Friday, March 10, 2023

వైరాగ్యము

 *వైరాగ్యము*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈

🪷 *వైరాగ్యము* అంటే మమతానురాగముల నుండి భయముతో పారిపోవడము, సోమరిగా, నిర్వీర్యముగా, అర్థరహితముగా జీవించుట కాదు. జీవిత సమస్యల నుండి దూరముగా పారిపోవుట కాదు. నీవు ఎక్కడికి పారిపోయినను నీ సంసారము నీతో పాటే వస్తుంది (సంసారము మానసికము కనుక). 

🌹 *వైరాగ్యము*  అంటే నిష్క్రియా పరమైనది కాదు. వైరాగ్యము అనగానే గుర్తుకు వచ్చేది సన్యాసము. సన్యాసము అనునది సంసార బాధలను భరించలేక వాటినుండి విముక్తి కొరకు స్వీకరించునది కాదు. 

✅ *సన్యాసము అంటే....*

*కర్మ ఫలత్యాగము. కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయగలుగుటము. జీవిస్తూ జీవించని వాడిగా ఉండటము. కర్మను చేయుటయందు కుశలత్వము కలిగియుండుట. తామరాకుపై నీటిబొట్టులాగా సంసారము యందు మెలగగలుగుట. బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)*

✅ *వైరాగ్యం:*  

🪷 ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు

వైరాగ్యములు 3 రకాలుగా వున్నాయి, అవి...

1. *పురాణ వైరాగ్యము,*
2. *ప్రసూతి వైరాగ్యము,*
3. *శ్మశాన వైరాగ్యము.*   

వీటి అర్ధమేమిటి?

🪷  *పురాణవైరాగ్యం:*

🌹 పురాణాలలో త్యాగవైరాగ్యాలను గురించి, జగత్తు యొక్క అశాశ్వతత్వాన్ని గురించి వర్ణనలుంటాయి. వాటిని వినినప్పుడు, చదివినప్పుడు మనకు కూడా సత్యం తెలిసి వైరాగ్యం కలుగుతుంది.
కానీ, అది స్థిరంగా నిలబడదు, మరుక్షణంలో ఆ వైరాగ్యం పోయి మళ్ళీ అన్నీ శాశ్వతమనుకుంటూ సంసారంలో పడతాం. ఇదే పురాణ వైరాగ్యమంటే

🪷 *ప్రసూతి వైరాగ్యం:* 

🌹 ప్రసూతి వైరాగ్యమంటే - 
పిల్లలను కనేటప్పుడు కలిగే బాధను భరించలేక ప్రతి తల్లి ఇంక పిల్లలను కనకూడదు అని అనుకుంటుంది, ఎంతో వైరాగ్యం కలుగుతుంది. నెమ్మదిగా పురిటి నొప్పులు తగ్గి పిల్లవానిని పోషించి పెద్దవానిని చేయడంలో నిమగ్నమవుతుంది... అదేవిధంగా మళ్ళీ పిల్లలు, మళ్ళీ సంసారం..

🪷 *శ్మశానవైరాగ్యం:*

🌹 శ్మశాన వైరాగ్యమన్నా ఇటువంటిదే.. శ్మశానాన్ని చూసినప్పుడు, చితిలో కాలే శవాన్ని చూసినప్పుడూ “మనం కూడా చివరకింతే కదా !" అన్న వైరాగ్యం కలుగుతుంది... ఇంటికి రాగానే మళ్ళీ సంసారం... ఇక తెలిసిందే కదా...

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*

No comments:

Post a Comment