💖💖💖
💖💖 *"529"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మాయ యొక్క విస్తృతి ఎలా ఉంటుంది ?"*
*"మనకు విత్తు కనిపిస్తుంది. ఆ విత్తనం నాటితే వచ్చే చెట్టూ కాలగమనంలో కనిపిస్తుంది. ప్రతి విత్తనంలోనూ చెట్టు దాగి ఉంది. ప్రతి చెట్టులోనూ విత్తనం ఇమిడివుంది. కానీ అవిగా వ్యక్తం అయ్యే వరకు మనకు కనిపించవు. అందుకే ఈ సృష్టి మాయ అయ్యింది. ఏది శాశ్వతంకాదో అదంతా మాయే. సాధారణ పరిభాషలో 'మాయ అంటే ఉన్నట్లు కనిపిస్తున్నా లేనిది' అనే అర్ధంలో వాడుతాం. ఒక విషయం నుండి తాను కోరుకున్న అనుభవం ఎదురుకాకపోతే కూడా దాన్ని మాయ అంటాం. పిల్లాడిని సినిమాకు తీసుకువెళతామని చెప్పి తర్వాత మభ్యపెట్టి తీసుకువెళ్ళకపోతే మనం మాయ చేస్తున్నామని అంటాడు. ఏర్పడిన అనుభవం నిలబడటంలేదని తెలిసికూడా మళ్ళీమళ్ళీ కోరడం కూడా మాయే. మనసంతోషం, మనదుఃఖం ఏదీ నిలిచిఉండవు. కనుక అవి కూడా మాయే !!"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment