🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
💥మనం చేయవలసిందల్లా మౌనంగా ఉండటమే.
శాంతి మన అసలు స్వభావం.
మనం దానిని పాడు చేస్తాము.
కావల్సిందల్లా మనం దానిని పాడుచేయడం మానివేయటం.
మనము శాంతిని కొత్తగా సృష్టించడం లేదు.
ఉదాహరణకు ఒక హాలులో ప్రదేశముంది.
మనము వివిధ వస్తువులతో ఆ స్థలాన్ని నింపుతాము.
మనకు ఆ ప్రదేశం కావాలంటే, మనం చేయాల్సిందల్లా ఆ వస్తువులన్నింటినీ తీసివేయడమే. అప్పుడు మనకు ఖాళీ లభిస్తుంది.
అదేవిధంగా మన మనస్సులోని చెత్తను, ఆలోచనలన్నింటినీ తొలగిస్తే, మనస్సనే ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంది. శాంతి ఒక్కటే వాస్తవం.💥
🙏🌷🙏 *శుభం భూయాత్* 🙏🌷🙏
No comments:
Post a Comment