Wednesday, June 28, 2023

ఊళ్ళో పెళ్ళికి ఏవో హడావిడి చేశాయి అన్నట్లు సాయిబు గుళ్ళలో మొదలైన షిర్డీ గురు పౌర్ణమి ఉత్సవాలంటా వీళ్ళు కొత్త కొత్త అర్థాలు చెప్పుతున్నారు

 ఊళ్ళో పెళ్ళికి ఏవో హడావిడి చేశాయి అన్నట్లు  సాయిబు గుళ్ళలో మొదలైన షిర్డీ గురు పౌర్ణమి ఉత్సవాలంటా వీళ్ళు కొత్త కొత్త అర్థాలు చెప్పుతున్నారు

వ్యాసపౌర్ణమి గురుపౌర్ణమి అనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి.

చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్దతిని తీసుకొనివచ్చారు.

 అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసులవారికి చేసే గురు పూజ.

సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి ఒకరోజు కృతజ్ఞతగా పూజ చేస్తారు.

అదే గురు పౌర్ణమి. పువ్వు జ్ఞానానికి గుర్తు. కాబట్టి అటువంటి జ్ఞానం మనందరికీ కలగాలని ఆరోజున శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోని, వ్యాసుల వారి ఫోటోని కానీ లేదా వ్యాస పాదుకల దగ్గర శిష్యులు, మిగతా గురుపరంపర ఒక్కో పువ్వుని సమర్పిస్తారు.

వేద వ్యాస మహర్షుల వారు మన జాతికి చేసిన సేవ అంతా యింతా కాదు. కలియుగంలో వేదాన్ని పూర్తిగా చదవలేరని, కనీసం అర్ధం కూడా చేసుకోలేని రోజులువస్తాయని భవిష్యత్తు దర్శనం చేసి

ఒక వేదాన్నినాలుగు వేదాలుగా విభజించి, అవి కూడా పఠనం చేయలేకపోతారేమోనని అష్టాదశ పురాణాలను పంచి పెట్టారు, పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాగ్రంధాన్ని ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఒక్కో శిష్యుడి ద్వారా ప్రచారం గావించి, పురాణాలను శూత మహర్షుల చేత ప్రచారం చేయించారు.

 ఒకవేళ కలియుగంలో ఈ గ్రంధాలని కూడా మనుషులు అర్ధం చేస్కోగలరో లేదో అన్న దూరదృష్టితో సమస్త వేద, పురాణ, ఉపనిషదుల యొక్క సారాంశమైన శ్రీకృష్ణ భగవానుడి కథలను, హరి నామ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు భక్తితత్పరతతో ఉండే తన కుమారుడైన శుకమహర్షుల వారి చేత ప్రచారంగావింపబడి సమస్త మానవాళిని ఉద్ధరించిన మహాపురుషుడు వ్యాస మహర్షి.

వ్యాసుమహర్షుల వారు ఇచ్చిన వాఙ్మయాని ఆధారం చేసుకొని తర్వాతి కాలంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, అన్నమాచార్య, రామదాస, మహర్షులవంటి మహాత్ములు గురుపరంపరగా భగవానుడి యొక్క కథలను, గుణవిశేషాలను శిష్యులకి ప్రచారం గావించి సనాతనధర్మాన్నిమానవాళికి అందించారు, నేటి కి మన గురువు చే అందిపుచ్ఛుకుంటునం

సమస్త వాఙ్మయం వ్యాస ఉచ్చిష్టమ్ అంటారు పెద్దలు అంటే ఎవరు ఏ వాఙ్మయాన్ని చెప్పిన అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు. మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీస్కొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి గురుపౌర్ణమి రోజున పూజ చేసుకోవడం మన అదృష్టం.

అలాంటి గొప్ప అదృష్టం ని అందిపుచ్ఛుకొకుండ మన పురాతనమైన సంస్కృతి ని వేదాలను అపహస్యం చేస్తు మన వేద పండితుల ను గురువర్యులను పక్కున పెట్టి ముస్లిం బాబా లను సాయిబులను   గురువులను చేస్తున్నాం

మన భారత దేశ సనాతన ధర్మం ని భ్రష్టు పట్టిస్తున్నం మన  వేలితో మన కంటినే పొడుచుకుని గుడ్డివలం అవుతున్నాం ఇక నుంచైనా మారుద్దాం మన ధర్మాన్ని సంస్కృతి ని వేదాలను మనకు అందించిన గురువులను గుర్తించి వారిని గౌరవించి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం

 శ్రీమన్నారాయణుడి అంశావతారమైన వ్యాస మహర్షులవారిని గురు పౌర్ణమి రోజున స్మరించినందువలన మన పాపరాశి దగ్దమైపోతుంది.
  - శ్రీ గురుభ్యోనమః

కాబట్టి మీ పిల్లలు ఈ ఉచ్చులో పడకూడదని మీరు కోరుకుంటే..... మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి సంస్కారం గురించి సమాచారం....ఇవ్వడం ప్రారంభించండి....

 బెంగుళూరులోని ప్రశాంత్ నగర్‌లో 25 జూన్ 2023 ఆదివారం సాయంత్రం ఒక సంఘటన జరిగింది....  దాదాపు 13-15 సంవత్సరాల వయస్సు గల దాదాపు 7-8 మంది పిల్లలు పిల్లలలో ఒకరి పుట్టినరోజును జరుపుకోవడానికి సమీపంలోని డొమినోస్ పిజ్జాకి వెళ్లారు.....
  వారి తల్లిదండ్రులు వారిని డొమినోస్ పిజ్జా వద్ద వదిలి బయట కూర్చున్నారు.....తద్వారా పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు... తమ సమయాన్ని  ఆనందం గా గడపవచ్చు అని....

  పిల్లలు సరదాగా పిజ్జా తింటుండగా... డొమినోస్‌లోని ఒక క్లీనింగ్ లేడీ పిల్లలను ఉద్దేశించి యేసుక్రీస్తు గురించి బోధించడం ప్రారంభించింది.....  పిల్లలు వెంటనే స్పందించి హిందూ మతం గొప్పతనం గురించి మాట్లాడటం ప్రారంభించారు.....మా దేవుడు... ధర్మం మాకు ఉన్నాయని మేము క్రీస్తుకు ఎందుకు నమ్మాలి... ఎందుకు మొక్కాలి....అని..
   ఈ టీనేజ్ పిల్లలు కూడా బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు సృష్టి ప్రారంభం నుండి ఉన్నారని మరియు హిందూ మతం.....క్రైస్తవ మతం కంటే పురాతనమైనదని వాదించారు....  తరువాత, పిల్లలందరూ "జై శ్రీరామ్" అని బిగ్గరగా నినాదాలు చేశారు.

  క్లీనింగ్ లేడీ వెనక్కి తగ్గింది....పరిస్థితిని చూసి ఎలా స్పందించాలో తెలియలేదు.  ఈ పిల్లలు బలంగా  వాదిస్తున్నారని ... తాను బ్రెయిన్ వాష్ చేయలేనని ఆమె గ్రహించింది....  ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళు అల్లరి చేశారని రూ. 100 జరిమానా చెల్లించాలని ఆమె పిల్లలను కోరింది....
      పిల్లలు ఈ మహిళ ప్రవర్తనతో బాధ పడ్డారు... అలాగే  జరిమానా చెల్లించమని ఆమెనే యేసును అడగమని చెప్పి రెస్టారెంట్ నుండి వెళ్లిపోయారు.  జరిగిన సంఘటనలన్నింటినీ చిన్నారులు తల్లిదండ్రులకు వివరించారు.  దీంతో తల్లిదండ్రులు వెళ్లి మేనేజర్‌కు ఫిర్యాదు చేసి క్లాస్ తీసుకున్నారు.

  ఇంతకీ ఇంత ధైర్యంగా, తప్పు జరిగినప్పుడు హిందూ మతం గురించి మాట్లాడిన ఈ పిల్లలు ఎవరు..??.  ఈ టీనేజ్ పిల్లలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన IT మిలన్ వింగ్ ద్వారా నిర్వహించబడుతున్న విజయనగర్ ఖండ్‌లోని బాలభారతి మరియు కిషోర్‌భారతి సెంటర్‌లలో ఒకరు.  ఆ తల్లితండ్రులకు, పెద్దలకు, సంస్కారం ఇచ్చినందుకు గురువులకు ధాన్యవాదాలు 

  బాలభారతి మరియు కిషోర్ భారతి... సంఘ శాఖలు... సమితి శాఖలు యుక్తవయసులోని పిల్లలలో సంస్కారం మరియు సనాతన ధర్మం గురించి తెలుసుకోవడంలో మరియు తద్వారా సాంస్కృతిక మారణహోమాన్ని నిరోధించడంలో ముఖ్యమైన మరియు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మీకు తెలుసు.

  కాబట్టి మీ పిల్లలు ఈ ఉచ్చులో పడకూడదని మీరు కోరుకుంటే..... మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి సంస్కారం గురించి సమాచారం....ఇవ్వడం ప్రారంభించండి.... లేదా మీ పిల్లలతో గుడులకి ఇలాంటి ప్రదేశాలకు వెళ్తూ ఉండండి.... శాఖలకి... సంస్కారకేంద్రాలకి తీసుకెళ్తూ ఉండండి.....

  *ధర్మో రక్షతి రక్షితః*

యోగి - భోగి - రోగి

 1103.     2-5.  280623-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


             *యోగి - భోగి - రోగి*
                  ➖➖➖✍️


*హిమాలయ యోగులలో కొందరు నిత్యమౌన వ్రతం ఉంటారు. వారిదగ్గరకు ఎవరు వచ్చినా కన్నెత్తి అయినా చూడరు. అలాంటివారిలో హరి ఓం యోగి ఒకరు.*

*ఒకసారి స్వామిరామా గురువు బెంగాలీ బాబా బద్రికి దగ్గరున్న శ్రీనగర్ వద్ద గుహలో హరి ఓం యోగి దగ్గరచెప్పింది నే ర్చుకోమని పంపాడు.*

*సరే నని వెళ్లి రెండేళ్లు ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. ఒకసారి తనగురువుకు ఈ విషయం తెలియజేశాడు.* 

*‘ఆయన నిన్ను గమనించలేదనుకోకు నీ వివరాలన్నీ ఆయనకు తెలుసు”అని చెబితే ”*
*“అదెలా సాధ్యం? ఆయనెప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఆయన ఒక జీవం లేని కర్రముక్కో రాయిలాగానో ఉంటాడు చలనం లేదు!” అని ఫిర్యాదు చేశాడు.* 

*“కాదులే అక్కడే ఉండు” అని భరోసా ఇచ్చాడు గురువు.* 

*ఒక రోజు హరి ఓం స్వామి కళ్ళు తెరిచి నవ్వుతూ ”నేను కర్రముక్క నా రాయినా ?” అన్నాడు.*

*కంగుతిన్నాడు స్వామిరామా.    తను గురువుతో చెప్పిన సంగతి ఈయన కెట్లా తెలిసిందని బోల్డు ఆశ్చర్యపడ్డాడు. మళ్ళీ హరి ఓం స్వామి ”కళ్ళు మూసుకొని నేను మీరు కళ్ళు తెరిచి చూసినదానికంటే అద్భుతానందాన్ని చూస్తున్నాను ఆ ఆనందంలో మునిగిపోయే వాడికి ఈ భౌతిక లోకం ఏమానందం కలిగిస్తుంది? ఆ విశ్వ చైతన్యంలో నేను విహరిస్తూ బ్రహ్మానందం అనుభవిస్తాను. అందుకే నిరంతరం కళ్ళు మూసుకొని ఉంటాను.” అన్నాడు.* 

*ఈ మాటలు రామా మీద గొప్ప ప్రభావం కలిగించాయి. హరి ఓం కనులు అరమోడ్పుగా చూస్తే చాలు అందులోనుంచి అమృతం పొంగి పొరలుతున్నట్లు ఉందని రామా భావించి అనుభవించాడు.*

*ఓం హరి స్వామి ఒక సారి కళ్ళు తెరిచినప్పుడు కొన్ని మంత్రాలు చదివి అర్ధం చెప్పాడు… దానిభావం, లోకం అంతా రాత్రి వేళ నిద్ర పోతుంటే యోగులు, ఆత్మజ్ఞాన సంపన్నులు మేలుకొని ఉంటారు. ఇది ఉపనిషత్ వాక్యం ..!  తర్వాత దానిపై వివరణ ఇస్తూ ”రోజు మొత్తం మీద మంచి కాలం నిశ్శబ్ద రాత్రి వేళ మాత్రమే. అయితే దాని లోని అందాన్ని ఆ నిశ్శబ్ద భావాన్ని కొద్ది మంది మాత్రమే అనుభవించగలరు.*

*రాత్రి వేళలలో ముగ్గురు మాత్రమే మెలకువ గా ఉంటారు.                                        వారే… ‘యోగి   భోగి    రోగి!’*

*యోగి నిశీధి లో సమాదిగతుడై పరమానందాన్ని పొందుతాడు.*

*భోగి ప్రాపంచిక సుఖాలలో రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆనందం అనుభవిస్తాడు.*

*రోగి జబ్బుతో ముక్కుతూ మూలుగుతూ నిద్ర లేకుండా గడుపుతాడు.* 

*యోగిది శాశ్వతానందం!*
*భోగిది క్షణికానందం!! *
*రోగి ది బాదానందం!!!*

*”మరి యోగికి నిద్ర క్కరలేదా?” అని అడిగాడు రామా.*

*దానికి ”మనసులో ఏమీ లేకుండా కళ్ళు మూసుకొంటే అది నిద్ర. కావాలని కళ్ళు మూసుకొని దేనిపైన నైనా దృష్టి పెడితే అది ధ్యానం।* 

*యోగి కళ్ళుమూసుకొని ఇంద్రియ భావాలను దూరం చేసుకొంటాడు. అప్పుడు ద్వంద్వాలకు అతీతమైన స్థితి కలుగుతుంది. కళ్ళు మూసుకోవటం అంటే యోగికి అంతరేంద్రియమైన కన్ను ను తెరవటమే. అందరూ రెండుకళ్ళతో ప్రపంచ వస్తువులు చూస్తే యోగి సర్వ దేహమూ కన్నుగా మారుతుంది, సర్వ ప్రపంచం దర్శనీయమౌతుంది!” అని స్వామిరామా సందేహ నివృత్తి చేశాడు*. ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

Tuesday, June 27, 2023

రక్తపోటు గురించి సాధారణ అపోహలు

 రక్తపోటు గురించి సాధారణ అపోహలు
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, 2017 గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి  ఎనిమిది మందిలో ఒకరు రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1.13 బిలియన్ల మందికి అధిక రక్తపోటు ఉంది.రక్తపోటు విస్తృతంగా తప్పుగా అర్ధం చేసుకోబడింది. 

