Wednesday, March 8, 2023

మనస్సు - సాధన

 *_నేటి మాట_*
    
        *మనస్సు - సాధన*

సుఖశాంతులతో జీవించాలంటే మనసుకు మంచి విషయాల్లో శిక్షణ ఇవ్వాలి. 
భగవంతుడు ప్రతి ఒక్కరికి తెల్లటి వస్త్రం లాంటి స్వచ్ఛమైన మనసును ఇచ్చి పంపాడు. 
దానికి ఏ రంగు కావలసిన వారు ఆ రంగు వేసుకోవచ్చు, మానవుని మనస్సుకు దేన్నైనా అలవాటు చేయవచ్చు.

చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకోవటం దగ్గర నుండి ప్రతీది చేసుకున్న అలవాటే గానీ.. అది మనసు సహజ లక్షణం కాదు. 
విద్యార్థికి ఏ సబ్జెక్టు కష్టంగా ఉందో దాన్నే ఎక్కువ సేపు చదివిస్తారు. 
అలాగే మనకు ఏ మంచి గుణాలు పాటించటం కష్టంగా ఉంటే దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

రాత్రంతా స్నేహితులతో ముచ్చట్లు చెప్తే రాని విసుగు, నిద్ర.. భజనలో కూర్చుంటే ఎందుకు వస్తాయి. 
మనస్సు కున్న గుణాలు ఏమిటో మనకు తెలిస్తే వాటిని మార్చుకోవడం సాధ్యమవుతుంది. 
అందుకే ముందుగా మనస్సు ని అర్థం చేసుకొని దానిని ఆధ్యాత్మిక సాధన వైపు మలచాలి. 
మనసుకు సద్గుణాలు అలవర్చటమే సాధన...

               *_🪷శుభమస్తు🪷_*
    🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment