Wednesday, April 5, 2023

:::::::: చూసేవాడు ::::::::

 *::::::::::  చూసేవాడు ::::::::::*

      చూచేవాడు వున్నంతకాలం,
చూడబడేది కలుషితం కాబడుతుంది.

       కారణం చూచేవాడు చూసేది తను చూడ తలచు కున్నదే గాని  అసలు అక్కడ వున్నది కాదు.
    చూచే వాడు  చూడ టానికి ముందుగానే తాను ఏమి చూడాలను కున్నది, ఎందుకు చూడాలను కున్నది మొదలగు , కోరికలతో, ఉద్దేశాలతో,లక్ష్యాలతో,చూచిన అనుభవాలతో, జ్ఞానంతో వుంటాడు  
       ఇవి చూడటాన్ని కలుషితం చేస్తాయి. అప్పుడు అతడు చూసేది యదార్థతను
 కాదు.

 ఇక్కడ చూచేవాడు అంటే కోరికలు, ఉద్దేశాలు, జ్ఞానం,అనుభవాలు, అని అర్ధం. ఇవి లేనప్పుడు ఉండేది స్వేచ్చ మైన చూపు మాత్రమే.

    ధ్యానం  చూపును మాత్రమే కలిగి వుండి,ఉన్నది ఉన్నట్లుగా చూడ నిస్తుంది.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment