230323g1941. 240323-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀*మన ఆరోగ్యం…
*వాకింగ్ (నడక) ఎందుకు చేయాలి ?*
➖➖➖✍️
*ఎక్సర్ సైజ్ లలో నడకను మించిన తేలికపాటి వ్యాయామం ఏది లేదు.*
*ఏ వయస్సు వారైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా నడకను కొనసాగించవచ్చు. దీని కోసం పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.*
*పై పెచ్చు మిగతా వ్యాయామాల కన్నా సురక్షితమైనది. నడక వలన బరువు తగ్గటంతో పాటు ఎన్నో ఉపయోగాలు, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.*
*గుండె పనితీరును క్రమబద్దం చేయటంతో పాటు, ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుంది.*
*ఎముకల పట్టుత్వానికి సహాయపడుతుంది.*
*ఎటువంటి కారణం లేకుండా బాధించే ఒత్తిడి, ఆందోళన వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.*
*మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి దారి తీస్తున్నాయి. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ దీని బారిన పడుతున్నారు.*
*బరువును తగ్గించుకోవటానికి నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు.*
*ఒక పౌండ్ బరువు పెరగటం అంటే అదనంగా 3500 కేలరీలు శరీరంలోకి వచ్చి చేరినట్లే.*
*ప్రతి రోజు క్రమం తప్పకుండా నడిస్తే వారంలో ఒక పౌండ్ తగ్గే అవకాశం ఉంది.*
*ఒక మైలు(సుమారు ఒకటిన్నర కిలో మీటర్లు) దూరాన్ని 13 నిముషాల కంటే తక్కువ సమయంలో నడిస్తే ఎక్కువ కేలరీలను కరిగించుకోవచ్చు. ఒక మైలు దూరం నడిస్తే 100 కేలరీలు ఖర్చు అవుతాయి. ఈ లెక్కనా ఎంత బరువు తగ్గాలని అనుకుంటారో.. అన్ని మైళ్ళు ప్రతి రోజు నడవాలి.*✍️
🌷🙏🌷
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment