🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌹🙏శ్రీహరి దశావతారాలు :🙏🌹
🌹1. మత్స్యావతారం :🌹
🌿వైవస్వతమను ఒకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా.ఒక చేపపిల్ల అతని చేతిలో పడుతుంది. అది పెరిగి పెద్దదవుతుండగా గంగాళంలోను, చెరువులలోను, సరస్సులోను వేశాను.
🌿అయినా అది పెరుగుతుండడంతో దాన్ని సముద్రంలో వేశాడు. అప్పుడు ఆ చేప మనుపుతో ‘‘ప్రళయ కాలంలో ఒక నావ వచ్చును. దానిలో సప్తమహర్షులు, నీవు ఎక్కి కూర్చోండి.
🌸ప్రళయాంతం వరకు ఆ నావను మహాసముద్రంలో నా కొమ్ముకు కట్టుకుని, లాగుకొని పోవుచునెయుందు’’అని చెప్పెను. మను అలాగే చేసి ఆ ప్రళయాన్ని దాటుతాడు. మళ్లీ బ్రహ్మసృష్టి చేయడానికి పూనుకున్నప్పుడు హయగ్రీవుడనే రాక్షసుడు (ఇతనిని సోమకాసురుడు అని కూడా అంటారు)
🌿వేదాలను అపహరించి, సముద్రంలో దాచిపెట్టగా, శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని మళ్లీ ధరించి, వానిని సంహరించి, వేదాలను మళ్లీ బ్రహ్మ దగ్గరకు చేరుస్తాడు.
🌹2. కూర్మావతారం : 🌹
🌸దుర్వాసుని శాపంవల్ల ఇంద్రుడు సంపదలన్ని సముద్రంలో కలిసిపోగా విష్ణుమూర్తి సలహా మీద దేవదానవులు సముద్రాన్ని మథించారు. ఈ పాలసముద్రాన్ని మథించడం ప్రారంభించినప్పుడు కవ్వంగా వేసిన మందరపర్వతము మునిగిపోసాగింది.
🌿అప్పుడు నారాయణుడు కూర్మావతారం ధరించి, దాని క్రింద ఆధారంగా నిలబడతాడు. దానితో సముద్ర మథనము జరిగి సర్వవస్తువులు, అమృతాలు పుట్టకొచ్చాయి.
🌹3. వరహావతారము :🌹
🌸 హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి, స్వర్గాన్ని ఆక్రమించేటప్పుడు అతనిని యజ్ఞవరాహ రూపంతో సంహరించెను.
🌹4. నృసింహావతారం : 🌹
🌿అతని సోదరుడు హిరణ్యకశిపుడు తరువాత దేవలోకాన్ని ఆక్రమించి యజ్ఞభాగాలను కాజేయగా, నారసింహరూపం ధరించి అతనిని సంహరించెను.
🌹5. వామనావతారం : 🌹
🌸బలిచక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గంనుండి తరిమివేయగా.. శ్రీహరి వామనుడైపుట్టి బలిని మూడడుగుల నేల అడిగి, వామనుడు అవామనుడై రెండడుగులలో భూమి, ఆకాశాలను ఆక్రమించి, అతనిని పాతాళానికి తొక్కేశాడు.
🌹6. పరశురాముడు :🌹
🌿శ్రీహరి తన అంశంతో జమదగ్నికి పరశురాముడై పుట్టి, మదాంధులై రాజులను ఇరవైఒక్కసార్లు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు వెళ్లిబోయాడు.
🌹7. శ్రీరాముడు : 🌹
🌸రావణ, కుంభకర్ణులను సంహరించడానికి దేవతలు ప్రార్థించిన తరువాత దశరథునకు రామునిగా పుట్టి, సీతను పెళ్లి చేసుకుని, సీతాలక్ష్మణులతో అరణ్యవాసం చేసి అనేక రాక్షసులను వధించాడు.
🌿 రావణుడు సీతను ఎత్తుకుని పోగా, సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్లి రావణకుంభకర్ణ రాక్షసులను సంహరించి, అయోధ్యకు వచ్చి పట్టాన్ని కట్టుగొన్నాడు. లోకాపవాదానికి భయపడి సీతను అడవిలో వదలగా. ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది.
🌸అప్పటికే గర్భవతియై వున్న సీత, అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదకొండేళ్లు రాజ్యం చేసి, కుశునికి పట్టాభిషేకం చేసి, సీతాసమేధుడై అయోధ్యాపురవాసులతో సహా పరమపదానికి వేంచేశాడు.
🌹8. శ్రీకృష్ణావతారం : 🌹
🌿ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలో అధర్మప్రవృత్తులైన రాజులవల్ల భూభారం పెరిగినప్పుడు.. భూదేవి కోరికపై శ్రీహరి, కృష్ణావతారాన్ని ఎత్తెను.
🌸దేవకీ, వసుదేవులకు అష్టగర్భమున జన్మించి, రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి, బాల్యక్రీడలతో వారిని అలరించి, దుష్టరాక్షసులను సంహరించాడు. మధురాపురానికి పోయి కంసుని సంహరించి, మాతామహుని రాజ్యాన్ని నిలిపి, బలరామునితో కలిసి శత్రువులను నిర్మూలించాడు.
🌸 రుక్మిణ్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరుకుని చంపి 16000 మందిని అతని చెరనుండి విడిపించి, వారిని పెండ్లాడాడు. ద్వారకా నగరాన్ని నిర్మించి, భార్యాపుత్రబంధుమిత్ర పరివారంతో నూటపాతికయేండ్లు భూలోకంలో నివసించాడు.
🌿భారత యుద్ధంలో పాండవుల పక్షంనుండి అధర్మపరులను నాశనం చేశాడు. తరువాత యాదవులు మదించి, అధర్మంగా ప్రవర్తిస్తుండగా ముసలం వంకతో వారిని కూడా సంహరించి, తాను పరమపదానికి చేరెను.
🌹9. బుద్ధావతారం :🌹
🌸గౌతమ బుద్ధుడు పేరు సిద్దార్ధ అయన దశావతారములో ఉన్న బుద్ధా పేరు పెట్టుకున్నాడు. బుద్దావతారము క్షణ కాలము మాత్రమే ఉంది. విష్ణుమూర్తి రాక్షసుని చంపడానికి దిగంబర అవతారము ఎత్తుతాడు.
🌿అందుకని ఈ అవతారమును పూజించరు. అంతకు ముందరి అవతారమైన కృష్ణావతారమును పుజిస్తారు. కృష్ణార్పణం అంటారు. బుద్దార్పణం అనరు.
🌸త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేక పోతారు.అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింప చేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు.
🌿సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు.
🌸ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము "లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడు అని అర్ధం.
పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు. 🌸'పురసతుల మానములు పొల్లజేసినచేయి. ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు. వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు.
🌿అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది..
🌹10. కల్క్యవతారం : 🌹
🌸బుద్ధుని బోధనల ప్రభావం భోలోకంలో వున్న రాజులపై ప్రసరిస్తుంది. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తిస్తారు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేదకర్మలను ఆచరించక వుంటారు. అప్పుడు కలియుగంలో విష్ణుయశుడను వానికి శ్రీహరి, కల్కిరూపంతో జన్మించెను. ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించాడు.
🌿ఇలా శ్రీమన్నారాయణుడు ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తాడు. అవన్ని ధర్మసంస్థానం చేయడానికినని గ్రహించుకోవాలి...సశేషం..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
No comments:
Post a Comment