*:::::::: మూఢ నమ్మకాల కాళ్ళు :::::::::::*
ఒక కుర్చీ లేదా బల్ల లేదా బెంచి నిలబడాలంటే దానికి బలమైన కాళ్ళు అవసరం.
మనకు నమ్మకాలు అనేకం వుంటాయి. వీటిల్లో కొన్ని సత్యాలు కూడా అయివుండవచ్చు. కాని అన్ని నమ్మకాలు సత్యాలు కావు. మరికొన్ని మూఢనమ్మకాలు వుంటాయి.
మూఢ నమ్మకాలు మన దృష్టిలో సత్యాలే. ఇందుకు కొన్ని నిదర్శనాలు, నిర్ధారణలు మనకు వుంటాయి, అవి ఏమిటో చూద్దాం. అయితే ఇవి శాస్త్రీయ నిదర్శనాలా అంటే కాకపోవచ్చు.
1) *అనుభవం*. నా నమ్మకాలను బలపరిచే కొన్ని అనుభవాలు నాకు వుంటాయి.ఉదా పిల్లి ఎదురైతే విజయం నాకు లభించ లేదు.
2) *ప్రజల ఆమోదం* నా చుట్టూ వున్న వారిది కూడా ఇదే అభిప్రాయం.
3) *పెద్దలు* మా కుల పెద్దలు,కులం గురువులు ఇదే చెపుతున్నారు.
4) *ఇతర కారణ లేమి* దీనికి విడిగా మరోక కారణం నాకు తెలీదు.
నా నమ్మకాలు పై బలమైన కాళ్ళ మీద నిలబడి నన్ను నమ్మబలుకుతున్నాయి
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment