Monday, February 6, 2023

నిత్య సత్యం

 🇾🇪🍇🍅🍓🍉🍇🇾🇪
    నిత్య సత్యం

మనిషి ఓ పాతికేళ్ళ క్రితం జీవితానికి నేటి జీవితానికి పోల్చుకుంటే గమనిస్తే మార్పు చాలా వూహించని విధంగా కనిపిస్తుంది 

కారణం ఏ స్థాయిలోని వారికి ఆ స్థాయిలోనే కొనుగోలు శక్తి పెరగడం 

ఇరుగు పొరుగువారితో 
బంధువులతో పోల్చుకోవడం 
శారీరక శ్రమ చేయడం నామోషిగా భావించడం 
నిరాడంబరతను పేదరికంగా 
భావిస్తూ 

తనకు తెలియకుండానే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ 

ఇదే జ్ఞానం అనుకుంటూ అజ్ఞానంలోకి వెళుతున్నాడు
అమాయకంగా 

వెరసి సహనం కోల్పోతూ 
ఓపికను ఒదిలేస్తూ  

అనవసరమైన వాటినే 
అవసరం అని  భ్రమిస్తూ 
కష్టపడి సంపాదించిన సొమ్మును ఆరోగ్యం పేరుతో
కొందరు అందం పేరుతో మరికొందరు 
వృదా చేస్తూ

నైతిక విలువలు మరుస్తూ 
అనైతికంగా వలువలు మారుస్తూ 
ఇదే ఆధునికత అంటే అని భ్రమిస్తూ 

బ్రతకలేక చచ్చే వారు కొందరు
చావలేక బ్రతికే వారు మరికొందరు 

అన్నీ ఉన్నా ఏమీ లేవన్నట్టుగా 
మానవ విలువలు మరచి 
సంబంధాలు విడిచి 
సమాజాన్ని మడిచి 
యాంత్రికంగా జీవిస్తున్నాడు

తినాల్సినవి తినక
తినకూడనివి తింటూ 
మాట్లాడకూడనివి 
 మాట్లాడుతూ 
చాలా ఎక్కువగా మాట్లాడుతూ

తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేయక, నమ్మక
 రాజకీయ నాయకులనీ
పోలీసులనీ కోర్టులనీ 
ఎంత ప్రయాస పడుతున్నాడో................

ధ్యానానికి సమయం ఉండదు
జ్ఞానం పెంచుకోడానికి సమయం ఉండదు
ఆత్మజ్ఞానం అంటే అసలే తెలీదు 

ఓ మనిషీ మేలుకో
మాంసం మానుకో
ధ్యానం నేర్చుకో
ధ్యానం చేసుకో
మోక్షం పొందుకో
ఆత్మజ్ఞానం అందుకో

శ్వాస మీద ధ్యాసే ధ్యానం

🙏🙏🙏🇾🇪🇾🇪🇾🇪🍇

No comments:

Post a Comment