మనసుకు శిక్షణ
మనసుకు ఏమి శిక్షణ అని అనుకుంటాము కదా!!
భగవంతుణ్ణి చేరాలి అంటే, మనకు త్రోవ చూపించేది మన మనసే ...
భగవంతుడు మనకు తెలియాలంటే ముందు మన మనసు అర్ధం కావాలి!!...
మనసుకున్న అవలక్షణాలను వదిలించి మంచి విషయాల్లో శిక్షణివ్వాలి.
భక్తి, భజన, యోగం ఏదైనా మనసుకు మంచి శిక్షణ కోసమే!!...
భక్తిలో, పూజలో మనం ఈ విషయం మర్చిపోకూడదు!!..
మనసుకు శాంతినిచ్చే ఏకాంతాన్ని ఇప్పటి నుండే అలవాటు చేసుకోవాలి.
లేకుంటే అది వృద్ధాప్యంలో శాపంగా పరిణమిస్తుంది.
దానిని జాగ్రత్త పడాలి అంటే, ముందు మనకు ఇష్టమైన విషయాల నుండి మనసును ఈశ్వరుడు వైపు మళ్ళించాలి!!...
ఆ తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలి తనలో తాను ఉండటం మనసుకు అలవాటు చేయాలి.
పిల్లల్ని పెంచినంత శ్రద్ధగా మనసును చూసుకోవాలి, మిలట్రీలో చేరిన వారితో రోజూ శారీరక వ్యాయామం చేయిస్తారు.
ఎందుకంటే ఏ సమయంలోనైనా శత్రువుల దాడిని ఎదుర్కొనేందుకు అది శిక్షణ.
మనసు కూడా అంతే, మనం ఎలా శిక్షణిస్తే మనసు అలాగే ఉంటుంది...
మనం తీసుకునే ఆహారం త్రాగే పానీయం వల్ల మనసు మీద తప్పకుండా ప్రభావం ఉంటుంది అందుకే సాత్విక ఆహారం స్వీకరిస్తే సాత్విక జీవనం అలవడుతుంది.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment