Wednesday, March 8, 2023

ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.

 ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే,
ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.
           - మహాత్మగాంధీ 

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే, 
పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.
             - నెహ్రు 

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి, ఇక్కడ 
పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.
         - ఫెడ్రంట్ రసెల్ 

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు, కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.
          - ఆల్బర్ట్ ఐన్స్టెయిన్ 

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు, జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు 
       -నెల్సన్ మండేలా 

🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,
📘 పుస్తకం అన్నారు .
                   - లెనిన్

పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు 
పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంట, కానుకగా ఆ  వ్యక్తి 
       - లెనిన్ 

📚 ఒక్కో చిత్రం నటించాక,  తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.
              -చార్లీ చాప్లిన్ 

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.
              - విన్స్టెన్  చర్చిల్ 

📚  భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు, పుస్తకాలని చెప్పారు.
            -మార్టిన్ లుతెర్కింగ్ 

📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు,  పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.
                    - భగత్ సింగ్ 

          📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.
             - అబ్రహం లింకన్ 

📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, 
            అతడే నా మార్గదర్శి అన్నారు.
           -జూలియస్ సీసర్ 

           🌏 ప్రపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,  అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.
                       -టెస్కార్డ్స్ 

         📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు, ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.
              -ఇంగర్సాల్ 

         🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, 
         అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.
               -సిగ్మెంట్ ఫ్రాయిడ్ 

             📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని,  పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.

            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే 

           📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.
           📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚సేకరణ మిత్రుని‌వాట్సప్.

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

No comments:

Post a Comment