Thursday, March 9, 2023

:::::: సుఖాలు మూడు రకాలు:::::

 *:::::: సుఖాలు మూడు రకాలు::::::::*
  1) *ఇంద్రియ సుఖాలు* మనస్సుతో కలిపిన ఆరు ఇంద్రియాలు మనకు సుఖాన్ని ఇస్తాయి. *అందరమూ పొందవచ్చు*
    అయితే ఇవి తాత్కాలికాలు. వీటి పట్ల జాగ్రత్త లేకపోతే మనలను లోబరచి వ్యసన పరుడిని చేస్తాయి. ఇవి మనలను శీల రహితుడని చేసేదాకా వదలవు.
   2) *ధ్యాన సుఖాలు* ఏవనగా ప్రశాంతత, ప్రీతి, హాయి, ఏకాగ్రత, ఉల్లాసం, ఉత్సాహం, వీటిని ధ్యాని సాధిస్తాడు.  సాధనలో వున్నంత కాలం వుంటాయి.
వీటితో తృప్తి చెందితే వృద్ధి చెంద లేము. పైపెచ్చు ఇవి అహాన్ని పెంచుతాయి. *ధ్యానులే పొందగలరు*
    3) *నిర్వాణ సుఖం*. ఇది అంతిమ సుఖం, సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. ఇది ఒక దాని వల్ల వచ్చేది కాదు కనుక శాశ్వతం. ఇది సంకలనం కాదు కనుక విడిపోలేదు. ఇది కారణం లేనిది , కనుక కార్య కారణ బంధానికి అతీతం. దీనికి కర్తృత్వం లేదు. కనుక స్వతంత్ర మైనది. *నేను ను జయించిన వారే అర్హులు*
*షణ్ముఖానంద9866699774*

No comments:

Post a Comment