Thursday, May 4, 2023

శ్రీరమణీయం: మంత్రం చాలా శక్తివంతం అంటారు.. దాని స్వభావ, స్వరూపాలు ఏమిటి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"544"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"మంత్రం చాలా శక్తివంతం అంటారు.. దాని స్వభావ, స్వరూపాలు ఏమిటి ?"*

*"మనం మంత్రం అనే మాటను చాలా గంభీరంగా భావిస్తాం. నిజానికి అది మన ఇష్టదైవాన్ని భక్తితో పిలిచే పేరు. ఆ పేరుకు ముందు ఓం, శ్రీం, హ్రీం అని చేర్చే బీజాక్షరాలు మనలోని రకరకాల సంకల్పాలను తెలిపేందుకే కానీ అవి దైవాన్ని పిలిచేందుకు కాదు. ఆంజనేయ అని ఆర్తితో పిలిచినా అది మంత్రమే అవుతుంది. ఎవరెవరు ఏఏ పేరుతో తమ ఇష్టదైవాన్ని పిలిచినా పలికే ఒకానొక వస్తువునే దైవనామం అంటున్నాం. దైవనామం అంటే అది ఫలానా పేరు అని అర్థంకాదు. పుట్టిన తర్వాత మనకు చేసే నామకరణం కూడా మనలోని ఆ దైవనామానికి అప్పటి కారణం కోసం పెట్టే పేరు మాత్రమే. మనని ఎవరైనా పిలిచినప్పుడు మనలోనుండి పలికే శక్తికి 'దైవనామం' అని పేరు. మనలోని ప్రతి కదలికకూ, ఈ సృష్టిలోని ప్రతి కదలికకూ కారణమైన వస్తువు అదే. దాన్ని గుర్తించటమే ధ్యానం. మంత్ర జపాన్ని భక్తి మార్గమని, ఆత్మ విచారణను జ్ఞాన మార్గమని మనం అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకదానికొకటి భిన్నం కాదు. తత్వాన్ని అర్థం చేసుకోవడానికే. పూలదండలోని దారంలా ఉన్న తత్వం అర్ధం కావటానికే ఏ సాధనా మార్గమైనా !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
               

No comments:

Post a Comment