Saturday, April 15, 2023

::::: నేను కన్నా నాకు,నాది బలమైనవి ::::

 *:::  నేను కన్నా నాకు,నాది బలమైనవి  ::::*

           మనందరం జీవిత కాలంలో ఏదో రూపంలో ఎంతో కొంత నష్ట పోయి వుంటాము‌.

    ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల వల్ల, రోగాలు, జబ్బుల వలన, వ్యాపారంలో, మొదలగు కారణాలు వల్ల నష్ట పోతాము.

   మరో రకమైన నష్టం వుంది. అది తోటి మనిషి చేసేది.
అప్పుగా తీసుకున్నది ఎగట్టడం, లేదా మోసం చేయడం. ఇది కూడా నష్టమే.
  మొదటి నష్టం లో దుఃఖం ఒక్కటే వున్నది.  అక్కడ నేను నష్టం పోయాను అనేది మాత్రమే వుంది. రెండవ నష్టం వల్ల దుఃఖానికి తోడు ఆ వ్యక్తి మీద ద్వేషం,కోపం, కక్ష వచ్చాయి.
    రెండవ ఉదాహరణలోని ద్వేషం,కోపం  జరిగిన నష్టంలో వల్ల రాలేదు. నాకు మోసం చేసాడు అనేది వుంది.
    అనగా  వచ్చిన ద్వేషాదులు సందర్భోచితం కాదు. మనస్సు వండింది.
 నేను లో ఐడెంటిటీ మాత్రమే వుంది.
నాకు లో ఐడెంటిటీ మరియి క్రియాత్మకత వుంది
నాది లో చెందటం వుంటుంది.
  *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment