Sunday, April 16, 2023

::::: కాలక్షేపం :::::

 *:::::::::: కాలక్షేపం ::::::::*
               పిల్ల వాడి బొమ్మ పాడైపోతే మనం మరో బొమ్మ ఇస్తాం. ఎందుకంటే బొమ్మ తో ఆడుకుండా శాంతంగా వుండ లేడు. వీడికి  బొమ్మ సర్వస్వం, మరియు కాలక్షేపం.
      మనకి కూడా  బొమ్మ లాంటిది  కాలక్షేపం కోసం కావాలి. కాలక్షేపం లేకుండా మనం శాంతంగా వుండలేము.
   కాకపోతే మనకు కాలక్షేపం ఇచ్చేవి చాలా వున్నాయి.
        అవి రాజకీయం లేదా  భక్తి లేదా వ్యసనం, గురువు, దేముడు నమ్మకం, సిద్ధాంతం, తాయెత్తు, మంత్రం, వీటి చుట్టూ తిరుగుతూ వుంటే  కాలక్షేపం అవుతుంది.
   వీటి చుట్టూ మనం నమ్మకాన్ని, విశ్వాసాన్ని, పెట్టి, వీటి మీద ఆధారపడి,వీటి మీద స్పెక్యులేషన్ చేస్తూ, వివిధ సిద్దాంతాలు,ఇజాలు అల్లి , కాలక్షేపం చేస్తాము. 
     కాని కాలక్షేపం అని అనక, ఉద్యమం, పోరాటం,సాధన, సేవ, చైతన్య పరచడం అనే ముసుగు వేస్తాం.
    ధ్యానం కాలక్షేపాన్ని కాక జీవితాన్ని ఇస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment