Thursday, May 4, 2023

:::: వాస్తవికత VS మానసికత ::::

 *:::: వాస్తవికత VS మానసికత ::::::*

1) భౌతికమే వాస్తవం 
  భావాలన్నీ మానసికం
2)జరిగిన సంఘటన వాస్తవం
 సంఘటన పట్ల అభిప్రాయం మానసికం .
3)భౌతిక విజ్ఞానం వాస్తవం
విజ్ఞానం పట్ల వైఖరి మానసికం.
4)జరుగుతున్నదంతా వాస్తవం.
జరిగింది కలిగించే ఉద్వేగాలు మానసికం.
5)స్పందన వాస్తవం.
అనుభవాలు మానసికం.
6)జ్ఞానేంద్రియాల విజ్ఞానం వాస్తవం.
తిమ్మిని బొమ్మని చేయడం మానసికం.
7)మెదడు వాస్తవం
మనస్సు మానసికం.
8) బాధ వాస్తవం
దుఃఖం మానసికం.
9) వర్తమానం వాస్తవం
గత భవిష్యత్ లు మానసికం
10) శరీరానికి గాయం వాస్తవం
మనస్సుకి గాయం మానసికం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment