Sunday, April 23, 2023

తెలుగు వాళ్ళు అరుణాచలం అంటారు కానీ మరి తమిళ వాళ్ళు తిరువన్నామలై అంటారు దాని అర్థం ఏమిటి?

 [4/11, 06:05] Ramana Samuham: తెలుగు వాళ్ళు అరుణాచలం అంటారు కానీ మరి తమిళ వాళ్ళు తిరువన్నామలై అంటారు దాని అర్థం ఏమిటి?
[4/11, 06:07] Ramana Samuham: స:అన్నామలై(తమిళ్) అంటే అరుణాచలం(తెలుగు) అని అర్ధం ఎర్రగా కదలకుండా ఉన్నది అని దాని పూర్తి అర్ధం అది అని అందరికి తెలిసిన విషయమే.ఈ తిరు అని ఎక్కడ వచ్చిన అది చాలా పవిత్రమైన శబ్దం అని గుర్తుంచుకోండి ఈ తిరు అంటే అమ్మవారి శక్తికి సంకేతం అంటే తిరు అంటే శ్రీ అని అర్ధం వస్తుంది.శ్రీ అని ఎక్కడ వచ్చిన అక్కడ అమ్మవారిని సంకేతంగా చూపిస్తున్నారు అని భావం ఇది ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే "శ్రీ మాత్రే నమః" శ్రీ మాతకు నమస్కారం అని అర్ధం,శ్రీరామ అంటే సీతారామ అని అమ్మవారిని కలిపి చెప్పుకున్నట్టు,తిరుమల,శ్రీశైలం వీటి అర్ధం అమ్మ వారి కొండ అని అర్ధం వస్తుంది.తిరుపతి అంటే అమ్మవారి పతి లక్ష్మీ స్వరూపంలో శ్రీ మహా విష్ణువు అని వస్తుంది అందుకే తిరుపతికి ఆ పేరు పెట్టారు.శ్రీనివాసుడు అంటే అమ్మవారిని నివాసంగా చేసుకున్నాడు కదా అదే ఆయన హృదయంలో ఉంచుకున్నాడు కదా అందుకే ఆయనను ఆ పేరుతో పిలుస్తారు.తిరువణ్ణామలై అంటే అర్థం శ్రీ అరుణాచలం అంటే అమ్మవారిని అయ్యవారు విడదీయలేనట్టు ఒక శరీరంలో అర్ధనారీశ్వరుడు గా అయిపోయిన ప్రదేశం అందుకే తిరువన్నామలై పేరు పలకాలి అంటే తిరు అన్నామలై విడిగా వ అని పదం మిస్ అవుతుంది అమ్మవారు లేకుండా శివుడు ఒక్కడే ఉన్న లేదా ఆయనని విడిచి ఆమె ఉన్న ప్రదేశం అంత శక్తివంతంగా ఉండదు ఆ పేరు ని కలిపి పలకండి చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఇద్దరు ఉన్న ఏ క్షేత్రమైన అది మహా శక్తివంతమైనది అని మనకు ఋషులు మన శాస్త్రాలలో తెలియచేసారు ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండరు ఉండలేరు.ఇప్పుడు తిరువన్నామలై అంటే అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారు అని అర్ధం వచ్చేలాగా ఆ పేరుతో తమిళ్ వాళ్ళు ఈ క్షేత్రాన్నే కాకుండా వాళ్ళ చాలా క్షేత్రాల్ని తిరు ని కలిపి అలా పిలుస్తుంటారు.మొత్తానికి చెప్పాలంటే తిరువన్నామలై అంటే అమ్మవారితో కలిసి ఉన్న శివుడిగా ఉన్న కొండ అని పూర్తి అర్ధం.తెలుగు వాళ్ళు ఎందుకు అలా పిలవరంటే అక్కడ అది దైవం(శివుడు) పేరు మీద ఉన్న కొండ కాబట్టి మిగతా ఏ శబ్దాలు వాడకుండా కేవలం ఆ ఒక్క పేరుతోనే పిలుస్తారు.ఏ అమ్మవారి తత్వానికైనా(స్వరూపానికైనా) శుభప్రదమైన దానికి సంకేతంగా "శ్రీ"(తిరు) వాడతారు.ఎప్పుడైనా ఈ పదం వస్తే ఆ క్షేత్ర దైవం అమ్మవారితో కలిసి ఉన్నారు అని అర్ధం చేసుకోండి.గొప్ప గొప్ప క్షేత్రాల పేర్ల మీద కూడా మన పెద్దలు ఎంత ఆలోచించి పెట్టారో గమనించండి.ఊరికే ఏదో అలా అనేయ్యడానికి పెట్టెయ్యలా చాలా అర్ధం వచ్చేట్టు పెడతారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమః

No comments:

Post a Comment