రక్తపోటు గురించి కొన్ని సాధారణ అపోహలు:

1.అపోహMyth: రక్తపోటు తీవ్రమైనది కాదు Hypertension is not serious:  

వాస్తవం Fact: రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. ఇది గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధులు, గుండె ఆగిపోవడం, దృష్టి నష్టం, లైంగిక పనిచేయకపోవడం మరియు పరిధీయ ధమని peripheral artery వ్యాధుల వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
రక్తపోటు అనేక విధాలుగా నష్టాన్ని కలిగిస్తుంది, ఉదాహరణకు, కాలక్రమేణా ఇది ధమనులపై  ఒత్తిడిని పెంచుతుంది, ఇది నాళాలు తక్కువ సాగేలా చేస్తుంది, ఇది గుండెకు చేరే రక్తం మరియు ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు తద్వారా అవయవాలను దెబ్బతీస్తుంది.

2. అపోహ Myth: ఇది కుటుంబంలో ఉంటే, మీరు ఏమీ చేయలేరు If it's in the family, there is nothing you can do:

వాస్తవం Fact: రక్తపోటు కొన్ని సందర్భాల్లో జన్యువు కావచ్చు. కానీ ఇది జన్యుపరంగా అవకాశం ఉన్న వ్యక్తులకు మాత్రమె కాకుండా జీవనశైలి కారకాలు, సరైన ఆహారం మరియు శారీరక నిష్క్రియాత్మకత lifestyle factors, poor diet and physical inactivity కారణంగా అభివృద్ధి చెందుతుంది.

౩. అపోహ Myth: ఇది వయస్సుతో అనివార్యం It's inevitable with age:

వాస్తవం Fact: రక్తపోటు వృద్ధులలో సాధారణం అయినప్పటికీ, మధ్య వయస్కులలో మరియు యువకులలో కూడా అధిక రక్తపోటు కన్పిస్తుంది.

4.అపోహ Myth: మీకు రక్తపోటు ఉంటే, అది కనిపించే లక్షణాలను చూపుతుంది If you have hypertension, it will show visible symptoms

వాస్తవం Fact: రక్తపోటును గుర్తించడానికి ఏకైక మార్గం రక్తపోటును కొలవడం measure. ఎవరికైనా  రక్తపోటు ఉన్నట్లు సూచించడానికి సాధారణంగా సంకేతాలు మరియు లక్షణాలు లేవు. తాము రక్తపోటుతో బాధపడుతున్నారని చాలా మందికి అసలు తెలియదు.

5.అపోహ Myth: మీరు టేబుల్ సాల్ట్ తినరు కాబట్టి రక్తపోటు గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు You don't consume table salt, you don't have to worry about hypertension:

వాస్తవం Fact: ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పును ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తుంది. ఉప్పు తీసుకోవడం పరిమితం చేయడానికి టేబుల్ ఉప్పును మాత్రమే నివారించడం సరిపోదు. ఉప్పు తీసుకోవడం పెంచే 10 ఇతర ఆహారాలు- బ్రెడ్, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, కోల్డ్ కట్స్, క్యూర్డ్ మీట్స్, సూప్, టాకోస్, చిప్స్, పాప్‌కార్న్, చికెన్, జున్ను మరియు గుడ్లు.
సముద్రపు ఉప్పు మరియు కోషర్ ఉప్పు రసాయనికంగా టేబుల్ ఉప్పుతో సమానంగా ఉంటాయి మరియు తద్వారా తక్కువ హానికరం కాదు

6.Myth: అపోహ: మీ రక్తం మందులకు ప్రతిస్పందించినప్పుడు, మీరు దానిని తీసుకోవడం మానేయవచ్చుWhen your blood responds to medication, you can stop taking it

వాస్తవం Fact: రక్తపోటుకు ఔషధం తీసుకునే వ్యక్తులు వారి రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని అనుకొంటారు. దీని అర్థం మీరు మీ ఔషధాలను స్వంతంగా ఆపవచ్చని కాదు.
ఔషధాన్ని తగ్గించడం లేదా ఆపడం కోసం వైద్యుడి సిఫార్సును అనుసరించండి

7.అపోహ Myth: రక్తపోటు నయం అవుతుంది Hypertension is curable:

వాస్తవం Fact: రక్తపోటుకు చికిత్స లేదు, అయితే, పరిస్థితిని నిర్వహించడానికి మరియు ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి మార్గాలు ఉన్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని నిర్వహించడం, ధూమపానం మానేయడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మరియు మందులు తీసుకోవడం ద్వారా మీరు మీ బిపిని నియంత్రించవచ్చు.

8.అపోహ Myth: పురుషులు మాత్రమే అధిక రక్తపోటు కలిగి ఉంటారు. Only men develop high blood pressure:

వాస్తవం Fact: పురుషులకు రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, స్త్రీలకు రక్తపోటు రావచ్చు.. అధిక రక్తపోటు ప్రమాదం ప్రతి ఒక్కరికి ఉంది.

డబ్బుతో కొనలేని సంతోషం!!*

 *_Great thought for lovely life_*

🍁 *డబ్బుతో కొనలేని సంతోషం!!*🍁

✍️ మురళీ మోహన్ 

*👌ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది!*
సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది!

*వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి.*
*అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు!*

*తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది!*
*"నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు!*

*ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది.*
*అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది! కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది!!*

*నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.*

*ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను.* *వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను.* *ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది!*
*డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు! కాని సంతోషాన్ని కొనుక్కోలేరు!*
*అది మనకి మనం పొందాల్సి ఉంటుంది. ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది!*
*నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది!*
*నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది!*
*సంతోషం అనేది గమ్యం కాదు! అది ఒక ప్రయాణం! సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది!* 

*సంతోషం పరాధీనత కాదు! అది ఓ నిర్ణయం!*

          🍃✌🌺🍋

Sunday, June 25, 2023

" విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!

 *" విఠ్ఠల విఠ్ఠల " అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!*

పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. 
విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ' ఠ్ఠ ' అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది. 
రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది. 
పదిరోజులపాటు , రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.

( సేకరణ )

మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు

 మనస్సును అదుపులో పెట్టుటకు రమణ మహర్షి ఇచ్చిన సూచనలు 

భక్తుడు : స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానములో కూర్చుంటే పర్వాలేదు కాని, అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి. ఏమి చెయ్యమంటారు?

రమణ మహర్షి: కళ్ళు తెరచి ఉంచినంత మాత్రాన ఏమి అవుతుంది? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్ర పోయేలా చెయ్యగలిగితే కళ్ళు తెరచి ఉంచినా ఇబ్బంది ఉండదు.

భక్తుడు: మనస్సును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా, దానిని నియంత్రించుట మాకు సాధ్యపడడం లేదు స్వామి.

రమణ మహర్షి:అవును అది నిజమే. ఎలాగయితే చిన్న పిల్లవాడు తన నీడను తానూ పట్టుకోవాలని పరిగెడుతూ, పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చెయ్యకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనస్సు ఎటూ వెళ్ళకుండా అడ్డుకోవాలి.

భక్తుడు : ఎలా అడ్డుకోగలం స్వామి?

రమణ మహర్షి : వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానము చేయుట ద్వారా మనస్సును అదుపులో పెట్టవచ్చు.

భక్తుడు: అంటే మనము బాహ్య సుఖాలను వదిలి పెట్టి , ఆత్మానందమును అనుభవించాలి అనా స్వామి?

రమణ మహర్షి : ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము. దాని కోసము మనము ఎక్కడ వెతకక్కరలేదు.

భక్తుడు: అది అంతా సరే స్వామి, కాని మేము ఎంత కృషి చేసినా మా మనస్సును అదుపులో పెట్టడం మా వాళ్ళ కావటం లేదు. ఏమి చెయ్యమంటారు?

రమణ మహర్షి : నవ్వుతూ...తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, " చూడండి. ఈ చిన్న చేతి వేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్నే కనపడ కుండా చేస్తోంది. అలాగే ఈ చిన్ని మనస్సు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానమునకు అడ్డు పడుతుంది. చూడండి అది ఎంత సక్తివంతమైనదో...

"నిత్యశాంతి కోసం వైరాగ్యాన్ని వంటపట్టించుకుంటే సరిపోతుందా ?"

"వైరాగ్యం అంటే ఒక విషయంపై బలవంతంగా ఇష్టాన్ని చంపుకోవటంకాదు. ఆ వస్తువుపై అయిష్టత ఏర్పడటం కాదు. ఆ వస్తువును పట్టించుకోనంత సహజత్వం రావటం. అలాంటి వైరాగ్యస్థితి మనకు నిత్యశాంతినిస్తుంది. ఇంట్లో ఏఇబ్బంది లేకుండా హాయిగా ఉంటాం. ఇంతలోనే సినిమాకు వెళ్ళాలనిపిస్తుంది. లేదా ఏదైనా వస్తువు కావాలనిపిస్తుంది. అది తీరేవరకు తిరిగి అశాంతి. తీరితే శాంతి. శాంతి ముందే ఉన్నదన్న సత్యం గుర్తిస్తే కోరిక తీర్చుకొని శాంతిని పొందాలనే భ్రమ తొలగుతుంది. కోరిక లేకపోతే ఉన్నది శాంతేనన్న అవగాహనలోకి పయనిస్తాం. దీపానికి వెలుతురు ఎలాగో, కంటికి చూపు ఎలాగో.. ఆత్మకు శాంతితో అలా విడదీయలేని బంధం ఉంది !"*

Friday, June 23, 2023

అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు

 *🩺అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు🩺* 



1. వెలుగొచ్చేవరకు పరుండటంమాని, వేకువ జామునే లేవడం మంచిదను!

2. బెడ్ కాఫీలు మాని, పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిదను!

3. పేపరు పై మనస్సు మాని, సుఖవిరేచనం పై మనస్సు మంచిదను!

4. నడకే శ్రమ అనడం మాని, ఆసన ప్రాణాయాయాలు మంచిదను!

5. చెమట పట్టకుండా తినడం మాని, చెమట పడితేనే తినడం మంచిదను!

6. వేడి నీరు స్నానం మాని, ఉదయం చన్నీళ్లు తలకు మంచిదను!

7. సబ్బులు, షాంపూలు మాని, గుడ్డతో చర్మం మర్దన మంచిదను!

8. పూరీలు, దోసెలు మాని, మొలకెత్తిన విత్తనాలు మంచిదను!

9. పచ్చి కొబ్బరిని కొవ్వు అనడం మాని, సంపూర్ణాహారం అనడం మంచిదను!

10. తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు లీటరు నీరు త్రాగటం మంచిదను!

11. కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని, ఉదయం తినడం మంచిదను!

12 . ముత్యాల్లాంటి మర బియ్యం మాని, ముడి బియ్యం మంచిదను!

13. కూరలకు తొక్కలు తీయడం మాని తినడం మంచిదను!

14 . కూరలను వేయించడం మాని, కొద్దిగ ఉడక నివ్వడం మంచిదను!

15. కూరలలోని నీటిని వార్చడం మాని, త్రాగడం మంచిదను!

16. పచ్చికూరలు పడవు అనడం మాని, సహజారోగ్యానికి మంచిదను!

17. భోజనం చేసేటప్పుడు మాటలు మాని, మనస్సు పెట్టి తినడం మంచిదను!

18. అన్నంలో కూర కలపడం మాని, కూరలో అన్నం కలపడం మంచిదను!

19. ఆహారాన్ని నమలకుండా మ్రింగడం మాని, పదేపదే నమలడం మంచిదను!

20. భోజనం అయ్యాక నీరు మాని, భోజనం అరిగాక త్రాగడం మంచిదను!

21. పగటి పూట నిద్దర మాని, రాత్రికి గాఢ నిద్ర మంచిదను!

22. ఖరీదుగల హైబ్రీడు పళ్ళు తినడం మాని, సహజమైన పళ్ళు తినడం మంచిదను!

23. పళ్ళు రొంప అనడం మాని, రోగనిరోధకానికి మంచిదను!

24. పళ్ళలోని పిప్పి ఊసి వేయడం మాని, అది మింగడం మంచిదను!

25. రసాలను త్రాగడం మాని, నమలడం మంచిదను!

26. పనికి రాని కాలక్షేపం మాని, మనస్సుకు దైవ చింతన మంచిదను!

27. గదులలో మగ్గడం మాని, ఎండ తగలడం రోగనిరోధకానికి మంచిదను!

28. ఫ్యాన్లు, ఏ.సి.లు మాని, చెమట పడితే ఆరోగ్యానికి మంచిదను!

29. పలుమార్లు విరేచనం బలహీనమని మాని, 3,4 సార్లు సాఫీగా అవడం మంచిదను!

30. పైకి పౌడర్లు, అత్తరు పూత మాని, రెండు పూటలా స్నానం మంచిదను!

31. పొద్దుపోయాక భోజనం మాని, పొద్దు ఉండగానే భోజనం మంచిదను!

32. ఉన్నదని తినడం మాని, శ్రమకు తగిన తిండి మంచిదను!

33. రాత్రికి పీకల దాకా తినడం మాని, ఫ్రీగా తినడం మంచిదను!

34. రాత్రికి సినిమాలు, షికార్లు మాని, సత్ సాంగత్యము మంచిదను!

35. తిని పడుకోవడం మాని, అరిగాక పడుకోవడం మంచిదను!

36. కృత్రిమమైన ఆహారాలు మాని, సహజ దేహానికి సహజాహారం మంచిదను!

37. ఫ్రిజ్ ల వాడకం మాని పళ్ళు, కూరలకు గాలి, వెలుతురు మంచిదను!

38. రోజూ బీరు, కూల్ డ్రింక్స్ మాని, కనీసం 6 లీటర్ల మంచినీరు మంచిదను!

39. ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహారంలో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి మంచిదను!

40. కఫాన్ని పెంచే పంచదార, బెల్లాలు మాని, అన్ని విధాలా తేనె వాడటం మంచిదను!

41. చింతపండు వాడకం మాని, పచ్చి చింతకాయ వాడకం మంచిదను!

42. ఎండు మిర్చిని వాడడం మాని, గుణాలు గల పచ్చి మిర్చి మంచిదను!

43. అపకారం చేసే నూనె, నేతులు మాని, నేటి కాలానికి ఇది మంచిదను!

44. మషాలాలు ఆహారంలో మాని, మందుగా వాడటం మంచిదను!

45. చీటికి మాటికి మందులు మాని, అత్యవసరానికి మంచిదను!

46. రుచులతో రోజూ తినడం మాని, పెళ్ళి పండుగులకు మాత్రమే మంచిదను!

47. జీవాలను తినడం మాని, సత్వాన్నిచ్చే సాత్విక భోజనం మంచిదను!

48. "రుచులను తిననివాడు మనిషా" అనడం మాని, మనిషి అదుపులో రుచి మంచిదను!

49. రోగాలు లేవని రుచులను తినడం మాని, రోగాలు రాకుండా ఆహారం తినడం మంచిదను!

50. రోగం వచ్చాక తినడం మాని, ఉపవాసం చెయ్యడం మంచిదను!

51. ఆకలి లేనప్పుడు ఆహారం మాని, నీరు త్రాగడం మరీ మంచిదను!

52. "ఛీ! ఎనిమా" అనడం మాని, రోగానికి ఎనిమా మంచిదను!

53. ప్రకృతి వికృతి చేయడం మాని, ప్రకృతి ఆరోగ్యానికి మంచిదను!

54. రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని, జీవితకాలం ఆచరించడం మంచిదను!

55. బాధ్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని, 100 సంవత్సరాలు బ్రతకాలని కోరడం మంచిదను!

56. అసంతృప్తిని మాని, తృప్తి ఆరోగ్యానికి మంచిదను!

57. కోపం, ఈర్ష్య, చిరాకులు మాని, శాంతం ఆరోగ్యానికి మంచిదను!

58. ఎదుటవారితో చేయించుకోవడం మాని, మన పని మనమే చేసుకోవడం మంచిదను!

59. సాటివారిని ద్వేషించడం మాని, ప్రేమించడం ఆరోగ్యానికి మంచిదను!

60. ప్రకృతి విధానాన్ని వైద్యం అనడం మాని, జీవన విధానం అనడం మంచిదను.

🌷🌷🌷

52 అక్షరాలు ( అ నుంచి ఱ వరకు) తో కథ

 52 అక్షరాలు (  అ నుంచి ఱ వరకు) తో  కథ ఎవరు రాశారో తెలిస్తే బావుండును..  వాట్సాప్ షేర్. 
చదవండి.  భలే ఉంది. 

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో, 
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది 
అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

చదివినందులకు ధన్యవాదములు 🙏

పతంజలి యోగసూత్రాలు

 *🍁పతంజలి యోగసూత్రాలు🍁*
✍️ మురళీ మోహన్

🙏పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సతమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.

సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.
అష్టాంగయోగము

1.యమ
అహింస హింసను విడనాడటము.
సత్యము సత్యము మాత్రమే పలకటము.
అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
2.నియమ
శౌచ శుభ్రము.
సంతోష ఆనందంగా ఉండటము.
తపస్య తపస్సు.
స్వధ్యాయన అంతర్దృష్ఠి.
ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
3.ఆసన
4.ప్రాణాయామ
5.ప్రత్యాహార
6.ధారణ
7.ధ్యానము
8.సమాధి
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.

*సంప్రదాయంలో యోగా*

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.

  *యోగ సాధన మానవజాతికి ఋషులు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఇప్పుడున్న పరిస్థితులలో భయము, దిగులు, ఒత్తిడి రోగాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. యోగసాధన ఆరోగ్యజీవనానికి  ఆంతరిక శక్తికి, ప్రశాంతతకు అత్యంత అవసరం*

*🙏బంధు మిత్రులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు*🙏

UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్ ఎందుకు కావాలో ఒక చిన్న ఉదాహరణ

 🙏🏻 *UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్ ఎందుకు కావాలో ఒక చిన్న ఉదాహరణ తో చెపుతాను* .(ఉద్యోగ,ఆర్థికపరమైన) ది. దీని కన్నా ఇంకా ఎన్నో ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. 
ఇక్కడ A:ఆనంద్ స్వామి స్థానంలో ఏ వర్గం ఉందొ, B:భాషా అహ్మద్ స్థానం లో ఏ వర్గం ఉందొ ఊహించడం కష్టం కాదు
* **** *
ఇద్దరు
A:ఆనంద్ స్వామి  మరియు B:భాషా అహ్మద్
Govt. ఉద్యోగులు 
Nmr లు గా చేరి పెర్మనెంట్ అయ్యారు.
పక్క పక్కనే ఇళ్లు
స్థలం కొని కట్టుకోవడం జరిగింది.
 1970  లో ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయు
A:ఆనంద్ స్వామి  కి.         1972 లో1                         1973 లో2వ పిల్లలు       మొత్తం ఇద్దరు.
ఆ తర్వాత family planning operation. 
B:భాషా అహ్మద్ కి   1972 లో1వ సంతానం
           1973 లో2
           1974 లో3
          1975 లో4వ
మొత్తం నలుగురు పిల్లలు.

1976 లో B:భాషా అహ్మద్  2 వ పెళ్లి చేసుకున్నాడు .            2 వ భార్యకు
            1977 లో1
             1978 లో2
             1979 లో3
              1980 లో4వ, మొత్తం 4 పిల్లలు
1982  లో 3 వ పెళ్లి
               1983 to 1987 కి ఇంకో 4 పిల్లలు

1988 లో 4 వ పెళ్లి
 25 yrs ఉన్న అమ్మాయి తో
           1989 to 1993 లోపు 4 గురు భార్య లకి
మొత్తం కలిపి 16 మంది

మంది ఎక్కువ అవడం తో పక్క పక్కనే ఇంటి గొడవలు. A:ఆనంద్ స్వామి తన స్వంత ఇల్లు అయినకాడికి అమ్మేసి వేరే చోటుకు షిఫ్ట్ ఆయాడు.

2008 లో ఇద్దరూ రిటైర్ అయ్యారు.
ఇద్దరికి pension వస్తోంది.
2020 లో ఇద్దరూ కరోన తో పోయారు
A:ఆనంద్ స్వామి భార్య కి పెన్షన్ వస్తుంది.
B:భాషా అహ్మద్ 4 గురు భార్యలకు పావు వంతున పెన్షన్స్ వస్తుంది..
2023 లో A:ఆనంద్ స్వామి భార్య పోయింది.
B:భాషా అహ్మద్  పెద్ద భార్య చనిపోయింది.
A:ఆనంద్ స్వామి  కుటుంబానికి pension ఆగిపోయింది. (పిల్లలు settled అవ్వడం వల్ల/మేజర్ అయితే)
కానీ B:భాషా అహ్మద్ 2 3 4 భార్య లకు 1/3 పెన్షన్
ఇంకో 10 ఏళ్లకు B:భాషా అహ్మద్ 2 వ భార్య చని పోతుందనుకుంటే
మిగతా ఇద్దరికి 1/2  హాఫ్ పెన్షన్
ఇంకో 10 ఏళ్లకు 3 వ భార్య పోతే
4 వ భార్య కు 100% పెన్షన్ వస్తూనే ఉంటుంది
ఆవిడ పెళ్లి నాటికి 25 yrs age కాబట్టి ఇంకొక 20 ఏళ్ళు పెన్షన్ వస్తుంది (govt సొమ్ము)

ఇక్కడ A:ఆనంద్ స్వామి ఫ్యామిలీ కి 2025 తో పెన్షన్ ఆగిపోయింది. B:భాషా అహ్మద్ ఫామిలీ కి 2050 తర్వాత కూడా పూర్తి పెన్షన్ వస్తుంది..
ఒకేసారి చేరిన ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటే ఎన్ని వేల మంది B:భాషా అహ్మద్ లు ఉద్యోగాల్లో ఉన్నారో ఎంత govt సొమ్ము తింటున్నారు.
ఇంతేకాక
B:భాషా అహ్మద్ కుటుంబ సభ్యులు ఇంకా settle కాలేదు కనుక వారి కుటుంబ సభ్యులకు నెలకి 5 కిలోలు చొప్పున 100 కిలోలు బియ్యం ఇతర రేషన్ ఫ్రీ.
ఇది కాక govt schemes ద్వారా ఇతర సదుపాయాలు.
వాళ్ళ voters list బట్టి కానుకలు కూడా వస్తాయి
ఇక్కడ A:ఆనంద్ స్వామి, అండ్ B:భాషా అహ్మద్ ఇద్దరూ ఆరోగ్యవంతులైన... A:ఆనంద్ స్వామి కి లేని అవకాశం B:భాషాఅహ్మద్ కి వచ్చింది because of  ఒక వర్గపు personal law.
అది continue అయితే ఇంకొక 10 years A:ఆనంద్ స్వామి వర్గపు జనాభా తగ్గి B:భాషాఅహ్మద్ జనాభా పెరిగి పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాగ హిందువులను తరిమివేస్తారు.

ఇక్కడ ఒక live example చూడండి 1960 లో బర్మా నుండి వచ్చిన 4 సభ్యులున్న కుటుంబం ఇప్పుడు 1000 మందితో విస్తరించింది(రాజమండ్రి లో.)

B:భాషాఅహ్మద్ పిల్లల పిల్లలు గురించి చెప్తే,మనకి ఇంకా bp... వస్తుంది.

ఇది ఇలాగే కొనసాగితే ఈ దేశం లో ఒక వర్గం వారు చంపబడతారు,, లేదా మతం మారుతారు, లేదా దేశం వదిలి పారిపోయి పరాయి దేశాల్లో హీనంగా (2nd class citizens గా)మనం బ్రతుకుతాము ఇది తధ్యం.

ఒక యాంగిల్ మాత్రమే నేను టచ్ చేశా...
'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' ఎందుకు కావాలో చాలా యాంగిల్స్ ఉన్నాయి.

డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ దేశాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని, సంస్కృతి ని, సంప్రదాయాలను చివరికి ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేము.

కొందరు  ఇలా జరుగుతుందా అని  మరికొందరు నా కుటుంబం వరకు రాలేదు కదా అని మౌనంగా వుంటారు. మరికొందరు మూర్ఖులు నన్ను తిట్టుకోవచ్చు. కానీ వారి ఉదాశీనత ఒక జాతి ని అంతమొందిస్తుంది  అని తెలుసుకోలేకపోతున్నారు.

కాబట్టి  'UCC యూనియన్ కామన్ సివిల్ కోడ్' కావాల్సిందే.

అడవిలో క్రూర జంతువులు తక్కువుగా, సాధు జంతువులు ఎక్కువుగా ఉంటే అది చాలా కాలం ఉంటుంది. అలా కాకుండా క్రూర జంతువులు ఎక్కువై సాధు జంతువులు తక్కువైతే అడవి లో ఏ జంతువులు బ్రతకలేవు

ఇది చరిత్ర చెప్పిన సత్యం

Thursday, June 22, 2023

‘ముని’వాక్యం: నాన్నలూ.. చెక్ యువర్ మిస్టేక్స్!

 *‘ముని’వాక్యం: నాన్నలూ.. చెక్ యువర్ మిస్టేక్స్!*
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః.. ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు. ప్రియురాలి తప్పును ప్రియుడు, స్నేహితుడి తప్పును మరో స్నేహితుడు, కొడుకు తప్పును తండ్రి క్షమించేస్తారట! ఇది గీతాకాలం నాటి నీతి.

