*:::::: శరీరము VS. మనస్సు ::::::::*
1)శరీరానికి నోటి ద్వారా ఆహారాన్ని అందిస్తాము.
మనస్సు కి విషయాలకు చెందిన విజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా అందిస్తాము.
2) శరీరానికి బాక్టీరియాల వల్ల జబ్బు చేస్తుంది.
మనస్సు రాగ ద్వేష మోహాల వల్ల దుఃఖం వస్తుంది.
3) వైద్యం శరీరాన్ని బాగు చేస్తుంది.
ధ్యానం మనస్సు ని బాగు చేస్తుంది.
4) శరీరానికి తగినంత ఆహారం, విశ్రాంతి, వ్యాయామం ఇస్తే సురక్షితంగా వుంటుంది
మనస్సు కి సజ్జన సాంగత్యం, అధ్యయనం, ధ్యానం ఇస్తే శాంతంగా వుంటుంది.
5) శరీరానికి మంచి ఆహారం, తగిన వాతావరణం, హాయి ని ఇస్తే
మనస్సు కి మంచి భావాలు, వాస్తవాలు హాయి ని ఇస్తాయి.
6) శరీరాన్ని తల్లితండ్రులు ఇస్తారు.
మనస్సు ని సమాజం నింపుతుంది.
7) శరీరాన్ని మనస్సు నడిపిస్తుంది.
మనస్సు కి ఆధారాన్ని శరీరం ఇస్తుంది.
8) శరీరం మరో శరీరాన్ని సృష్టిస్తుంది.
మనస్సు ఆత్మహత్య చేస్తుంది
*షణ్ముఖానంద98666 99774*
No comments:
Post a Comment