*గర్వభంగం*
భోజమహారాజు ఆస్థానంలో చాలామంది పం డితులుండేవారు. వారిలో మాఘపండితుడు ఒకడు. అతడు గొప్ప పండితుడు. కాని తన కుమించిన పండితుడు ఉండడు అని గర్విం చేవాడు. శాస్త్ర చర్చలలో తనను ఓడించువా డు లేడని ఆయన విర్రవీగుతుండేవాడు. కాని ఒకమారు ఆయన అతిసామాన్యురాలయిన పల్లెటూరు ముసలమ్మ చేత ఓటమి పొందా డు!
ఒకనాడు భోజరాజు, మాఘ పండితుడు ఇరు వురు వాహ్యాళి కోసం నగరం నుండి కొంత దూరం వెళ్ళారు. మాటల మధ్య చాలా దూ రం వెళ్ళినవారు నగరానికి చేరుకునే దారిని మరచారు. దారిలో ఒక ముసలమ్మ ఎదురైం ది. మాఘ పండితుడు ఆమెను పిలిచాడు..
"అవ్వగారూ, ఈ దారి ఎటు వెళ్తుంది?" అని అడిగాడు.
"అయ్యా, ఈ దారి ఎక్కడికీ వెళ్ళదు. ఉన్న చో టే ఉంటుంది. దాని పై నడిచేవారు మాత్రం ఎ క్కడికైనా వెళ్తారు. సరేకాని, మీరెవరు?" అని ఆ ముదుసలి అడిగింది.
"మేము బాటసారులం" అంటూ ఇద్దరూ అ న్నారు.
"ఈ ప్రపంచంలో ఇద్దరే బాటసారులు. వారిలో ఒకడు సూర్యుడు, మరొకడు చంద్రుడు" అన్న ది ఆ ముసలమ్మ..
"అయితే మమ్ము అతిథులు అనుకోండి" అ న్నారు వారు.
"ఈ జగత్తులో అతిథులు ఇద్దరే. ఒకటి ధనం, మరొకటి యవ్వనం. ఎందుకంటే పై రెండూ అ తిథులవలె కొద్దిరోజులు ఉండి వెళ్తుంటాయి. అందువల్ల మీరు అతిథులు కారు" అన్నదా మె.
భోజరాజు మాట్లాడుతూ "నేను ఈ దేశాన్ని పాలించే రాజును" అన్నాడు.
"ప్రపంచంలో ఇద్దరే రాజులున్నారు. ఒకడు మే ఘరాజు, మరొకడు యమరాజు. అందువల్ల నీవు రాజు కాదు. నీవెవరో చెప్పు నాయనా?" అన్నది.
మసలమ్మ వాక్చాతుర్యానికి ముగ్ధుడైన మహా రాజు “అవ్వగారూ, మేము క్షమాశీలురం" అ న్నాడు.
"ఈ ప్రపంచంలో క్షమాశీలురు ఇరువురే. ఒక రు తల్లి, మరొకరు భూమి. అందువల్ల మీరు క్షమాశీలురు కారు" అన్నదామె.
"అయితే మమ్ము సాధువులు" అనుకోండి అ న్నారు ఇద్దరూ.
"ప్రపంచంలో సాధువులు ఇద్దరే. ఒకటి శీల ము, మరొకటి సంతోషం. అందువల్ల మీరు సాధువులు కారు" అన్నది ముసలమ్మ.
చివరికి ఇద్దరూ తమ ఓటమిని అంగీకరించా రు. మాఘ పండితుడు "ముసలమ్మా, మేము ఓడిపోయాం" అన్నాడు.
"ఓడిపోయినవారు ఈ జగత్తులో ఇద్దరు మా త్రమే. ఒకడు కన్యాపిత, మరొకడు అప్పుచేసి నవాడు. అందువల్ల మీరెవరో ఇపుడు చెప్పం డి" అని మరోమారు అడిగింది.
ఇక నమస్కారం చేస్తూ, "అవ్వగారూ మేము నీ ముందు అజ్ఞానులం. దయచేసి మాకు ధా రానగరానికి దారి చూపండి" అన్నారు.
అందుకు అవ్వ సమాధానమిస్తూ..
"అయ్యా. మీరెవరో నాకు తెలుసు. మీరు భో జమహారాజు, మాఘ పండితుడు. మీకు మీ సంపదలు మరియు పాండిత్యం పట్ల చాలా గ ర్వం ఉండేది. అందువల్ల నేను అలా వ్యవహ రించాను. చూడండి ఆ కనిపిస్తున్నదే దారి. ఈ దారి మిమ్మల్ని ధారానగరానికి చేరుస్తుంది" అంటూ వడివడిగా వెళ్ళిపోయిందా వృద్ధురా లు.
🙏
No comments:
Post a Comment