Saturday, February 25, 2023

:::::: నిండిన పాత్ర ::::::

 *::::::::: నిండిన పాత్ర ::::::::::::*
          ఏదైనా ద్రవ పదార్థంతో నిండిపోయిన పాత్ర,  అదే ద్రవ పదార్థాన్ని గాని మరొక దానిని గాని మరింతగా స్వీకరించ కలిగే స్థితి లో వుండదు. మనం  పోసినా పొర్లి పోతుందే గాని , పాత్ర ఇముడ్చు కోలేదు.  పాత్రలు ఎంత పెద్దవి అయినా ఆ పరిమాణం ఆ మేరకు పరిమితం.
      మన మనస్సు అపరిమిత మైనది. నిండదు.  కాని మనం మనస్సు ని  పాత్ర వలే ఒక పరిమాణానికి పరిమితం అనగా సంకుచిత పరిచినాము.
     ఇలా ముడిచి వేయి బడిన మనస్సు లో ఏవో కొన్ని ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు, విశ్వాసాలు, ఆదర్శాలు,ఆచార సంప్రదాయాలు, పోసి ,నింపి, 
ఇంకా ఏది తనలో ఇముడ్చ వీలు లేకుండా చేసినాము.
ఉన్నది ఖాళీ చేయలేము .
అదనంగా పోయ లేము.
      ధ్యానం ద్వారా మనస్సుని ఖాళీ చేసి ఏ సిద్ధాంతాలు,
నమ్మకాలు,పార్టీలు,
పోరాటాలతో పనిలేని ప్రేమ, కరుణ,మానవీయత, ప్రజ్ఞ, తో నింపుదాం.
 *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment