Sunday, April 23, 2023

****శ్రీరమణీయం: మాయ ఎందుకు పుడుతుంది ? ఎలా పుడుతుంది !?

 💖💖💖
       💖💖 *"528"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మాయ ఎందుకు పుడుతుంది ? ఎలా పుడుతుంది !?"*

*"మనకు తెలియకుండా జరిగిపోయే పరిణామానికి మనం పెట్టుకున్న పేరు మాయ ! మనం ఎందుకు-ఎక్కడ-ఎలా పుడుతున్నామో మనకు తెలియదు. ఎలా చనిపోతున్నామో కూడా తెలియదు. ఏదైతే మన చేతుల్లో లేదో అది మనకి తెలియకుండానే జరుగుతుంది. ఏది మనకు తెలియకుండా జరుగుతుందో అదంతా మాయగా అనిపిస్తుంది. ఆది నుండి ఫలం వరకూ విషయమంతా మనకు తెలిసిఉంటే దాన్ని జ్ఞానం అంటాం. వెలుతురు లేనిచోట చీకటి ఉన్నట్లు, జ్ఞానం లేనిచోట మనసు పొందే స్థితి మాయ. చిన్న పిల్లలతో ఆడుకుంటూ జేబు నుండి తీసిఇచ్చిన చాక్లెట్టునే సృష్టించామని నమ్మిస్తాం. అక్కడ మనం ఇచ్చిన చాక్లెట్ సత్యమే కానీ అది సృష్టించి ఇచ్చామని పిల్లలు నమ్ముతున్న విషయం అసత్యం. ఇక్కడ ఏమి జరిగిందో పిల్లలకు తెలియలేదు కనుక దాన్ని మాయ అంటున్నాం. ఈ సృష్టి విషయంలో మన పరిజ్ఞానం కూడా మాయగానే ఉంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment