Sunday, February 5, 2023

*గాజు - వజ్రం* *కధ*

 *గాజు - వజ్రం* *కధ*( సమయం ఉన్నప్పుడు ఈ కథ చదివేందుకు ప్రయత్నం చేయండి)

*ఒక రాజ దర్బారు నిర్వహించబడుతోంది. శీతాకాలం కావడంతో దర్బారు బహిరంగ ప్రదేశంల్లో ఏర్పాటుచేయబడింది*.
*పెద్దల సభ అంతా ఉదయపు నీరెండలో కూర్చుని ఉన్నారు. రాజు సింహాసనం ముందు ఒక రాచరికమైన బల్ల ఉంది, దాని మీద కొన్ని విలువైన వస్తువులు పెట్టి ఉంచారు*.

*పండితులు, మంత్రులు, దివానులు అందరూ అక్కడ ఉన్నారు*. *రాజ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాడు*. 
*అతను లోపలికి ప్రవేశించి, రాజుకు నమస్కరించి ఇలా అన్నాడు, " మహారాజా! నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి*, *నేను వివిధ రాజ్యాలు తిరిగి అక్కడ  ప్రతీ రాజుకు వాటిని చూపించాను, కానీ ఎవరూ వాటిని సరిగ్గా పరీక్షించలేకపోయారు*. *అందరూ ఓడిపోయారు, నేను విజేతగా అన్నీ చోట్లకు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను మీ రాజ్యానికి వచ్చాను*.".
" *ఏమిటవి ?", అని రాజు కుతూహలంగా అడిగాడు*.

*అతను ఆ రెండు వస్తువులను రాజగారి బల్ల మీద పెట్టాడు. అవి రెండూ సరిగ్గా ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో, ఒకే రూపురేఖలతో, ఒకేలా  ప్రకాశిస్తూ, అన్నీ వైపులా నుండీ, అన్నీ రకాలుగా ఒకేలా ఉన్నాయి*.

*రాజు వెంటనే, "ఈ రెండూ వస్తువులూ ఒకటే" అన్నాడు*.
*దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "అవును, అవి ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ అవి భిన్నంగా ఉంటాయి. వాటిలో ఒకటి చాలా విలువైన వజ్రం, మరొకటి కేవలం ఒక గాజు ముక్క*.

*కానీ వాటి స్వరూపం, వాటి రంగు ఒకే విధంగా ఉంటాయి; ఇప్పటి వరకు ఏది వజ్రమో, ఏది గాజు ముక్కో ఎవరూ గుర్తించలేకపోయారు*... *ఎవరైనా వాటిని పరీక్షించి ఇది వజ్రం అని, మరొకటి గాజు అని చెప్పవచ్చు. ఎవరైనా సరిగ్గా గుర్తించగలిగితే, నేను ఓటమిని అంగీకరించి*, *ఈ విలువైన వజ్రాన్ని మీ రాజ్య ఖజానాలో నిక్షిప్తం చేస్తాను*.
*కానీ షరతు ఏమిటంటే, ఎవరైనా దానిని గుర్తించలేకపోతే, ఈ వజ్రం విలువతో సమానమైన మొత్తాన్ని మీరు నాకు ఇవ్వాలి. నేను చాలా రాజ్యాల నుండీ  ఇప్పటికి ఇలా  మొత్తాన్ని గెలుపొందాను*”.

" *నేను దానిని పరీక్షించలేను",అన్నాడు రాజు*.

*దివాన్లు కూడా, "రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నందున మేము కూడా ధైర్యం చేయలేం*."

*ఓడిపోతామనే భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఓడిపోయిన తర్వాత చెల్లించవలసిన డబ్బు, అంత సమస్య కాదు, ఎందుకంటే రాజు దగ్గర చాలా ధనం ఉంది. అయితే రాజుగారి పరువు పోతుందేమోనని అందరూ భయపడి, ఎవరూ గుర్తించదానికి ముందుకురాలేకపోయారు*

*హఠాత్తుగా, ఆ ప్రదేశానికి ఒక మూలన చిన్న అలజడి మొదలయ్యింది*.

*ఒక గుడ్డివాడు చేతిలో కర్ర పట్టుకుని ముందుకొచ్చాడు. "నన్ను రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి. నేను ఇందాకటి నుండీ ఈ విషయాలన్నీ వింటున్నాను, అలాగే ఈ వజ్రాన్ని ఎవరూ పరీక్షించలేకపోతున్నారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి", అన్నాడు*.

 *ఒక వ్యక్తి సహాయంతో రాజు వద్దకు చేరుకుని, రాజును ఇలా అభ్యర్థించాడు, "నేను పుట్టుకతో అంధుడిని, అయితే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తద్వారా నేను కూడా నా తెలివితేటలను ఒకసారి పరీక్షించుకోవచ్చు. బహుశా నేను విజయం సాధించవచ్చునేమో*
 ...*ఒకవేళ  నేను విజయం సాధించ లేకపోయినా, మీరు ఎలాగూ పందెం ఓడిపోతున్నారు కాబట్టి అంతకు మించి వేరే కోల్పోయేదేమి ఉండదు*

*అతని మాటలు రాజుకి అర్ధం అయ్యి, ఒక అవకాశం ఇచ్చినందువల్ల నష్టం లేదని భావించాడు. రాజు తన ఆమోదం తెలుపుతూ, “సరే” అన్నాడు*.

*ఆ తర్వాత ఆ వృద్దుడికి ఆ  రెండు వస్తువులను తాకించి, వీటిలో ఏది నిజమైన వజ్రం, ఏది గాజుముక్క అని అడిగారు*.

*ఒక్క క్షణంలో, ఆ వ్యక్తి,  'ఇది విలువైన వజ్రం, ఆ రెండవది  కేవలం గాజుముక్క!' అని చెప్పాడు*.

*అన్నీ రాజ్యాలలో గెలిచి వచ్చిన వ్యక్తి నమస్కరించి, "అది నిజమే, నువ్వు బాగా గుర్తించావు.. నువ్వు చాలా గొప్పవాడివి..ఇచ్చిన మాట ప్రకారం ఈ వజ్రాన్ని నీ రాజ్య ఖజానాకి ఇచ్చేస్తున్నాను", అన్నాడు*.

*అందరూ చాలా సంతోషించారు*. *వచ్చిన వ్యక్తి కూడా వజ్రాల నిజమైన నాణ్యతను గుర్తించేవారు కనీసం ఒకరైనా  ఉన్నారని చాలా సంతోషించాడు*.

*ఆ వచ్చిన వ్యక్తి , రాజు, ఇతర ప్రజలందరూ ఒకే ఉత్సుకతను వ్యక్తం చేస్తూ, ఆ అంధుడిని ఇలా అడిగారు, "నీవు కనీసం చూడలేవు కదా, ఇది వజ్రం, ఇంకోటి గాజు అని ఎలా గుర్తించావు*?"

*అంధుడైన ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, "అది చాలా తేలిక, ప్రభూ, మనమంతా ఇందాకటి నుండీ ఎండలో కూర్చుని ఉన్నాం. అలాగే ఈ రెండూ కూడా చాలా సేపటి నుండి ఎండలో ఉంచ బడ్డాయి. రెండింటినీ ముట్టుకున్నాను. చల్లగా ఉన్నది నిజమైన వజ్రం. .. *వేడెక్కింది గాజు... అంతే*."

*జీవితంలో కూడా, ప్రతి చిన్న విషయానికి వేడెక్కిపోయినవారు, చిక్కుబడిపోతారు*, *బంధింప బడిపోతారు*...*ఆ వ్యక్తులు "గాజు" వంటివారు. ప్రతికూల పరిస్థితులలో కూడా చల్లగా (శాంతంగా, స్థిరంగా) ఉండేవాడు ... ఆ వ్యక్తి  మాత్రమే "విలువైన వజ్రం"లాంటివారు*.....సముద్రం..🙏

No comments:

Post a Comment