Friday, March 10, 2023

దైవంపై ప్రీతి ఉండాలి

 దైవంపై ప్రీతి ఉండాలి
                     ➖➖➖

    *" మీ ఇంటికి ఎవరైనా కొత్త స్నేహితుడు వస్తే, “రండి, దయచేసి కూర్చోండి" అని కుర్చీ వేసి మర్యాద చేస్తారు.* 

*కానీ, పాత స్నేహితుడే గనుక వస్తే ఎంతో ప్రేమతో హృదయపూర్వకంగా, “రారా, కూర్చోరా" అని ఆహ్వానిస్తారు.* 

*ఎందుకంటే పాత స్నేహితునితో మీకు సన్నిహిత సంబంధం ఉంటుంది. త్యాగరాజుకు రామునితో అట్టి సంబంధం ఉండటంచేతనే, “రార మా ఇంటి దాకా.." అని ఎంతో స్నేహంగా, స్వేచ్ఛగా, పవిత్రంగా, ఆర్తితో పిలిచాడు.* 

*మీరు కూడా దైవాన్ని మీ పాత స్నేహితునిగా భావించి దైవంతో స్వేచ్ఛగా మెలగాలి. ఎన్నో జన్మలనుండి భగవంతుడు మీ వెంటనే వస్తున్నాడని విశ్వసించాలి. అదే నిజమైన భక్తుని లక్షణం.*
 
* మీరు భగవంతుడంటే భయం, భయంగా ఉంటే ప్రయోజనం లేదు. పరిపూర్ణమైన స్వేచ్ఛతో ఉండాలి. ప్రేమచేత, స్వేచ్ఛచేతనే దైవాన్ని పొందడానికి వీలవుతుంది.* 

*మీలో దైవభీతి ఉన్నంతవరకు దైవం లభ్యం కాడు. పాపభీతి ఉండాలి గాని దైవభీతి ఉండకూడదు. దైవప్రీతి ఉండాలి. దైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించాలి. అప్పుడే దైవం లభ్యమవుతాడు."*

No comments:

Post a Comment