Sunday, February 5, 2023

శాంతి ఒక్కటే వాస్తవం.

 🕉 *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏🌷🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి*  ఉవాచ:

💥మనం చేయవలసిందల్లా మౌనంగా ఉండటమే. 
శాంతి మన అసలు స్వభావం. 
మనం దానిని పాడు చేస్తాము. 
కావల్సిందల్లా మనం దానిని పాడుచేయడం మానివేయటం. 
మనము శాంతిని కొత్తగా సృష్టించడం లేదు. 
ఉదాహరణకు ఒక హాలులో ప్రదేశముంది. 
మనము వివిధ వస్తువులతో ఆ స్థలాన్ని నింపుతాము. 
మనకు ఆ ప్రదేశం కావాలంటే, మనం చేయాల్సిందల్లా ఆ వస్తువులన్నింటినీ తీసివేయడమే. అప్పుడు మనకు ఖాళీ లభిస్తుంది. 
అదేవిధంగా మన మనస్సులోని  చెత్తను, ఆలోచనలన్నింటినీ తొలగిస్తే, మనస్సనే ప్రదేశం  స్పష్టంగా కనిపిస్తుంది. శాంతి ఒక్కటే వాస్తవం.💥

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

No comments:

Post a Comment