అదే మనకు భారతీయుడు సినిమా వచ్చే కాలానికి, తప్పు చేసిన వాడు కొడుకు అయినా సరే, క్షమించేది లేదని కమల్‌హాసన్- శంకర్ సందేశం ఇచ్చారు. కాలగతిలో తండ్రి పాటించే విలువలకు మారుతున్న నిర్వచనం అది కావొచ్చు. తండ్రి గొప్పదనం ఏంటో తెలుసుకోవడానికి గూగుల్ లోకి వెళ్లి ‘Father’s Day Greetings’ అని టైపు చేశామంటే.. పుంఖానుపుంఖాలుగా సందేశాలు దొరుకుతాయి. మన నాన్న పట్ల మనకు అలాంటి భావన జీవితంలో ఒక్కరోజైనా కలిగిందో లేదో అనవసరం.. అందులోంచి అందంగా, భావగర్భితంగా ఉన్నదానిని ఎంచుకుని.. స్టేటస్ పెట్టేసుకుని, గ్రూపుల్లో గ్రీటింగులను వెల్లువెత్తించేసి యువజగతి మురిసిపోయే సందర్భం ఇది. ఇవాళ (జూన్ మూడో ఆదివారం) ఫాదర్స్ డే- తండ్రుల దినోత్సవం!

మారుతున్న సమాజంలో మనం మనకు అలవాటు అయిన ఒకే రకం భావాలను పట్టుకుని వేళ్లాడుతుంటాం. వాటికి భిన్నంగా ఆలోచించడానికి మనకు ధైర్యం చాలదు. పిరికితనం. మన పిరికితనాన్ని దాచేసే ముసుగుల్లాంటి మాటలతో మనం మానవ బంధాలను నిర్వచిస్తూ ఉంటాం. చాలా మంది ‘అద్భుతమైన తండ్రులు’.. అలా వారు అద్భుతాలుగా కొనియాడబడిన వారు- ఇంకో పార్శ్వం నుంచి చూసినప్పుడు తమ పిల్లల పట్ల దుర్మార్గులుగా నిరూపణ అవుతారు. 

చిన్న ఉదాహరణ అనుకుందాం. ఇంటర్మీడియట్‌లో ఓ పిల్లవాడు ఐఐటీలో అద్భుతమైన ర్యాంకు సాధించాడనుకుందాం. అతడిని అంతగా చదివించిన అతని తండ్రి కృషి, పట్టుదల గురించి మనం వేనోళ్ల కీర్తిస్తాం. పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూలు కూడా వేస్తాం. కానీ, అదే పిల్లవాడు ఇంటర్ చదువుతుండగా ఆత్మహత్య చేసుకున్నాడనుకోండి.. అతడు భరించలేనంత ఒత్తిడికి గురిచేసిన తండ్రి దుర్మార్గాన్ని మనం ప్రస్తావించం. ఆ జూనియర్ కాలేజీలు పెట్టే ఒత్తిడిని తిట్టుకుంటూ వ్యాసాలు రాస్తాం.. ఆ కాలేజీలు ‘అలాంటివే’ అని తెలిసీ, అందులోనే చేర్చిన తండ్రి దుష్టత్వం ప్రస్తావనకు రాదు! ఇది లోకరీతి. 

తండ్రి దుర్మార్గాన్ని ప్రశ్నించాలంటే అందరికీ భయం, సంకోచం. ఏదో ఒకనాడు తాము కూడా ఆ పాత్రలోనే ఉంటామనే సంకోచం. ఇది చాలా చిన్న ఉదాహరణ. పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పులు, పాపాలు ఇంకా అనేకం ఉంటాయి. అన్నీ ప్రస్తావించుకున్నా ఓ గ్రంథం అవుతుంది. కనీసం రెండు మిస్టేక్స్ గురించి అయినా ఖచ్చితంగా చెప్పుకోవాలి. 

మిస్టేక్ 1: కన్నా.. నా కలలకు సారథి నువ్వు..

ఇంజినీరింగ్, మెడిసిన్ లక్ష్యంతో చదువుల కార్ఖానాల్లో నిత్యం రాపిడికి గురవుతూ ఉండే పిల్లల్లో 80 శాతం మంది పిల్లలు వారి తండ్రుల కలలకు సారథులు! ‘‘కన్నా ఇంజినీరు/ డాక్టరు కావాలనేది నాకల. నాకున్న పేదరికం, గవర్నమెంటు కాలేజీల్లో చదువులు (అలాంటి ఏదోఒక కారణం) వల్ల నేను చేయలేకపోయాను. అప్పటి నా కలల్లో నిన్ను చూసుకోవాలని అనుకుంటున్నాను.. నువ్వు సాధించాలి. నీకోసం నేను ఆఫీసుకు స్కూటరు మీద వెళ్లడం మానేశా. క్యాంటీన్ లో తినడం కూడా మానేశా.. డబ్బు పొదుపు చేసి ఇక్కడ చదివిస్తున్నా.. నా కలలన్నీ నువ్వే’’ లాంటి డైలాగులను ఈ 80 శాతం మంది తండ్రులు చెబుతూనే ఉంటారు. ఆ పిల్లవాడికి చదువులు కాదు ఒత్తిడి, ఇలాంటి తండ్రులు పెంచుకునే ఆశలే అసలు ఒత్తిడి!

కారణాలు ఏవైనా ఒకడికి తాను కన్న కలలను తాను తీర్చుకునే శక్తి లేదు, చేతకాదు. జీవితం అంతేనని, ప్రతి కల నెరవేరాలనే రూలు లేదని సర్దుకుపోవచ్చు. అలా చేయడు. బిడ్డ మీద ఆ కలలు రుద్దడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి తండ్రీ.. తన చేతగానితనానికి రుజువుల వంటి కలలను.. బిడ్డల మీద రుద్దేస్తూ ఉంటే.. ఆ బిడ్డలు తమ జీవితం గురించి తాము కలలు కనేది ఎప్పుడు? ఈ తండ్రులు దుర్మార్గులు. పిల్లలు కలలు కనే స్వేచ్ఛను కూడా చిదిమేస్తుంటారు. ఈతప్పు ఎప్పుడూ చేయకండి. మీ కలలను మీతోనే అంతం కానివ్వండి. మీరు సమర్థులైతే నెరవేర్చుకోండి.. లేకపోతే రాజీపడండి. పిల్లల కలలను వారినే కననివ్వండి. 

మిస్టేక్ 2: నేను పడ్డ కష్టాలు నీకొద్దు కన్నా..

పిల్లలను ఎందుకూ కొరగానివాళ్లుగా తయారుచేసే దౌర్భాగ్యమైన ప్రేమ ఇది. సమాజంలో 99 శాతం మంది తమ బాల్యం నాటి కుటుంబ స్థితిగతులనుంచి తర్వాతి దశకు ఎదిగి జీవనం గడుపుతుంటారు. బాగా ఎదిగిన వారు కూడా ఉంటారు. బాల్యంలో ఉండే సామాజిక పరిస్థితులు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో వారు అనేక రకాల కష్టనష్టాలకు గురయ్యే ఉంటారు. శ్రమకు వెరవకుండా ఇంటికి సంబంధించిన అన్ని పనులూ చేస్తూ ఉండి ఉంటారు. అలాంటి తండ్రుల్లో ఒక ఉదాత్తమైన- అలా అనుకునే దృక్పథం ఉంటుంది. ‘నేను పడిన కష్టాలు నా బిడ్డను పడనివ్వను’ అనేదే ఆ పోకడ. పిల్లలను ఎందుకూ కొరగాని పనికిమాలిన వాళ్లుగా తయారుచేసే వైఖరి ఇది. ఇందులో రెండు రకాలున్నాయి.

ఒకటోరకం- పిల్లలకు శారీరక కష్టం తెలియనివ్వరు. పదిహేడేళ్ల వయసు వస్తుంది.. బజారుకు వెళ్లి సరుకులో, కూరగాయలో తేవడం తెలియదు. అంట్లు కడగడం, ఇల్లు చిమ్మడం లాంటి పనులు తెలియదు. ఒళ్లు ఎక్కువగా అలసిపోయే పొలం పనులు లాంటివైతే అసలు ఊహించలేం. ఒకటో రెండో కిలోమీటర్లు నడిచి వెళ్లి నాలుగు దుకాణాలు తిరిగి సరుకులు తేవడం కాదు కదా.. కనీసం సూపర్ మార్కెట్ కైనా ఒంటరిగా వెళ్లి అవసరమైనవి తేవడం కూడా అలవాటు కాని పిల్లలుంటారు. ఇలాంటి పిల్లల పెంపకం గురించి ఓ పెద్ద ప్రొఫెసర్ గారు ఇలా అంటారు ‘ఈ తండ్రులంతా ఫారం కోళ్లలాంటి పిల్లలను తయారు చేస్తున్నారు’ అని! అందులో అబద్ధం లేదు. అలాంటి అతిశయమైన జాగ్రత్తలతో పెంచడం అనేది.. పిల్లలను, స్వయంగా సంబాళించుకోవాల్సిన చిన్న అవసరం వచ్చినా.. తట్టుకోలేని దౌర్బల్యంలోనికి నెడుతుంది.

రెండోరకం- ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించినది. ‘నేను బాల్యంలో పేదరికంలో ఉన్నాను గనుక.. నా బిడ్డకు పేదరికం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాను’ అనే వాదన. అందమైన ఆత్మవంచనతో కూడిన మాట ఇది. వీళ్లు తమ స్వశక్తితో, తెలివితేటలతో, ఇంకేదైనా మార్గాలతోనో సంపన్నులు అయిన వారు! వారి సంపదను ప్రదర్శించుకోవడం ఒక మోజు! పిల్లలు కూడా, తమ సంపదను ప్రదర్శించే టూల్స్ వారికి! పిల్లలు అడిగీ అడగకముందే ఇబ్బడిముబ్బడిగా డబ్బు అందిస్తుంటారు. ఖర్చులను ఆరాతీయరు. పిల్లలు ఏదైనా చేయాలంటే.. ఆ పనుల మంచిచెడులను గురించి, వారి దక్షత గురించి ఆలోచించరు. అడిగిన డబ్బులన్నీ ఏర్పాటు చేస్తారు. వారి వైఫల్యాలకు తామే కారణం అవుతుంటారు. అవసరానికి మించి డబ్బు చేతిలో మెదలుతుండడం వలన, పిల్లలో పెరిగే అరాచక ధోరణులకు, విచ్చలవిడితనానికి ఈ తండ్రులే కారకులు. ఆ తర్వాత ఎప్పుడో వారు పశ్చాత్తాప పడుతూ జీవితాన్ని వెళ్లదీస్తారు. 

మెజారిటీ తండ్రులు చేస్తుండే అనేకానేక మిస్టేక్స్‌లో ఇవి మచ్చుకు రెండు మాత్రమే. పిల్లల భవిష్యత్తు కోసమే బతుకుతున్నాం, కూడబెడుతున్నాం.. అని చెప్పుకుంటూ.. సంపాదనకోసం అనేకానేక అడ్డదారులు తొక్కేవారు అనేకులు. తమ జీవితాన్ని తాము నిర్మించుకున్నట్టుగా.. పిల్లలు కూడా వారి జీవితాన్ని వారే నిర్మించుకోవాలని, అలాంటి విజయంలో ఉండే సంతృప్తి తమ పిల్లలకు కూడా దక్కాలనే స్పృహ వారికి ఉండదు. ఒక సినిమాలో చెప్పినట్టు.. పిల్లల ఆటను కూడా తామే ఆడేయాలని ప్రయత్నిస్తుంటారు. 

పిల్లలను సమర్థులుగా తయారుచేయగలిగితే చాలు.. తాము ఇవ్వగల సమస్త సంపదలు ఆ సమర్థత ముందు పూచికపుల్లకు కొరగావనే సత్యాన్ని వారు గుర్తించరు. తాము ఇచ్చేవాటిని మించిన సంపదలను పిల్లలు సృష్టించుకోగలరనే నమ్మకం వారికి ఉండదు. ఆ తండ్రులు భీరువులు! పిల్లలకు మనం సరైన కేరక్టర్ ఇవ్వగలిగితే చాలు. అదే వారి జీవితాలను నిర్దేశిస్తుంది అని వారు గ్రహించరు. సంపదల మీద తప్ప, గుణం మీద నమ్మకంలేని రకం వాళ్లు!

పిల్లల మీద ప్రేమ, అనుబంధం లాంటి అందమైన పదాల వ్యామోహంలో తండ్రులు చేస్తూ ఉండే అనేకానేక తప్పులు మనకు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అలాంటివి గమనించినప్పుడు, ఆ తండ్రులను దిద్దవలసిన అవసరం మనకు లేదు, వారినుంచి అలాంటి తప్పులు చేయకుండా మనం పాఠం నేర్చుకుంటే చాలు. 

ఇలాంటి ఆలోచనలు ఉంటే, మార్చుకోగలిగిన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు!

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

మీసప్తచేతన మనసుకున్న శక్తి ధనంమూలం ఇదం జగత్💰

 ⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓
మీసప్తచేతన మనసుకున్న శక్తి

 ధనంమూలం ఇదం జగత్💰

మీకెప్పుడైన లక్షలు, కోట్లు సంపాదిస్తే బాగుండనిపించిందా? Yes అనిపించినపుడే మీరు సంపదపరులు కావడానికి బీజం పడింది. కాని అప్పుడే మీరు దాన్ని మరిచిపోయారు. ఇప్పటికైనా ఇబ్బంది లేదు. Money, Wealth అనే విత్తనం ఉంది. ఇపుడే నాటండి. ప్రతి రోజు నేను గతంలో Money Mantra లో చెప్పినట్టు నీళ్ళు పోయండి. మీ మనసులో దాన్ని జాగ్రత్తగా పెంచండి. అది మీకు గొప్ప సంపదనిస్తుంది. Yes మీరు సిద్ధంగా ఉన్నారు. పట్టుదల వదలకుండా మీరు ప్రయత్నించండి. మీరనుకున్నది సాధిస్తారు. ఎవరైతే సంపద కావాలనుకున్నారో వారి దగ్గరికే సంపద వస్తుంది. మీరు దానికి పూర్తి అర్హులు. ఎంతైనా సంపాదించండి. సంతోషంగా ఉండండి. డబ్బు, సంపద మీరేం చేయాలనుకుంటున్నారో చేసేయండి. ఎవరో ఏమో అనుకుంటారేమో అని ఆలోచించవద్దు. Yes. మీ ఆలోచననే మీ పెట్టుబడి మీరు ఎంత ఆలోచిస్తే అంతా మీదే. ఆ యూనివర్స్ మీకివ్వదడానికే ఉంది. మీరు ఎప్పుడూ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. డబ్బుని ఎప్పుడూ బంధీ చేయకండి. వీలైనంత ఖర్చు పెట్టినపుడే అది మీ దగ్గరికి వస్తుంది. అపరిమితమైన సంపద మీకోసం ఆ విశ్వం సిద్ధంగా ఉంచింది. దాన్ని మీ ఆలోచనల ద్వారా పొందే ప్రయత్నం చేయండి
మీ దగ్గరలోని సంపదపరులను ఎప్పుడైనా గమనించండి. వాళ్ళ సంపదను ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీకు ప్రతిదీ తెలియాలి. ఒక కోటీశ్వరుడి గురించి, డబ్బు ఎలా తయారవుతుంది? financial గా మీకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి. వీటి మీద చాలా పుస్తకాలు గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా చదవాలి. వారూ ఒకప్పుడు మనలాంటి వాళ్లే. ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు. వారి జీవితాలు చదివి డబ్బు, సంపద కావాలన్నపుడు వీటన్నిటిపైన మీకు అవగాహన ఉండాలి. అప్పుడు డబ్బు, సంపదకు మీరు అర్హులుగా ఆ విశ్వం దృష్టిలో గుర్తింపబడుతారు. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతీ క్షణం ఈ రకమైన ఆలోచనలతో ఉన్నప్పుడు Universe మీ ఆలోచనల్ని స్వీకరిస్తుంది. మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు ఎలా - ఇవ్వాలి అనే ప్లాన్ వేసుకుంటుంది. ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది మీకు వచ్చిన డబ్బు సంపాదన అనే ఆలోచనలు మీ కోరికగా మార్చుకోండి. బలమైన కోరిక ఉన్నపుడే సాధ్యమవుతుంది. మీ జీవితపు రూపురేఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎలా మార్చుకుంటారనేది మీఇష్టం. మీ జీవితానికి ఎవరూ బాధ్యులు కారు. ఒక విషయం మీరు ఏమి  చేస్తున్నారు అనేది ఎవ్వరికీ చెప్పే అవసరం లేదు. ఇతరులకూ, సమాజానికి, ప్రకృతికి ఇబ్బంది కలగకూడదు. అప్పుడే ఆ విశ్వం మీకు సహకరిస్తుంది. విశ్వ నియమాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం
Law of Atraction అంటే ఆకర్షణ యొక్క ధర్మం, అంటే మీరు ఏదైతే ఆకర్షిస్తారో అది మీ సొంతం అవుతుంది. ఏదైనా అంటే ఏదైనా కావచ్చు. డబ్బు, సంపద, వస్తువు, ఇంకేదైనా కావచ్చు. మీరు కోరుకున్న ఏదైనా  మీ సొంతం కావొచ్చు, దీనికై మీరేం చేయాలి? ఇది నిజమా? నమ్మశక్యంగా లేదు. Yes ఎలా అవుతుంది. ఎందుకవుతుంది? నాకే ఎందుకవుతుంది. అవడానికి యెంత సమయం పడుతుంది. ఇంకా ఇది సాధ్యమా? అంటూ ఆశ్చర్యపోతూ మీరు అనుమానాలను వ్యక్తపరచిన కొద్దీ మీకు ఏదీ కాదు. ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్యమైన విషయాలను నమ్మండి. 1.బలమైన కోరిక 2.నమ్మకం 3.మీరు కోరిన దాన్ని అనుభవించడం. Simple theory. Yes, ఇవి మూడు ఒకే సరళరేఖ పై కి వచ్చిన మరుక్షణమే మీరు కోరుకునేది మీ ముందుంటుంది.

నిరాశా, నిస్పృహలతో మీ జీవితాన్ని చిన్నదిగా చేసుకోకండి. ఎపుడైతే మీ ఆలోచన చిన్నదిగా మారిందంటే మీకు తెలియకుండానే మీరు క్రుంగిపోయారని అర్ధం, మీకేమి ఉన్నా, లేకున్నా ఉన్న దానికంటే ఎక్కువ ఊహించండి. ఊహించడంలో మనకి ఖర్చు ఏమి లేదు. Yes, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా మలచుకున్నారనేది మీ ఇష్టం. మీరెపుడూ ఆర్థిక పుష్టి కలిగి ఉండాలని మనస్పూర్తిగా కోరుకొండి. దానికి సంబంధించిన అవకాశాలు రావడం మొదలౌతుంది. నిరంతరం  ఉన్నతమైన ఆలోచనలతో మీ మస్తిష్కాన్ని నింపండి. ఏదో కోల్పోయినం చ మాత్రాన మీ జీవితం అయిపోలేదు. గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు అంత అయిపోయిందనుకున్న తరువాతనే మళ్లీ మొదలయ్యాయి. ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం జరిగింది.

“మీ జీవితంలో ఎక్కడా ఎవరికీ భయపడకండి భయపడేవాడు చచ్చిన కిందే లెక్క” - స్వామి వివేకానంద"

ప్రతీ రొజూ మీ ఉజ్జ్వల భవిష్యత్తు గురించిన ఆలోచనలపై దృష్టి పెట్టండి. మీ ఆలోచనలు మీ అంతరంగంలో ఒక గొప్ప నిదిని తయారు చేసి మీకు అందిస్తాయి. వీలైనంత ఒంటరిగా ఉండే ప్రయత చేయండి. అపుడే మీ ఇన్నర్ మైండ్ తో కనెక్ట్ అవుతారు. మీ మనసు చెప్పిందే మీరు చేయండి. ఈ ప్రపంచంలో ఎవరి మాటా వినకoడి అద్భుతమైన కలలతో మీ జీవితాన్ని సాకారం చేసుకోండి. అందరుమీ వైపు చూసేలా...

డాక్టర్. అశోక వర్ధన్ రెడ్డి
7337068200
⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓⚓

Wednesday, June 21, 2023

చల్లని నీరు ఎందుకు తాగకూడదు!

 ఫీలింగ్ హాట్! కాని చల్లని నీరు ఎందుకు తాగకూడదు!
ఇది వేసవి కాలం, మరియు ఐస్‌ వాటర్ యొక్క పానీయం చాలా ఉత్సాహం కలిగిస్తుంది. కాని చల్లటి నీరు శరీరానికి ఏమి చేస్తుందో ఎప్పుడైనా ఆలోచిoచారా? ముఖాన్ని వేడి / వెచ్చని నీటితో కడిగినప్పుడు, అది శరీర రంధ్రాలను తెరుస్తుంది మరియు చర్మాన్ని విప్పుతుందని తెలుసు. మరోవైపు, ముఖాన్ని చల్లటి నీటితో కడగడం వల్ల రంధ్రాలు మూసుకుని చర్మo బిగిoచబడుతుంది.. 
చల్లటి నీరు తాగకుండా ఉండటానికి మరిన్ని కారణాలు: 
1. చల్లటి నీరు లేదా ఇతర చల్లటి పానీయాలు తాగినప్పుడు, ఇది ఆర్ద్రీకరణకు ఆటంకం కలిగిస్తుంది, జీర్ణక్రియను పరిమితం చేస్తుంది మరియు రక్త నాళాలను తగ్గిస్తుంది.
2. చల్లటి నీరు తాగడం వల్ల శరీరం యొక్క అంతర్గత ఉష్ణోగ్రత మారుతుంది. మీ శరీరం ఇప్పుడు ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు శక్తిని ఉత్పత్తి చేయడానికి పోషకాలను గ్రహించడానికి బదులుగా ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నిల్వ చేసిన శక్తిని ఉపయోగిస్తుంది.
3. భోజనం తర్వాత చల్లటి నీరు త్రాగినప్పుడు అధిక శ్లేష్మం ఏర్పడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరు క్షీణతకు దారితీస్తుంది, ఇది అనారోగ్యం మరియు జలుబులను పట్టుకునే అవకాశం ఉంది.
4. భోజనంతో లేదా దాని తర్వాత చల్లటి నీటిని తాగితే, నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల ఆహారంలో కొవ్వులు పటిష్టంగా మారతాయి. శరీరం ఇప్పుడు శరీరం నుండి అనవసరమైన కొవ్వులను జీర్ణం చేయడానికి కష్టపడుతోంది.
చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కష్టపడి పనిచేయడం ద్వారా కేలరీలు బాగా బర్న్ అవుతాయని కొందరు పేర్కొన్నారు. అయితే, కేలరీలు బర్న్ చేయడానికి ఇది సరైన మార్గం కాదు! జీర్ణవ్యవస్థను కష్టతరం చేయాల్సిన అవసరం లేదు. కేలరీలు బర్న్ చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి, చల్లటి నీటి కన్నా  శరీరానికి వెచ్చని, లేదా గది ఉష్ణోగ్రత నీరు ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంగీకరిస్తున్నారు.
 
వెచ్చని నీటి యొక్క కొన్ని ప్రయోజనాలు:
1. పెరిగిన మరియు వేగంగా ఆర్ద్రీకరణ
2. సహజ జీర్ణ ఎంజైమ్‌ల ఉద్దీపన వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
3. ఆహారం మరింత తేలికగా విచ్ఛిన్నమవుతుంది
4. మంచి ప్రేగు కదలిక, ముఖ్యంగా గోరు వెచ్చని నీటితో  నిమ్మరసం తాగితే 
5. రక్తం శుద్ధి చేయబడుతుంది మరియు శోషరస వ్యవస్థ, మూత్రపిండాలు మరియు చర్మం ద్వారా శరీరం సహజంగా నిర్విషీకరణ అవుతుంది

ఈసారి భోజనానికి కూర్చునేటప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటి గ్లాసును తీసుకోండి.

*ఎన్నో జన్మల పుణ్యం...!!*

 🪷🧘💓🧘🪷💓🧘

*ఎన్నో జన్మల పుణ్యం...!!*

రాత్రి మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. 
💦నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. 
ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది.

జీవితమూ అంతే...
అది జీవించడానికే, జీవించడమే గొప్ప సాధన, సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. 
గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది.

🔰అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడికి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి.

🔰అందుకే యమ నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధనక్రమం అంతా చెబుతారు. 
మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు. 
👉చెడ్డవాళ్లకు  ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు. 
పరిశుభ్రత లేనివారికి, ఆరోగ్యదాయకమైన యోగా అనుకూలపడదు. 
భక్తి లేనివారికి జ్ఞానం ఒంట పట్టదు...!!

🔰జీవించడంలో  ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. 
జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి, 

💓 ఈ  జీవితం ఈశ్వర ప్రసాదం, భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి... 
ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి, *నిజమైన సాధన ఇదే.!!*

🔰ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం అభ్యాసం వల్ల వస్తాయి. 
నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు.

🔮జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. 
ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి...
👉అంతకంటే  మనిషికి సార్థకత లేదు. 
సాధన చేసి సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి.

🔰 ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. 
పుట్టుక నుంచి మరణం వరకు జరిగేది సాధనే. 
ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన, లేకపోతే బతుకే అయోమయం.

🪜 పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ జీవిస్తున్నాయి. 
మరి మనమెందుకలా నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. 
*_నేను లేకుండా చేసుకుంటే బుద్ధి వరం_.* 
*_నేనును మేరుపర్వతమంత పెంచుకుంటే బుద్ధి శాపం_.*

🪜 చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. 
పెద్ద నేను శ్రీకృష్ణుడు, అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం, అత్యంత అద్భుతమైన సాధన భగవద్గీత.

*శ్రీరాముడు జీవించాడు, మనిషిగా తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు.*
 💦జీవితం అవకాశం ఇస్తుంది. అంతే, దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.

*కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే, విధిరాత మారదు.*
🔰జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది, మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది.

🔰 పుట్టుకతోనే  నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు. 
ఇంతకంటే మహాసాధన ఉండదు, కదా!!

మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యానుభవం కోసం తహతహలాడటం... 
*ఎన్నో జన్మల పుణ్యం...*

           *_🌿శుభమస్తు🌿_*
   🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

Monday, June 19, 2023

మగువల విద్యా ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి.... మారంది అత్త -కోడళ్ళు అనుబంధం* అవునా? కాదా?

