Thursday, May 4, 2023

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. పుట్టిన ప్రతి జీవికి ప్రారబ్దము తప్పదు. ఈ మాయలో పిడికెడు  ప్రారబ్ధం తో ప్రతిఒక్కరూ వస్తున్నారు. అందులో పుట్టుక మరణం స్థితి గురించి నిర్ధారించి ఉంటుంది. ముఖ్యంగా ఏ ఏ కర్మలను ఆచరించాలి ,అనుభవించాలి, అనేది తెచ్చుకున్న టువంటి కర్మ లో అది ఏర్పడుతుంది .ఈ జన్మలో నీవు కొత్తగా ఏది తీసుకోవు. యేది జరగవలసి వున్నదో అది జరిగి తీరుతుంది. నీవు వద్దన్నా అది ఆగదు, మారదు అయితే నీవు దేహము కాదని .నేనంటే ఆత్మ  జ్ఞానం అని నీవు గుర్తించినప్పుడు, దేహం స్ఫురణ పూర్తిగా కోల్పోయి, నీవు ఆత్మగానే నిలిచి ఉంటావు. ఇక్కడ ప్రారబ్ద కర్మలు మార్చటానికి  ఈ మాయలో నీకు వీలు లేదు. అవకాశమూ లేదు. ఉదాహరణకి దేహము ,తల్లిదండ్రులు ,సంసారం, పరిసరాలు . వీటిని ఎలా మారుస్తారు?  అది ఎట్లా ఉంటుంది అంటే విల్లుని విడిచిన బాణం అలాంటిది. దానికి చికిత్స లేదు .ఎన్ని పూజలు చేసినా, ఎన్ని  వ్రతములు ఆచరించినా, , ఎన్ని క్రతువులు చేసినా మారదు. మారదు మారదు .అయితే నీవు దేహము కాదు .నేనంటే జ్ఞానమని తీవ్ర వైరాగ్యముతో, ఇది అసత్యమని గుర్తించి ,ఆత్మ విచారము చేసినప్పుడు ,అంటే నేను ఎవరిని? అని విచారించినప్పుడు, అక్కడ ఆలోచించే వాడు గానీ, ఆలోచనలు కానీ , ఇతరులు గానీ  మరేదీ కానీ , ప్రపంచము గాని, సంసారము  కానీ  యేదీ ప్రకాశించదు. కారణం అవన్నీ ఆలోచనలు. అన్యత్వం  ఏ ఒక్కటి ప్రకాశించదు. అంతా  అదృశ్యమైపోతుంది . నీవు నీవు గా నిలిచి ఉంటావు.  అహం స్ఫురణ గా జ్ఞానమే నిలిచి ప్రకాశిస్తుంది.  ముఖ్యంగా ఇప్పుడు నీవు ఒక పని కొట్టు అనుకున్నప్పుడు ఇది ఎటు పోతే నీకెందుకు ? ఎందుకు నీకు దేహం మీద అభిమానం?  పూర్తిగా అదృశ్యమై పోతుంది.  జనన మరణాలకి అతీతంగా ఉంటావు. అంటే జ్ఞాన స్వరూపము గా  ,నేను అహం స్ఫురణ ప్రకాశిస్తుంది. ఆ ఉన్నాను అన్న ఎరుక  కి ఉదయా స్తమానములు లేవు. .కనుక ప్రతి ఒక్కరూ ఏమంటున్నారు  అంటే, నాకు,  నేను ఏమి అనుకోకపోయినా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి ఎందుకు? కారణం నీ మనస్సు లో ఇదంతా నిజము అని, వాటి వెంట పరిగెడుతుంది. ఈ దేహానికి మరణము తప్పదు.  అది నీవు కానప్పుడు ఎందుకు దాని గురించి  యోచన? పుట్టిన దానికి మరణము తప్పదు .సరే గతించిన  దానికి తిరిగి పుట్టక తప్పదు.  అని కూడా కృష్ణ పరమాత్మ చెప్పుడం జరిగింది కదా!  కనుక రమణ మహర్షి వారి చేతి మీద ఒక వ్రణం వచ్చింది. మీరు దీన్ని నయం చేసుకో లేరా? అంటే , చెప్పేవాడు  లేదన్నారు. అటువంటి స్థితిని ఏర్పడటానికి కారణం స్వరూప జ్ఞానం తప్ప మరొకటి లేదు  వారికి. నాయనా నీ ప్రారబ్ధం ని  ఎవరు మార్చలేరు. దాని జోలికి పోవద్దు .నీవు నీవుగా మిగిలి వున్నప్పుడు ,ఆత్మ స్థితిలో  నిలిచి ఉన్నప్పుడు ,ఈ దేహము మనసు జరుగుతున్నటువంటి మార్పులు నిన్ను అంటవు. తెరమీది బొమ్మలలాగా!  రమణ మహర్షుల వారు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అదేమిటంటే పరమేశ్వరుడు జీవులను కర్మానుసారముగా ఆడిస్తాడు. ఏది జరగ వలది వుందో  అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. మరి ఏం చేయాలి ? మౌనమే శరణ్యం అని చెప్పుకొచ్చారు .నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు .అంతేగాని ఈ దేహాన్ని ఎ లా నిలబెట్టుకోవాలి?రోగాల నుంచి  ఎలా బయటపడాలి ?  అన్న ఆందోళనపడి ప్రయోజనం లేదు. ఎందుకు అంటే  నీవు దేహం  కాదు. నీవు నీవు గా నిలిచి ఉండ టమే. మౌనమే శరణ్యం.

No comments:

Post a Comment