*కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది.*
*ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది.*
*బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం!*
*పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి.*
*కనుక కర్మ చేసినపుడు… మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి.*
*మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది.*
*కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి.*
*దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించినవాడే కర్మకు భయపడి ఉంటాడు.*
ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగుగా తెలుసు కనుక.. అయితే దేవుడంటే లెక్క చేయని వారికి అది అంత సులువైన పని కాదు!. వాళ్ళు తమ బుద్ధులను మార్చుకుని దేవునివైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టి కర్త వలన కూడా కాదు!
No comments:
Post a Comment