Sunday, April 23, 2023

అరుణాచలంలో మనకు పరమేశ్వరుడు ఏ రూపంలో దర్శనం ఇస్తాడు?

 [4/18, 16:44] +91 85198 60693: అరుణాచలంలో మనకు పరమేశ్వరుడు ఏ రూపంలో దర్శనం ఇస్తాడు?
[4/18, 16:46] +91 85198 60693: స:పంచ భూత లింగాలలో అగ్నికి ప్రతీకగా పరమేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు.ఇక్కడ పరమేశ్వరుడు మూడు రూపాలుగా వ్యక్తమవుతున్నాడని వ్యాస మహర్షి విరచిత స్కాంద పురాణంలో మహేశ్వర కాండ లో ఉన్న అరుణాచల మహాత్యంలో చెప్పబడింది.ఆ మూడు రూపాలు ఏంటి అంటే దానిలో మొట్టమొదటిది అగ్ని లింగ స్వరూపమైన అరుణాచలేశ్వరుడు మనకు గిరిగా దర్శనమిస్తున్నాడు.ఇది ఈ సృష్టిలో ఉన్న చరాచర జీవులకు ప్రదక్షిణ అనే నెపంతో పరమేశ్వరుడు కరుణార్ధ్ర హృదయుడై దేవతలు,జంతువులు,మనుషులు అందరూ తరించడానికి ఈ రూపం తీసుకున్నాడు.ఇంకా రెండవది ఏంటి అంటే అంత పెద్ద కొండ కి అభిషేకం,పూజ చెయ్యాలంటే ఏ మానవ,దేవతల వల్ల కాదు అది అసాధ్యమైన పని అందుకే అందరూ అభిషేక,పూజాదులు చేసుకోవడానికి ఆ పరమేశ్వరుడే మళ్ళీ కరుణతో అగ్ని లింగంగా మహర్షులు,దేవతల ప్రార్ధన మేరకు స్వయంభువుగా వెలిసాడు.ఇది అరుణాచలేశ్వర ప్రధాన ఆలయంలోని శివలింగం.ఇంకా మూడవది అరుణగిరి యోగి అంటారు.అరుణగిరికి ప్రధాన అధికారి ఈయనే సాక్షాత్తు  దక్షిణామూర్తి స్వరూపం ఆయనే పరమేశ్వరుడు అయిన సదా శివుడు.దేవతలు,మహర్షులకు తప్ప మనిషి కంటికి కనబడని స్వరూపం ఈ స్వరూపం మనిషి కంటికి కనిపించదు కానీ ఎవరైతే సాధన ద్వారా మనం ప్రతిరోజు కలలు కంటుంటాం కదా ఆ స్థితికి స్వయంగా మనం నియంత్రించుకునే స్థాయికి వెళ్తే మనకు ఆ స్వరూపం మానసికంగా దర్శించే అవకాశం ఉంటుంది.దీని గురించి పూర్తిగా చెప్పాలంటే మనకు(ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి)మూడు అవస్థలు ఉంటాయ్ అవేంటంటే జాగృత్,స్వప్న,సుషుప్తి(గాఢ నిద్ర) ఇంకో స్థితి కూడా ఉంటుంది అది మాములు జీవి అది మనిషైనా గాని ,జంతువులు,దేవతలు అయినా గానీ దీన్ని అందుకోవడం కష్టం.అదే తురియాతీత స్థితి.సచ్చిదానంద స్థితి ఇదే నాలుగవ స్థితి అంటే ఇదే పరమేశ్వరానుగ్రహం ఉన్నవాళ్ళకి తప్ప ఎవరికి సాధ్యం కాని స్థితి.మనం ధ్యానంలో స్వప్నావస్థ దాటి ముందుకు వెళ్లి  దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే ఆయన దర్శనం మానసికంగా అవుతుంది తప్ప ఇంకా మాములు కంటికి కనిపించని నియమం పెట్టాడు పరమేశ్వరుడు. దేవతలకు,మహర్షులకు ఆ స్వరూపం,మనుషులకు ఆలయంలోని అగ్ని లింగం,ఇంకా దేవతలు,మహర్షులకు, మనుషులు,జంతువులకు ఏ భేద భావం చూపకుండా ఉన్న స్వరూపం అరుణగిరి.ఆ ప్రదక్షిణ లో అందరూ సమానమే.

No comments:

Post a Comment