 *మగువల విద్యా ఉద్యోగాల్లో మార్పులు వచ్చాయి.... మారంది అత్త -కోడళ్ళు అనుబంధం*
అవునా? కాదా?
నేను విన్నవి, కన్నవి, అదృష్టం కొద్దీ అనుభవం లోకి రానివి....
అక్కడ... ఇక్కడ సేకరించి... దొరికినవి....కొన్ని అంశాలు కాపీపేస్ట్ చేసి అన్ని క్రొడీకరించి...వ్రాసినవి.....
By
Balivada haribabu 
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
1920వ సంవత్సరం. పొయ్యి మీద వంట. గంజి వార్చి, అన్నం వండి, పప్పు, కూర చేసి ఇంట్లో మగవారి భోజనాలయ్యాక అత్తగారికి భయం భయంగా వడ్డించింది కోడలు. "ఏమిటిది మెతుకు మెతుకు.... అతుక్కుపోతున్నాయి. గంజి సరిగా వార్చావా" అంటూ అత్తగారు గర్జించింది. కోడలు కన్నీరు పెట్టుకుందుకు కూడా సాహసించలేదు.... 
1940వ సంవత్సరం. కుంపటి మీద అత్తెసరు పెట్టి వంట పూర్తి చేసింది కోడలు. టీచర్ అయిన కొడుకు స్కూల్కి వెళ్ళాక అత్తగారు భోజనానికి కూర్చుని "ఏమిటో ఈ వంట. అడ్డెడు బియ్యం వండి వార్చే దాన్ని.....సుకుమారాలకి పోతున్నారు. కుంపటి మీద ఏదో తగలపెట్టడం అంతే." కోడలు మనసులో "పట్టణంలో అద్దె ఇళ్లలో పొయ్యి పెట్టనివ్వరు.... పది గంటలకు మీ అబ్బాయిని పనికి పంపించాలి.... అపరాహ్ణం భోజనాలా ఏమిటి." అని అనుకుంది....
1960వ సంవత్సరం. స్టవ్ మీద వంట...
అత్తగారు.. "అన్నం కుంపటి మీద నెమ్మదిగా ఉడికితే రుచిగా ఉంటుంది. స్టవ్ మీద వుడక పెట్టడం ఏమిటి? కూరలు కిరసనాయిల్ వాసన" అంది.
 "అత్తయ్యా! సిటీలో ఇంకెలా చేయగలం? రెండు బస్సులు మారి ఆఫీసుకి వెళ్లాల్సిన మీ అబ్బాయికి నెమ్మదిగా వండుతూ కూర్చుంటే కుదురుతుందా?" అని కోడలు జవాబిచ్చింది.
1980వ సంవత్సరం. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్, మిక్సీలతో వంట.....
అత్తగారు... "ఏమిటో ఈ వంట. ప్రెజర్ కుక్కర్లో అన్నం ఉడికితే పప్పు ఉడకదు. పప్పు ఉడికేసరికి అన్నం ముద్ద అయిపోతుంది. మిక్సీలో రుబ్బితే పిండి ఉరువవదు." అంటే కోడలు "అత్తయ్యా!నేను కూడా జాబ్ చేస్తున్నాను. మీ కాలంలోలా కుదరదు." అని గట్టిగానే బదులు చెప్పింది.....
2000వ సంవత్సరం. ఆదివారం....
కోడలు...నాలుగు బర్నర్లగ్యాస్ స్టవ్ మీద నాలుగు కూరలు ఒకేసారి వండేస్తోంది. "నేనూ ఉద్యోగం చేశాను కానీ ఏ రోజు వంట ఆరోజు చేసేదాన్ని. వండి ఫ్రిడ్జ్లో కుక్కడం మైక్రోవేవ్లో వేడి చేయడం. ఫ్రెష్గా ఉంటేనే కదా హెల్తీగా ఉంటుంది" అని.... అత్తగారు నెమ్మదిగా అంది....ఇంట్లోనే ఉన్నప్పటికీ ఈ మెయిల్ కొట్టింది కోడలు. "మీ లెక్చరర్ జాబ్ కీ నా ప్రైవేట్ కంపెనీ జాబ్ కీ పోలిక ఏమిటి? ఎంత టెన్షన్ ఉంటుందో. నేను కాబట్టి ఇంట్లో వంట చేస్తున్నాను. హోటల్ నుంచి తెప్పించడం లేదే."2020 వ సంవత్సరం..... కోడలు సోఫాలో కూర్చుని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తోంది. అత్తగారు... "నేను కూడా టెన్షన్ ఉన్న జాబ్ చేశాను. కానీ సండే అన్ని వంటలు చేసి పెట్టుకునే దాన్ని. ఇలా ఆర్డర్ ఇవ్వడం చెయ్యలేదు" అని కోడలికి వినిపించేలా కొడుకుతో అంది.....
 కోడలు ఆర్డర్ ఇవ్వడం ఆపి వాట్సాప్ మెసేజ్ అత్తగారికి పెట్టింది. "ఆదివారం కూడా అమెరికా నుంచీ ఆస్ట్రేలియా నుంచీ కాల్స్ రిసీవ్ చేసుకుని వర్క్ చేస్తున్నా అని మీకు తెలియదా.....ఎవరి తిండికి వాళ్లే పాటుపడాలని అనకుండా అందరి ఇష్టాలు తెలుసుకుని ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తున్నాను... బీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్."వంద సంవత్సరాలలో ఎన్ని మార్పులు. వంట వండే పద్ధతులు మారాయి. కమ్యూనికేషన్ విధానాలు మారాయి.....
*నేనేమన్నా నో తెలుసా? ఇలా.*.👇
అలా ఉంటేనే అది అనుబంధం.. కాసేపు ప్రేమ కాసేపు సాధింపు.. 
కానీ.. అలా సాగిపోతూనే ఉంది..👍😊🌹🌺💐

నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?

*_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_*
_[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_
 *===(((🙏🙏🙏)))===*

*మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _"నేను రేపు పాండవులను చంపుతాను"_ అని ప్రకటించాడు.*
*అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.*
*తను బయటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన _"అఖండ సౌభాగ్యవతీ భవ"_ అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.*
*ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా!" అన్నాడు.*
*దానికి ద్రౌపది "అవును తాతయ్యా..! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.*

*వెంటనే భీష్ముడు.. "నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి" అని ఒక మార్గం ఉపదేశించాడు.*

*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".*
*"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.*

*👌ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.*
*ఎందుకంటే...*

*🙏నమస్కారం ప్రేమ.*

*🙏నమస్కారం క్రమశిక్షణ.*

*🙏నమస్కారం చల్లదనం.*

*🙏నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*

*💠నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.*

*💠నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.*

*💠నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*
 
*💠నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*

*🔶ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.*
_(శ్రీ శిష్ట్లా తమ్మిరాజు గారి సౌజన్యముతో... 🙏)_ 
*_{ఇంత మంచి అంశాన్ని సేకరించి, సరిపడే చిత్రాన్ని జతచేసి.. మీకు అందించే అవకాశం రావడం.. నిజంగా నా అదృష్టం: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు}_*
_🙏🙏🙏ఇదీ మరి నమస్కారం విలువ అంటే..._🙏🙏🙏

|| జీవితం మనకు .. ఒక అద్భుత అవకాశం || ప్రతి ఒక్కరికీ వారి వారి జీవితం ఒక అద్భుత అవకాశం!

 || జీవితం మనకు .. ఒక అద్భుత అవకాశం ||
 
ప్రతి ఒక్కరికీ వారి వారి జీవితం ఒక అద్భుత అవకాశం!

ప్రతి రోజూ మంచిపనులు చేయడం ఒక అవకాశం .. ప్రతి వ్యక్తికీ ధ్యానం చెప్పడం ఒక అవకాశం! ఒకవేళ ఆ వ్యక్తికి ధ్యానం తెలుసు .. మరి మనకంటే ఎక్కువ జ్ఞానం కూడా వుందనుకుందాం .. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవడం మనకు ఒక మంచి అవకాశం.

ఇలా ఏ మనిషి నుంచి అయినా ఏదో ఒక అవకాశం మనకు వస్తుంది! అది నేర్పించే అవకాశమైనా కావచ్చు .. లేదా నేర్చుకునే అవకాశమైనా కావచ్చు.

మీరందరూ నా దగ్గర నేర్చుకునే అవకాశం కోసం వచ్చారు .. మరి నేను మీకు నేర్పించే అవకాశం కోసం వచ్చాను. మీ అందరికీ ధ్యానం నేర్పించే అవకాశం వలన నాకు `పుణ్యం’ వస్తుంది .. మరి నేర్చుకునే అవకాశం వలన మన మన `జ్ఞానం’ రెట్టింపు అవుతుంది. మన దగ్గర ఉన్నది ఇతరులతో మనం పంచుకుంటే .. అది “పుణ్యం”! మన దగ్గర లేనిది మనం సముపార్జించుకుంటే .. అది “జ్ఞానం”! ఇలా ఎవరి అవకాశాన్ని వారు ఉపయోగించుకోవాలి.

సాధారణంగా .. మన కంటికి కనిపించే ఇతర వ్యక్తులు మనకన్నా తక్కువగానైనా వుంటారు, లేదా మనకన్నా ఎక్కువగానైనా వుంటారు, లేదా మనకన్నా తక్కువుగా వుంటే ఆ వ్యక్తికి మనం “ధ్యాన భిక్ష” పెట్టాలి.

మనకంటే ఎక్కువగా వున్న వ్యక్తి నుంచి మనం “జ్ఞాన భిక్ష” తీసుకోవాలి. ఇలా జీవితమంతా కూడా పుణ్యం సంపాదించడానికీ, జ్ఞానం పొందడానికీ ఉన్న గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ .. పుణ్యాన్ని సంపాదించుకుంటూ మరెంతో జ్ఞానాన్ని పొందేవారే .. “పిరమిడ్ మాస్టర్స్”!

మనం ఇతరుల నుంచి జ్ఞానాన్ని నిర్భయంగా నేర్చుకోవాలి .. మరి అలాగే మనం ఇతరులకు ధ్యానం నేర్పించేటప్పుడు ఎంతో వినయంతో నేర్పించాలి. మనం ఇరవై సంవత్సరాలు ధ్యానం చేసివుంటే, మన ప్రక్కవాడు రెండు వందల సంవత్సరాలు ధ్యానం చేసినవాడు అయివుండవచ్చు. అందుకే మనం ఇతరులకు ధ్యానం నేర్పించేటప్పుడు “వినయం”గా నేర్పించాలి .. మరి ఇతరుల నుంచి జ్ఞానం నేర్చుకునేటప్పుడు “వినయం”గా నేర్చుకోవాలి!

“నేర్చుకున్నది ఇసుక రేణువు అంత .. నేర్చుకోవలసింది కొండంత” అన్న పరమ సత్యాన్ని ప్రతి క్షణం ఎరుకలో ఉంచుకోవాలి!

ఒకానొకసారి బుద్ధుడి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి “స్వామీ! మీరు అన్నీ చెప్పేసారు ఇంకా .. ఇక చెప్పడానికి ఏమీలేదు కదా?” అని కొనియాడాడు.

అప్పుడు బుద్ధుడు “ఆ చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకురా!” అన్నాడు.

ఆ శిష్యుడు కొన్ని ఆకులు తీసుకుని వచ్చాక .. “నీకు నేను చెప్పింది ఈ ఆకులంతే .. చెప్పాల్సింది ఇంకా ఆ చెట్టంత వుంది. అలాగే నాకు తెలిసింది కూడా ఇంతే.. మరి నాకు తెలియాల్సింది కూడా ఇంకా ఆ చెట్టంత వుంది!” అని చెప్పాడు.

ఇలాంటి మాటలనే “బుద్ధత్వపు మాటలు” అంటారు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా బుద్ధుళ్ళే! వారి నుంచి సదా బుద్ధత్వపు మాటలే వస్తాయి!

-Brahmarshi Patriji

Friday, June 16, 2023

జ్ఞానోదయం, మోక్షం, ముక్తి మరియు విముక్తి మధ్య తేడా ఏమిటి? వీటి గురించి తెలుసుకుందాం.

 జ్ఞానోదయం, మోక్షం, ముక్తి మరియు విముక్తి మధ్య తేడా ఏమిటి? వీటి గురించి తెలుసుకుందాం.

పైన పేర్కొన్నవన్నీ ఒకే విషయానికి వేర్వేరు పేర్లు. మనం ఆత్మను గ్రహించి, పరమాత్మ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనం అజ్ఞానం మరియు దుఃఖం నుండి విముక్తి పొందుతాము. ఈ విముక్తి మరణ సమయంలో దైవంతో ఐక్యం కావడానికి మరియు భూమిపై మళ్లీ కష్టాలు అనుభవించడానికి మరొక జన్మలో తిరిగి రాకుండా నడిపిస్తుంది.
సత్యం యొక్క జ్ఞానం జ్ఞానోదయం.
జ్ఞానోదయం అంటే ఏమిటి మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది?
జ్ఞానోదయం పొందండి అంటారు. ఎందుకంటే మనం ఇప్పటికీ అహం మనస్సు మరియు శరీరం ద్వారా బానిసలుగా ఉండవచ్చు. జ్ఞానము ఉన్నవాడు దేహ-మనస్సుపై యుద్ధంలో పూర్తిగా విజయం సాధించే వరకు విముక్తి పొందలేడు.
మనము మూర్తీభవించిన ఆత్మలం.  మనకు శరీరం ఉంది, కానీ మనం శరీరం కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనకు మనస్సు ఉంది అనిపిస్తుంది కానీ మనం మనస్సు కాదు.

జ్ఞానోదయం తర్వాత మన ఆత్మకు ఏమి జరుగుతుంది? చాలా మంది ప్రజలు ఆత్మ యొక్క భావన గురించి గందరగోళంగా ఉన్నారు. ప్రతి వ్యక్తికి దాని స్వంత ప్రత్యేక ఆత్మ ఉందని ప్రజలు అనుకుంటారు. విశ్వవ్యాప్తమైన మరియు ప్రతిచోటా ఉన్న విశ్వ స్పృహలో ఆత్మ ఒక భాగమని వారు గ్రహించలేరు.
మనము జ్ఞానోదయం పొందినప్పుడు, మరణ సమయంలో, శరీర-మనస్సు గుళిక నుండి విముక్తి పొందినప్పుడు మనం విశ్వాత్మతో కలిసిపోతాము మరియు మనము పరమాత్మతో ఏకమవుతాము, ఇది మన అంతిమ లక్ష్యం.
ఆధ్యాత్మిక గురువు లేదా దైవిక ఆత్మ మనకు జ్ఞానోదయం ఇవ్వగలరా? జ్ఞానోదయానికి మార్గం ఏమిటి?
వివక్ష, వైరాగ్యం, క్రమశిక్షణ మరియు జ్ఞానోదయం కోసం కోరికతో కూడిన జీవితాన్ని గడపాలని అంటారు. విముక్తి పొందాలంటే పరమాత్మతో ఏకం కావాలంటే ప్రపంచాన్ని త్యాగం చేయాలి. ఎవరైనా ప్రపంచంతో ముడిపడి ఉంటే, విముక్తి పొందడం మరియు జ్ఞానోదయం పొందడం చాలా కష్టం. ఇంకా, ఈ జ్ఞానోదయ స్థితిని చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలి లేదా దైవిక శక్తితో అనుసంధానించబడి ఉండాలి. అందుకోసం నిరంతరం భక్తితో, మౌనంగా, ధ్యానంలో ఉండి, ఆధ్యాత్మిక సత్య జ్ఞానంతో నిరంతరం విద్యాభ్యాసం చేస్తున్నందున తన చర్యలను దైవానికి అంకితం చేయాలి.
జ్ఞానోదయం ఎందుకు ముఖ్యం?
జ్ఞానోదయం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం, అది లేకుంటే మనం అజ్ఞానంలో జీవిస్తాము. ఈ అజ్ఞానం మనల్ని , బాధల్లో పడేలా చేస్తుంది. ఇంకా, ఇది మనల్ని అహం మరియు మనస్సుగా జీవించేలా చేస్తుంది, మరణానంతర జీవితం తిరిగి రావడానికి మాత్రమే ఉపయోగపడతాయి. 

 జ్ఞానోదయం మరియు విముక్తి పొందడం చాలా ముఖ్యమైనవి.
మనకు జ్ఞానోదయం అయిన తర్వాత, మనం శాశ్వతమైన శాంతి మరియు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తాము. 
జ్ఞానోదయం అంటే ఏమిటి మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది?
కోపం, ఒత్తిడి మరియు అన్ని ఇతర ప్రతికూల భావోద్వేగాలు వదిలితే మన జీవితం గాలిలో ఈక లాగా, సముద్రంలో విసిరిన ఆకులా తేలికగా ఉంటుంది.  కేవలం దైవానికి లొంగిపోతాము  దైవికతను అంగీకరిస్తాము.

ఒక వ్యక్తి జ్ఞానోదయం పొంది, సత్యాన్ని గ్రహించిన తర్వాత, అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక సౌరభంతో ప్రకాశిస్తాడు. అటువంటి వ్యక్తి భౌతిక వస్తువుల పట్ల ఆకర్షితుడవు. అలాంటి వ్యక్తి జీవితంలోని సాధారణ కోరికలను అధిగమించి, అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఆధ్యాత్మిక పారవశ్యాన్ని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి నిన్నటి గురించి పశ్చాత్తాపం లేకుండా లేదా రేపటి భయం లేకుండా జీవిస్తాడు.
జ్ఞానోదయం పొందిన వ్యక్తి ప్రతి జీవిలో పరమాత్మని చూస్తాడు, అతను ప్రతిదాన్ని పరమాత్మ యొక్క అభివ్యక్తిగా చూస్తాడు. ఈ సాక్షాత్కారం జ్ఞానోదయమైన జీవిని సామాన్యులకు తెలియని ఆనందంతో జీవించేలా చేస్తుంది.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

స్త్రీ - తల్లి, భార్య

 *స్త్రీ - తల్లి, భార్య*
                

ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.

మనము అమ్మవారి ఆలయానికి వెళతాము. అక్కడ అమ్మవారికి పడీ పడీ దండాలు పెడతాము. అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారో తెలుసా? 

‘నీవు చేయు ఈ పూజ, ఈ సేవ,                 ఈ దండాలు నేను కాక  ఎవరో నిన్ను చూడాలని, చూసి వారు నిన్ను మెచ్చుకోవాలని, లేదా ఏ బంధు ప్రీతి కొరకో లేదా   బుధ జన ప్రీతి కొరకో..! అంతే కానీ నీకొరకు, నాకొరకు కాదు. 

బంధు జనం ప్రీతి చెందుతారేమో కానీ, బుధజనము,     నీగురించి తెలిసిన వారు, ధర్మమును ఆశ్రయించినవారు, ధర్మపరులు హర్షించరు. 

ఎందుకంటే అమ్మవారు అంటారు.. ‘ఇక్కడకు వచ్చి, పడి పడి దండాలు పెడుతున్నావు. ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను.       అక్కడ                   నీ గృహములో వ్యష్ఠి రూపంలో ఉన్నాను.    నీకు తల్లిగా, 
నీకు భార్యగా,    నీకు చెల్లిలిగా, 
నీకు అక్కగా, నీకు ఒక వదినగా, మరదలుగానే కాక,  ప్రతి స్త్రీ మూర్తిలోనూ వ్యష్ఠి రూపములో ఉన్నాను,  కాబట్టి ముందు అక్కడ నుండి మొదలుపెట్టరా, నీ సేవ, 
నీ పూజ. 

‘అక్కడ అమ్మకు పట్టెడు అన్నం పెట్టవు’. ‘అమ్మా నీకు ఆరోగ్యం ఎలా వుంది’ అని అడిగిన పాపాన పోవు.

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ,   క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ. అని కదా అన్నారు? 

మరి అలాంటి ధర్మపత్ని, నీకు, 
మీ వంశానికి, వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి,  నిన్ను, నీ ముందు తరతరాలవారినీ,  పున్నామ నరకము నుండి తప్పించడానికి తన ప్రాణాలనే ఫణముగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి, మిమ్ములను, మీ వంశన్నీ ఉద్ధరింపచేసే స్త్రీ మూర్తి, నీ సహధర్మచారిణిని, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. 

ఇక్కడ ఒకవిషయం ఎవరైనా సరే మనస్పూర్తిగా ఆలోచించాలి మనకు ఆరోగ్యం బాగా లేదు, పడకవేస్తే, ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన ఆలనా పాలనా చూచి, సమయానికి మందులు, మాత్రలు, సరియైన ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం, కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మన కుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధర్మపత్ని.    

అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం ఇచ్చారు. 

మరి అలా తల్లడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు, విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది.

మనము బ్రతికి (ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా “ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ     నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. 

మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే.  నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా? అమ్మతనాన్ని చూడలేవా? 

దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను, రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు, పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనము వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ అన్నందిస్తావు. పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు.పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?

ఇవే కాక మన పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి అలోచనను, ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది. పడకవేస్తే, ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన అలనా పాలనా చూచి,సమయానికి మందులు, మాత్రలు, సరియైన ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం, కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మనకుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధ్ర్మపత్ని. అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం ఇచ్చారు. మరి అలా తల్లిడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు, విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది.
ఆదిత్యనారాయణ..
మనము బ్రతికి (ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా “ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా? అమ్మతనాన్ని చూడలేవా? దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను, రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. 

ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు, 

పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనసు వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ ఆనందిస్తావు.  పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?

ఇవే కాక మన పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీయము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి ఆలోచనను, ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది.

కావున కేవలం తల్లి కే (ఆ పరదేవతకే) అది సాధ్యం. బిడ్డలు చేసిన పనులను, ఆలోచనలను, వారి అసంతృప్తులను, మంచి చెడులు ఎప్పటి కప్పుడు వివరించి, ధర్మాధర్మములను వివరించి, బిడ్డలను తీర్చిదిద్దగలిగే శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంది. తండ్రికి కాదు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సమాధానపరచ గలదు తల్లి. 

అందుకే వేద వేదాంగములలో మొదటి నమస్కారము తల్లికే “మాతృదేవోభవ” అన్నారు. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించింది కావున ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శముగా పూజనీయ మైనది గౌరవప్రదమైనది. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించి తన బిడ్డలను ధర్మమార్గంలో నడపగలిగితే ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు భావితరాలకు కూడా ఆదర్శము కాగలదు.

గృహస్తాశ్రమము(సంసారజీవనము) లో స్త్రీ పాత్ర ఎంతటిదో అలాంటి స్త్రీ మూర్తిలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవతను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీదరించుకుంటుంది తెలుసా?

తన ధర్మపత్నిలో పర దేవతను చూసిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది.
రామకృష్ణ పరమహంస తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
 [13/06, 10:44 pm] pasupulapullarao@gmail.co: 🍃🪷 

నవ్వుతూ ఉన్నవాడు...నాలుగు రకాలుగా మాట్లాడతాడు..
బాధతో ఉన్నవాడు...భావంతో మాట్లాడతాడు..
ప్రేమతో ఉన్నవాడు...చనువుతో మాట్లాడతాడు..
కోపంతో ఉన్నవాడు...కేకలు వేసి మాట్లాడతాడు..

మంచివాడు...మార్పుకోసం మాట్లాడతాడు.
అసూయతో ఉన్నవాడు...చులకనగా మాట్లాడతాడు..
కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు..
నిజానికి మాట మనిషిని మారుస్తుంది..
మౌనం మన మనస్సుని మారుస్తుంది..

స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే..
కాబట్టి మనస్సుని జయించినవాడు 
జీవితంలో దేనినైన సాధించగలడు..అహం లేకుండా, తక్కువ ఎక్కువ చూడకుండా ఎవరితో ఐనా ప్రేమగా ఉండగలడు..

🍃🪷 సే:వల్లూరి సూర్యప్రకాష్ బ్యాంక్ కాలనీ కరీంనగర్
[14/06, 7:14 am] pasupulapullarao@gmail.co: మనం రోడ్ మీద వెలుచుంటే వెనుక ముందు రకరకాల వాహనాలు రకరకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. కానీ మనం అవేమీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది... అలాగే మన జీవితాలలో కూడా రకరకాల సమస్యలు వస్తుంటాయి, మనపని సరైన సాధన చేసుకుంటూ పోతే వాహనాలు ఎదురుపడే వ్యక్తులు అనే అన్నిరకాల సమస్యలనుండి విడుదలై ముక్టి మోక్షము పొందుతారు.
         రకరకాల వాహనాలు కనిపెట్టిన వారు కూడా అందులో ప్రయనిస్తెనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.
రకరకాల ధ్యాన మార్గాలు గురించి రీసెర్చ్ చేసిన వారు కూడా వారు చెప్పిన సరైన సాధన చేయకుంటే చెడు కర్మలు దగ్దం కాక రోగాలతో నే తుది శ్వాస విడవడం జరుగుతుంది

సమయం సద్వినియోగం

 *"సమయం సద్వినియోగం"*

*"పని కోసం సమయం కేటాయిస్తే"*
*అది మనకు సంతృప్తినిస్తుంది.*

*"ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే"* 
*అది మన మేధాశక్తిని పెంచుతుంది.*

*"చదవడానికి కొంత సమయం కేటాయిస్తే"* 
*అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది.*

*"నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే"* 
*అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది.*

*"ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే"* 
*అది మనకు ఆనందాన్నిస్తుంది.*

*"వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే"* 
*అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.*

*"ప్రార్ధించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే"* 
*అది మనకు మనశ్శాంతిని ఇస్తుంది.*
============================
మనిషి ఏకాకిగా మనలేడు. విజయం సాధించినప్పుడు ఆనందం పంచుకునేది, బాధ కలిగినప్పుడు సాంత్వన కలిగించేది- బంధుమిత్రుల ఆప్తకదంబమే.
ఆత్మీయులైన పెద్దల ఆశీస్సులే బాలలకు శ్రీరామరక్ష. బాల్యం వికసించడానికి తల్లిదండ్రుల అండదండలు కలిసివస్తాయి. బడిలో స్నేహితులు తోడుంటారు. గురువులు పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆటపాటలకు తోటిబాలలు కలిసివస్తారు. బంధువుల రాకపోకలు ఉత్తేజపరుస్తాయి. ఈ ఆప్తకదంబం సహకారంతోనే బాల్యం అర్థవంతమవుతుంది.
యౌవనంలో మిత్రబృందం సహకారం తోడవుతుంది. స్నేహసౌరభం యువతను ఉత్సాహపరుస్తుంది. మంచిమిత్రుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి ఆలోచనా పరిధి విస్తరిస్తుంది. వివాహానంతరం భార్యాభర్తల కుటుంబాల కలయికతో ఆప్తకదంబం మరింత విస్తరిస్తుంది. మూడుముళ్ల బంధంతో సంతానం వృద్ధిచెంది మూడు తరాల ఆప్తకదంబం ముచ్చట గొలుపుతుంది.
ఆప్తకదంబమే వృద్ధాప్యంలో ఆరోగ్య ప్రదాత. అది మలిసంధ్యలో మానసిక బలం. గతంలో దరి చేర్చుకున్న ఆత్మీయులు వృద్ధాప్యంలో ఆసరా అవుతారు. మనిషి మరణించాక జీవించేది ఆత్మకదంబం అంతరంగంలోనే.

