[30/03, 2:48 am] pasupulapullarao@gmail.co: *ఆధ్యాత్మిక సాధన*
➖➖➖
*ఆధ్యాత్మిక సాధన చాలా కష్టమని మహాత్ముల చెబుతారు.*
*కొన తేలిన కొండ మీద కొన తేలిన రాళ్లతో ఉన్న మార్గంలో చెప్పులు లేకుండా నడవడం సులభం కానీ ఆధ్యాత్మిక సాధన మాత్రం కష్టం అని అన్నారు.*
*రెండు కర్రలమధ్య తీగ కట్టి ఆ తీగల మధ్య నడవడం ఆధ్యాత్మిక సాధన కంటే తేలిక అన్నారు.*
*ఎందుకని వీరు ఆధ్యాత్మిక సాధన అంత కష్టం అని అన్నారు. ఏముంది అందులోచూద్దాం ఇప్పుడు.*
*మనం అందరము వీటిలో అన్ని కానీ కొన్ని కానీ క్రమం తప్పకుండా చేస్తున్నాం కదా. ఇవే కదా ఆధ్యాత్మిక సాధనలు!*
*చూడండి!*
*1) రోజు కొంత సమయం పూజ చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*
*2) తీసుకున్న మంత్రం నిర్ణీత సంఖ్యలో జపం చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*
*3) ప్రతి రోజు గుడికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*
*4) ప్రతిరోజు ఒక గంట ధ్యానం చేస్తే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*
*5) ప్రతిరోజు సత్ గ్రంధాలు, మహాత్ముల చరిత్ర క్రమము తప్పకుండా చదివితే అది ఆధ్యాత్మిక సాధన కాదా?*
*6) ప్రత్రి రోజు ఇలా ముఖ పుస్తకంలో పోస్ట్లు పెడుతూ వారి స్పందనలకి పొంగిపోతూ, స్పందించపోతే రచ్చ రచ్చ చేస్తూ ఉంటే, అది ఆధ్యాత్మిక సాధన కాదా?*
*ఇలా ప్రశ్నించుకుంటు పోతే ఈ లిస్ట్ పెరిగిపోతుంది కానీ,*
*దురదృష్టవశాత్తు ఇవేవీ ఆధ్యాత్మిక సాధనలు కావు.*
*మరేంటి? అని కన్నెర్ర చేస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి బాబు.*
*మీరు వృత్తి విద్యా కోర్సులలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాస్తారు కదూ, ఎందుకు అంటే మీకు ఆ విద్యార్జనకి అర్హత ఉంది నిరూపించడానికి అంతే కదా,*
*అలానే పైవన్నీ ఆధ్యాత్మిక సాధన చేయడానికి మీకు కావాల్సిన అర్హతలు.*
*ఎంతో అహంకారం, మమకారం పేరుకుపోయిన మనకి, ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనపైకి జంప్ చేసే మనస్సుకు పైవన్ని వాటిని జయించే లేదా అధిగమించే సాధనలు.*
*అయితే వీటిలో నైపుణ్యం సంపాదించాక ఆధ్యాత్మిక సాధనలు మొదలు పెట్టాలా? *
*అంటే…*
*అక్కరలేదు అని జవాబు.*
*పై వాటికీ మీఆధ్యాత్మిక సాధనకు సంబంధం లేదు.*
*అవి చేస్తూ, ఇవి కూడా చెయ్యాలి.*
*ఇంతకీ ఆధ్యాత్మిక సాధనలు అంటే ఏమిటి అని అడుగుతారా?*
*సరే వినండి…*
*1) బహిర్ముఖంగా ఉన్న మనస్సును అంతర్ముఖం చేసి ఎఱుక కోల్పోకుండా ఉండే సాధన, ఆధ్యాత్మిక సాధన!*
*2) ఇంత వరకు మనని ఎవరో గమనిస్తున్నారు అన్న దృష్టి కోణం తో ఉన్నాము. అలా కాకుండా మనని మనం అనుక్షణం గమనిస్తూ ఉండడం ఆధ్యాత్మిక సాధన.*
*3) మనస్సుని ఏదైనా ఒక విషయం పై కనీసం ఒక 20 నిముషాలు వేరే ఆలోచన రాకుండా చూడటం ఆధ్యాత్మిక సాధన.*
*4) రైతు కలుపు మొక్కలు పీకివేసినట్టు, మనలో వచ్చే పనికి రాని ఆలోచనలను పీకి వేయడం ఆధ్యాత్మిక సాధన.*
*అలానే పనికి రాని, ఉపయోగం లేని, మాటలు మాట్లాడకుండా, మౌనంగా ఉండడం కూడా ఆధ్యాత్మిక సాధన.*
*5) మన వాస్తవాలకి మన ఆలోచనలే కారణం అని గ్రహించి,*
*ఏ వాస్తవాన్ని సృష్టించాలో మనమే నిర్ణయం తీసుకొని,*
*ఆ వాస్తవానికి ఇతరులని భాద్యులని చేయకపోవడం ఆధ్యాత్మిక సాధన.*
*6) నిరంతరం జిజ్ఞాసాపరులై, జ్ఞాన సముపార్జనకి, తేనెటీగ పువ్వుల నుంచి తేనె పువ్వులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రహించినట్టు, మనము కూడా మహాత్ముల దగ్గర నుండి అంత తేలికగా జ్ఞానం గ్రహించడం ఆధ్యాత్మిక సాధన.*
*7) 24x7 దైవ నామం ద్వారానో లేదా ఇంకేదైనా విధంగా అయినా, పరమాత్మని స్మరణ చేయడం ఆధ్యాత్మిక సాధన.*
*8) మనని మనం పరీక్ష చేసుకుంటూ, కావాల్సిన మార్పులు మన ఉన్నతి కోసం చేసుకుంటూ,*
*ఈ జన్మ తీసుకున్నందుకు మనము జన్మ తీసుకోక ముందు ఉన్న స్థితికి విలువ జోడించడం*
*(ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒక వస్తువుకి విలువ పెంచి దాని అమ్మకాలు పెంచి నట్టు, దీనిని ఆంగ్లంలో value added అంటారు)*
*ఆధ్యాత్మిక సాధన.*
*9) కావాల్సిన సాధన చేస్తూ, ఈ జన్మని ఆఖరిది చేసుకుంటూ, మళ్ళీ ఈ భూమి మీదకి జన్మ తీసుకొని రాకుండా, (ఎందుకంటే భూమిని పాఠశాల అంటారు కాబట్టి) చేసుకోవడం ఆధ్యాత్మిక సాధన.*
*10) అన్నిటికన్నా ముఖ్యంగా, మనని మనం నిమిత్త మాత్రభావముతో ఆ పరమాత్మ చేతిలో పనిముట్టుగా మారి నిరంతరం, తరంతరం ఆయన సేవకే మన ఉనికిని సార్ధకం చేసుకోవడం ఆధ్యాత్మిక సాధన.
సరైన సాధన ద్వారా మాత్రమే అద్భుతమైన సత్ఫలితాలు పొందుతారు.
[30/03, 2:48 am] pasupulapullarao@gmail.co: 💖💖💖
💖💖 *"509"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"ఆధ్యాత్మిక ఉన్నతి కోసం శరణాగతి చెంది ఉపదేశాలు అనుసరించాలా ?"*
*"గురువు పట్ల శరణాగతి ఏర్పడేకొద్దీ ఆయన మనలోనే ఉండి ఇదంతా ఎలా చేస్తున్నారనే విషయం అవగాహనలోకి వస్తుంది. "శరణాగతి పొందని వారికే ఉపదేశాలు" అని భగవాన్ శ్రీరమణమహర్షి నిర్ధ్వంధంగా చెప్పారు. నిజంగా మనం శరణాగతి చెందితే, సద్గురు మనలోనే ఉండి మనని ప్రతిక్షణం ఎలా నడిపిస్తున్నారో అర్ధం అవుతుంది. మనం గురువు నుండి ఉపదేశాన్ని, వారి కరస్పర్శను కోరుతుంటాం. అంటే మనమింకా పూర్తి శరణాగతి చెందలేదని అర్ధం. ఉపదేశ, కరస్పర్శలు నిజాయితీతో స్వీకరిస్తే శరణాగతికి సోపానాలు అవుతాయి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment