకు ఇంటికి వస్తుంది."*

 *"యధాలాపంగా ఏదో వస్తువు కోసం వెతుకుతూ బంగారు ఆభరణాలు ఉంచిన పెట్టె తెరుస్తుంది."*

*"అందులో ధగ ధగ మని మెరుస్తున్న బంగారు ఆభరణాలు కనిపిస్తాయి."*

*"ఇంకేముంది ఆనందం పట్టలేకపోతుంది."*

*"తండ్రి మీద ఉన్న భయంతో తండ్రి ఇంటిలో లేని సమయం చూసి ఆ ఆభరణాలను తన శరీరానికి పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఆనందిస్తూ ఉండేది."*

*"కొద్ది రోజుల తర్వాత బంగారు ఆభరణాలు దాచమని ఇచ్చిన పట్నం మిత్రుడు తిరిగి వస్తాడు."* 

*"ఆ బాలిక తండ్రి ఆ ఆభరణాలను పెట్టెలోంచి తీసి పట్నం స్నేహితునికి అందిస్తాడు."* 

*"అతడు వాటిని తీసికుని తిరిగి పట్నం వెళ్ళిపోతాడు."* 

*"ఇదంతా అక్కడుండి చూసిన అతడి కుమార్తె అవాక్కవుతుంది."* 

*"ఎంతో దుఃఖంతో తనలో రోధిస్తుంది."*

*"ఎందుకంటే ఆ బంగారు ఆభరణాలు తన తండ్రి తన కోసం కొని దాచినవి అని ఆమె అంతవరకూ భావించింది."* 

*"కానీ అవి తమవి కావని తెలిసాక బాధ భరించలేక ఎంతో దుఃఖిస్తుంది."* 

*"అయితే ఆమె తండ్రి ముఖంలో మాత్రం ఎలాంటి దుఃఖ ఛాయలు లేవు."* 

*"ఎందుకంటే అతడు దుఃఖించడం లేదు."*

*"దానికి కారణం తనవి కాని ఆ బంగారు ఆభరణాలను ‘ఇవి నావి’ అని అతడు ఎప్పుడూ భావించలేదు."* 

*"అందుకే అవి కోల్పోతున్నపుడు కూడా అతడు నిర్మలంగానే ఉండగలిగాడు."* 

*"ఎవరయితే తెలిసో తెలియకో ఒకనాటికి తప్పక కోల్పోవాల్సిన వాటిని చూసుకుంటూ ‘ఇవి మావి’ అనుకుంటూ ఉంటారో ఆ అమాయక బాలిక లాగా అవి కోల్పోయే సమయంలో వారు తప్పక దుఃఖమే అనుభవిస్తారు."*

*"ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం కాని ఈ శరీరాన్ని చూసుకుంటూ ‘ఇది మనం’ అనుకుంటున్నాం."* 

*"ఒక నాటికి తప్పక కోల్పోయే ఈ శరీరాన్ని చూసుకుంటూ ఈ శరీరం ‘నేను’ ఈ శరీరం ‘నాది’ అని నమ్మకం పెంచుకుంటున్నాం."* 

*"ఈ ‘నేను నాది’ అనే మనలో పెంచుకున్న భావనలే అన్ని దుఃఖాలకు కారణం అని మనం గ్రహించలేకపోతున్నాం."* 

*"జ్ఞానులు ఈ శరీరం మీద అభిమానం పెంచుకోరు."*

 *"ఈ శరీరాన్ని కదిలిస్తున్న ‘ఆత్మ భగవానుని’ నిరంతరం నిశ్శబ్దంగా, మౌనంగా మనస్సుతో ధ్యానిస్తూ ఉంటారు."*

 *"దానివల్ల శరీర నాశనం అనే ‘మరణం’ వారికి దుఃఖాన్ని కలిగించలేకపోతోంది."*

*"శరీరం కోల్పోయే సమయంలో ఎవరయితే దుఃఖించరో వారిక ఈ లోకంలో తిరిగి జన్మించరు."*

*"ఎవరయితే శరీరం మీద అభిమానం పెంచుకుని శరీరం పొతే నేనే పోయినట్లే అని భయపడుతూ శరీరం కోల్పోయే సమయంలో దుఃఖిస్తారో వారు తిరిగి ఏదో ఒక దేహంతో మళ్ళీ జన్మిస్తారు."*

*"శరీరం కోల్పోయే సమయంలో దుఃఖం కలగకుండా ఉండాలంటే మనస్సును ప్రతిక్షణం అంటే జీవించినంత కాలం నిర్విషయ స్థితిలో ఉంచుకోవడం సాధన చెయ్యాలి."*

*"అంటే మన మనస్సు ఎప్పుడూ ఎదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది."*

*"జరిగిపోయినవాటినో లేక జరగాల్సినవాటినో మనస్సు నిత్యం మననం చేస్తూ ఉంటుంది."*

*"ఈ మనస్సు నిద్రలో కూడా ఖాళీగా ఉండదనేది అందరికీ నిత్యానుభవమే."*

*"ఎప్పుడూ ఎదో ఒకటి ఆలోచిస్తూ ఉండే ఈ మనస్సును ఏదీ ఆలోచించనివ్వకుండా ప్రతిక్షణం నిశ్చలంగా ఉంచుకోవడం మానవుడు సాధన చెయ్యాలి."* 

*"కోరికలు మనసులోకి రానివ్వకుండా ఉన్నప్పుడే మానవునికి ఈ సాధన సాధ్యం."* 

సరైన సాధన ద్వారా దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు కృషి చేద్దాం... ఇది కోరిక కాదు.... జీవిత లక్ష్యం, గమ్యం..
            💖🔥💖🔥💖
                  💖🕉️💖
                       *"శ్రీ"*

No comments:

Post a Comment