Thursday, March 9, 2023

గంటలు, రోజుల తరబడి సాధన చేస్తున్నా పెద్దగా మార్పులు కని పించటంలేదు ఎందువల్ల ?

 గంటలు, రోజుల తరబడి సాధన చేస్తున్నా పెద్దగా మార్పులు కని పించటంలేదు ఎందువల్ల ?
మనసు అశాంతిగా ఉన్నప్పుడు ప్రారంభించి ప్రశాంతంగా ముగించే విధానం పేరు ధ్యానం. శాంతిగా ఉన్నప్పుడు ప్రారంభించి ఏదో ఫలం మనకు లభించలేదని అశాంతితో లేస్తే అది పరధ్యానం అవుతుంది. మనసు మార్చుకోవటం అంటే కళ్ళెదురుగా ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటూ వెళ్ళటమే ! నేలలో వడ్లు చల్లిన తర్వాత అవి మొలకెత్తే వరకు వేచి ఉండే సహనం ఉంటేనే ఫలితం వస్తుంది. అంతేకానీ తొందరపడి ఎప్పటి గింజలు అప్పుడే పెకలించి చూసుకుంటే అవి ఎన్నటికీ పంటనివ్వవు. ధ్యానం కూడా అంతటి సహనంతో మన నిత్యజీవితాన్ని మార్చుకుంటూ చేరుకోవాల్సిన స్థితి. గంటలు, రోజుల వ్యవధిలోనే ఫలితాలను ఆశించే సాధనా ప్రక్రియలు అప్రశాంతితోనే ముగుస్తాయి !

No comments:

Post a Comment