🪷 *"భగవాన్"* 🪷
🪷🪷 *"శ్రీ రమణ మహర్షి"* 🪷🪷
🪷 *""వాణి ముత్యాలు""* 🪷
🪷🍇🪷🍇🪷🍇🪷
🪷🍇🕉️🍇🪷
🪷🍇🪷
🪷
*"జనన మరణాలు, భూత ,భవిష్యత్ ,వ ర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే . కాలం అఖండం!"*
*"నీవు- నేను అన్న ద్వైతం, మనం అనుకుంటున్నదే!"*
*"అపరిణామము కాలాద్య విచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతము .అది మార్చదగనిది."*
*"బంధము, బంధన ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు"*
*"అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ"*
*"వైరాగ్యం ఒక అంతరంగ భావన"*
*"ఇవన్నీ సహజస్థితులే.."*
*"ప్రపంచమంతా పరమాత్మ రూపమే."*
*"నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవం లోకి వస్తుంది."*
*"దేహమే" అసలు నీవు" కానప్పుడు నీవు కర్తవూ కాదు. నీకు కర్తృత్వమూ లేదు."*
*"జరుగుతున్న అనేక విషయాలలో ప్రమేయం నీ నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవడం లోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం.కర్మలన్నింటికి నీవు కర్తవు కాదు ..కర్మలు జరుగుతూనే ఉంటాయి."*
No comments:
Post a Comment