Thursday, April 13, 2023

:::::తెలియని భయాలు, ఆందోళనలు ::::::

 *తెలియని భయాలు, ఆందోళనలు*
   కన్ను  కొన్ని దృశ్యాలను, చెవి కొన్ని శబ్దాలను , నాలుక కొన్ని రకాల రుచులను , ముక్కు వాసనలను ఇష్టపడుతుంది.
ఉద్వేగాలకు గురి అవుతుంది.
     మనస్సు కూడా తనలో దాగిన కొన్ని రకాల జ్ఞాపకాలను  ఇష్ట పడుతుంది. ఇలా ఇష్ట పడే జ్ఞాపకాలను పదేపదే మననం చేసుకుంటూ, ఇతరులతో పంచుకుంటూ, వుంటుంది.
  అయిష్ట పడే జ్ఞాపకాలను మర్చి పోవడానికి, ప్రయత్నించి వల్ల కాక ఉపరితలం మీదకు రాకుండా అణచివేస్తుంది.
  అణచి వేయబడిన జ్ఞాపకాలు , మారు వేషంలో ఆలోచనగా, మాటలుగా , చేష్టలుగా బయట పడతాయి.అవే తెలియని
భయాలు, ఆందోళనలు.
     ఉదాహరణకు.. మనం దేనినో చూసి భయ పడతాము. నిజానికి చూచినది భయపెట్టేది కాదు. కాని భయం పడుతున్నామంటే  మన భయం ఎదురుగా మనం చూసే దానివల్ల కాదు. ఈ భయం అణచు కున్న,లేదా మరచిన  జ్ఞాపకాల ఫలితం. మనం ఇప్పుడు చూస్తున్నది పాత జ్ఞాపకాలను తట్టి లేపింది.
 *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment