Monday, April 17, 2023

ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 330 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. 🍀*

*నువ్వు నీ లోపల జరుగుతున్న దాన్ని గమనిస్తే ఆశ్చర్యపోతావు. శరీరం 'చాలు చాలా తినకు, నాకు ఎక్కువయి పోయింది' అంటుంది. మనసు 'ఐస్క్రీం అద్భుతంగా వుంది. యింకొంచెం తిను' అంటుంది. హృదయం 'అదెంత అందంగా వుంది' అంటుంది. మనసు ' నీకు బుర్ర లేదు, నీకు పిచ్చి పట్టింది అంటుంది. ఎప్పుడు హృదయం ప్రేమలో పడితే మనసు 'ఇది గుడ్డితనం' అంటుంది. హృదయం ఎటు వెళ్ళినా మనసు తప్పుపడుతుంది. వాటి ప్రపంచాలు వేరు.*

*ధ్యానం చేసే పని శరీరం, మనసు, హృదయం మధ్య ఘర్షణ నివారించి సమన్వయించడం, కలపడం. ఒక దాని పట్ల యింకొకటి సమశృతిలో సాగేలా చెయ్యడం. అప్పుడు నీకు అనంత శక్తి వస్తుంంది. కారణం ఘర్షణ వుండదు. ఆ శక్తి నీకు రెక్కల్ని యిచ్చి అనంతం వేపు సాగిపోయేలా చేస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment