హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏
మానవునికి ముక్తి అనేది అవసరమా ... ఇది రెండవ ప్రశ్న.
జనక రాజర్షి జ్ఞానం గురించి ప్రశ్నించిన తరువాత దాని యొక్క ఫలమైన కైవల్యం గురించి ప్రశ్నిస్తున్నారు
శక్తి.. యుక్తి.. భుక్తి .. ముక్తి మానవునికి ఈ నాలుగే మానవునికి అవసరాలు.
గర్భస్థ శిశువు నుండి శరీరాన్ని వదిలే వరకు సకల అవసరాలు పరిశీలిస్తే ఇవి నాలుగే
స్వామి నిర్భయానందులు చెప్పిన.. కైవల్యాశ్రమ సత్సంగ సభ్యులందరూ తప్పక ఆచరించవలసిన సాధన .. శ్వాసతో సమంగా జపం చెయ్యాలి .. శ్వాసని గమనించాలి ... పంచాక్షరి మంత్ర జపం శ్రధ్ధగా చేయాలి. అదే నీ తరుణోపాయం.
ఇది సాధించ బడక పోతే ఈశ్వర దర్శనం పూర్తవదు... షట్చక్రాది దేవతలందరూ అనుగ్రహించాలి.
స్వామి నిర్భయానందులు .. ఒక జంక్షన్ లో ఉన్నావు ఎటుపక్కకు వెళ్ళాలో ... సూచించే మార్గ సూచి గురువు.
ప్రాణమే స్వాధీనం కాక మనసు స్వాధీనంకాదు ... మనసునే స్వాధీనం చేసుకోలేనివారు .. చైతన్యాన్ని చేసుకొనలేరు.
తపశ్శక్తి .. ఋషి తుల్యమైన జీవనం ఉండాలి.
వైక్లబ్యం వస్తూ ఉంటే భోగమే
రెండు బాధల మధ్య సుఖం.. సంతోషంగా అనుభవాన్ని పొందుతున్నావు. బంధం బాధ ముక్తికి కారణం అవుతుంది.
సాధన చేతిలో దీపం లాంటిది. దారి చూపిస్తుంది .. కాలహరణం లేక .. జాగ్రత్తగా పక్కకు తప్పుకోకుండా వెళ్ళాలి.
ముక్తి రెండు విధాలు .. మరణానంతర ముక్తి .. జీవన్ముక్తి.
సమస్త కర్తృత్వ ... భోక్తృత్వాలను త్యజించి ... సర్వ సాక్షివై జీవన్ముక్తిని పొందు .. జీవో బ్రహ్మైవనా పర: ...
అన్ని బంధాలకు కారణం ద్వంద్వానుభూతి.
వాసనామయం.. సంస్కార భూఇష్టం... గుణ సంయోజనం కలిగి ఉండేది ద్వంద్వాను భవం
ఎవరి ప్రపంచాన్ని వాడు నిర్మించుకుంటాడు సాలెపురుగు వలే .. అంటుంది వేదాంతం.
నైతిక విలువలతో ఏది ధర్మం .. ఏది అధర్మం .. నైతిక జీవనం మొదటి పరిణామం
ధర్మా ధర్మ విచారణ .. ధార్మిక జీవనం .. రెండవ మెట్టు
ఏది వివేకం .. ఏది అవివేకం మూడవది .. బంధం ఏది ముక్తి ఏది నాలుగవ విచారణ.
యామతి: సాగతి: .. శంకరులు
సాధకుని గొప్ప సూత్రం.
ఆవరణ రహితమైతే సర్వభ్రాంతి రహితమవుతుంది ... సర్వ బంధ రహితమవుతుందని ... బ్రహ్మ జ్ఞానం ద్వారా నిర్ణయం పొందటమే ముక్తి.
శ్రీ విద్యాసాగర్ స్వామి వారు
అష్టావక్రగీత -9
జై గురుదేవ 🙏
💐🌹💐🌹💐🌹💐🌹💐🌹
No comments:
Post a Comment