సత్యం తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం స్నేహితుడు, శాంతం సహధర్మచారిణి, క్షమాగుణం కుమారుడిగా భావించాలి. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతం, క్షమ అనే ఆరు మంచి లక్షణాలను ఆత్మ బంధువులుగా చేసుకుని జీవనం సాగించాలన్న హితోపదేశం సర్వులకూ అనుసరణీయం.🙏🕉️🌻

అసూయ,ద్వేషాలను విడనాడాలి!

 1403.      2-4.  150623-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*అసూయ,ద్వేషాలను విడనాడాలి!*
                 ➖➖➖✍️

*ఉన్నత వ్యక్తిత్వం కోసం… అసూయ, ద్వేషాలను విడనాడాలి.*

*ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటుంటాడు. ఇది సహజం.  కానీ, అందరికన్నా గొప్పవాడు కావాలని కొందరు ఆరాటపడతారు. అలా కావటానికి చేతనైన అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. అవినీతికి సిద్ధపడతారు. అనాయాసంగా, నిస్సంకోచంగా అబద్ధాలు ఆడతారు.*

*కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవారమనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే !*

*కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించిపోతున్నా భరించలేరు. ‘అసూయ’తో కుమిలిపోతారు. వారిమీద కక్షగా ఉంటారు.   అవకాశం లభిస్తే, ఏదో విధంగా, తమకన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పుడు, లోలోపల సంతోషపడుతూ, పైకి కపట సానుభూతి ప్రకటిస్తారు.*

*దుర్యోధనుడికి సుయోధనుడు అనే మరొక పేరు ఉంది. నిజానికి అతడు అసూయాధనుడు. పాండవుల ఔన్నత్యాన్ని, ఆధిక్యతను సహించలేక పోతుండేవాడు. బాల్యం నుంచే పాండవుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉండేవాడు.*

*’అసూయ’ అగ్ని వంటిది. ‘ద్వేషమూ’ అంతే..!*

*ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం.*

*'స్పర్ధయా వర్ధతే విద్య'- చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేషపూరితంగా ఉండకూడదు. పోటీతత్వంతో, పట్టుదలగా విద్య నేర్వాలి. వాయిదాలు వేయకుండా విద్యాకృషి చెయ్యాలి. 'రేపు చదవొచ్చు' అని బద్ధకిస్తే, చివరికది పరీక్షల సమయం దాకా ఆచరణగా మారదు! అప్పుడు ఆందోళన, ఆవేదన పడుతూ ఆరోగ్యభంగం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడతారు. ఇవన్నీ చేయకూడని పనులే.*

*'కృషితో నాస్తి దుర్భిక్షం'- నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు.* 

*సత్కార్యాలకు… ‘ఆలోచన- ఆచరణ’ మధ్య ఆలస్యం ఉండకూడదు.*

*కర్ణుడు ఎడం చేత్తో బంగారు పాత్రను దానం చేయటానికి గల కారణం చెబుతూ- 'చెయ్యి మార్చుకునే లోగా మనసు మారిపోవచ్చు' అనటం అందరికీ ఆదర్శం.*

*ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ముతారు.*

*భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు. అసూయ లేకపోవటం ఎంత గొప్పదంటే- అసూయలేని ఏకైక మహిళగా, అత్రి మహర్షి అర్ధాంగిగా వినుతికెక్కిన అనసూయా దేవి పుత్రుడిగా జన్మించటానికి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇష్టపడ్డాడు.*

*అసూయలేని హృదయం పరిశుద్ధ దేవాలయం. అసూయ లేదంటే, ప్రేమకు నిలయమని అర్థం.*

*ప్రేమ పున్నమి వెన్నెల వంటిది. అందర్నీ ఆకట్టుకొంటుంది. భగవంతుని కూడా ప్రసన్నుణ్ని చేస్తుంది. అసూయ లేనివారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు.*

*ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం. మనం మన దేహంలోని రోగాల నుంచి విముక్తి పొందటానికి తహతహలాడతాం.*

*అసూయ నుంచి విముక్తి పొందటానిక్కూడా తహతహలాడాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది !*✍️
                                   …సేకరణ:
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మనో నియంత్రణ

 140623f1702.    160623-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *మనో నియంత్రణ*
                 ➖➖➖✍️

*మానవుడి మనసు అత్యంత చంచలమైనది. దాని నియంత్రణ అత్యంత కష్టతరం. ఒక కుందేలును బంధించాలంటే దాని చెవులనే పట్టుకోవాలి. బాతు అయితే మెడను, కోడి కాళ్లను పట్టుకొని మోసుకెళ్ళాలి. అప్పుడే అవి మననుంచి జారిపోకుండా, పారిపోకుండా ఉంటాయి.* 

*మర్కటంలా అతి చంచలమైన మనసును బంధించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడి సాధన చేస్తేనే మనసు మన వశమయ్యే అవకాశం ఉంటుంది.*

*మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు, తనతో యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉన్న బంధువులను చూసి, విషాదంతో ధనుస్సు, అక్షయ తూణీరం వదిలేసి, సాగిలపడ్డాడు.*

*అప్పుడు కృష్ణ పరమాత్యుడు అర్జునుడికి ధర్మసూక్ష్యాలు, జీవిత సత్యాలు బోధించి, అతడిని యుద్ధోన్ముఖుడ్ని చేస్తాడు.* 

*ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి ఎందుకు తన మనసును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలో తెలియజెప్పాడు.* 

*ఆ సమయంలో, తన మనసును అదుపులో పెట్టు కోవడం అత్యంత కష్టతరంగా ఉందని అర్జునుడు భగవంతుడికి విన్నవించాడు.*

*అప్పుడు ఏ ఉపాయాలు, ఏ ప్రయత్నాల చేత.. మనసును తమ వశం చేసుకోవచ్చో శ్రీకృష్ణుడు. సవ్యసాచికి తెలిపాడు.*

*రామాయణంలో రావణాసుర, కుంభకర్ణ, విభీషణులు సోదరులు. రావణాసురుడు మహా శివభక్తుడు. ధర్మ నిష్టలను అనుసరించేవాడు. సీతాదేవి గురించి, ఆమె అందచందాల గురించి, తన సోదరి శూర్పణఖ ద్వారా విన్నాక అతడి మనసు నియంత్రణ కోల్పోయింది. సీతదేవినే చెరపట్టాడు!* 

*కుంభకర్ణుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాన్ని పొందాడు. కాని ఆ వరం కోరుకునే సమయానికి, సరస్వతీ దేవి అతడి మనసును ప్రభావితం చేసింది. అందుచేత మనో నియంత్రణ కోల్పోయి, తనకు ఆరు మాసాలు నిద్రపోయేలా వరం ఇమ్మని బ్రహ్మను అడిగాడు.*

*వైకుంఠంలో జయ విజయులు ద్వార పాలకులుగా తమ విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వహించేవారు. వైకుంఠంలో తాము ద్వార పాలకులమన్న గర్వం క్రమంగా వారిలో అహంకారం నింపింది.*

*ఒకసారి శ్రీమహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో సహా, విశ్రమిస్తున్నాడు. ఆ సమయంలో బ్రహ్మ కుమారులైన సనకాదిక ఋషులు నలుగురు, తమకత్యంత ఇష్టుడైన శ్రీమహావిష్ణువును దర్శించడానికి వెళ్ళారు. జయ విజయులు వారిని లోపలికి పోనీయలేదు. బాలకులుగా కనిపించిన ఆ ఋషుల్ని చూసి వారు పరిహసించారు. ఋషులు ఎంత వేడుకున్నా వారిని స్వామి దర్శనానికి పంపలేదు. అప్పుడు ఋషులు. ద్వారపాలకులను శపిస్తారు.*

*మన మనసు నియంత్రణలో లేకపోతే లోకంలో అనవసర వివాదాలు. అధర్మమైన కోరికలు పీడిస్తాయి. భగవంతుడి సన్నిధి కోరుకుంటే, ఆ ప్రయాణం ఎటువంటి మానసిక అవరోధాలు లేకుండా, ఏకోన్ముఖంగా సాగాలి. మనసును పూర్తిగా అధీనంలో ఉంచుకుంటే కానీ, అది సాధ్యం కాదు.* 

*మనోనియంత్రణను జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మన జీవనయానం, జీవితాంతర ప్రయాణం సుఖంగా సంతోషంగా ఉంటాయి.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కోపం ఒక శాపం

 140623g1736.    160623-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

               *కోపం ఒక శాపం*
                 ➖➖➖✍️

*కొందరికి కోపం   ముక్కు మీదే ఉంటుంది.    చీటికిమాటికి చిరచిరలాడుతూ ఆగ్రహం ప్రదర్శిస్తారు.* 

*మనిషికి కోపం శత్రువు లాంటిది. అది ఎందరినో శత్రువుల్ని తెచ్చిపెడుతుంది. ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది.*

*మనసుకు నచ్చని మాటలు విన్నా, నచ్చనివారిని చూసినా కొందరికి ఇట్టే కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడు సరిపడని మాటలను పట్టించుకొనకపోవడం, కోపం కలిగించేవారి నుంచి మన దృష్టిని మరల్చుకోవడం మంచి పరిష్కారం.*

*తగిన కారణం ఉంటే కోపాన్ని ప్రదర్శించి నయానో భయానో ఎదుటివాడి తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేయకపోతే సంభవించే దుష్ఫలితాలకు మనమే కారణం కావచ్చు.*

*సరైన పద్ధతిలో  కోపాన్ని ప్రదర్శించడం అనేది అంత సులభం కాదన్నది విదుర నీతి.*

*అనవసరంగా క్రోధాన్ని ప్రద రించడం అనేది మనం విషం తాగుతూ ఎదుటివాణ్ని చావాలని కోరుకోవడం లాంటిది.*

*ఎవరిపైనైనా విసిరేందుకు ఎర్రగా కాలిన నిప్పు కణికలను చేతిలోకి తీసుకోవడం లాంటిదే కోపం,  క్రోధం ప్రతీకారాన్ని ప్రోత్సహిస్తుంది. అది సరైన పద్ధతి కాదని బుద్ధుడు. అంటాడు.* 

*బలవంతులైనవారు క్షమిస్తారు. విజ్ఞత కలిగినవారు అసలు పట్టించుకోరు. దీనితో మనకు కోపం తెప్పించినవాడు అవమానం చెందుతాడు.*

*పంచవటిలో సీత అపహరణకు గురైనప్పుడు శ్రీరాముడు ఎంతో వేదనతో గోదావరిని, చెట్టు గుట్టలను, పశుపక్ష్యాదులను ఆమె ఉనికిని తెలపమని వేడుకొంటాడు. గోదావరి మారు పలకక జలజలా ప్రవహిస్తూనే ఉంటుంది. పశువులు మోరలెత్తి శ్రీరాముడి వైపు జాలిగా చూస్తాయే కాని బదులు పలకవు. అప్పుడు రాముడికి వచ్చిన కోపం చూసి ప్రకృతి మొత్తం వణికిపోతుంది. తన వేదనను పట్టించుకోని ఈ పృధ్విని, సీత జాడ తెలపలేని జీవజాలాన్ని నాశనం చేస్తానంటూ బాణాన్ని ఎక్కుపెడతాడు.* 

*అప్పుడు సౌమిత్రి- 'అన్నా, ఈ కోపం నీకు శత్రువు అవుతుంది. నిగ్రహించు. స్వభావరీత్యా నీవు మృదుస్వభావుడివి. ఆత్మనిగ్రహం కలవాడివి. నీ బాణంలోని అగ్నికీలలు ప్రపంచాన్ని పటాపంచలు చేస్తే వదిన సీతమ్మను ఎక్కడని వెతుకుతావు. ఆ మాత సైతం నీ బాణాగ్నికి ఆహుతి అవుతుంది కదా!    నీ కోపం వెనక ఉన్న ప్రేమను వేదనను అర్ధం చేసుకొన్నవారు మనకు స్నేహితులుగా విశ్వాసపాత్రులుగా లభించక మానరు. వెతికితే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. కోపం కన్నా మనకు శత్రువు వధ ముఖ్యం. ఇప్పుడు మన కర్తవ్యం… సీతమ్మ అన్వేషణ' అని రాముణ్ని శాంతపరుస్తాడు.*

*సమాజ పరిస్థితులకు తగ్గట్టు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని మన అదుపులో ఉంచే ఓర్పు నేర్చుకోవాలి.* 

*ఓర్పు వల్ల జటిలమైన పనులు సైతం సఫలం అవుతాయి. జాతి ప్రయోజనాన్ని ఆశించి కోపం కనబరచవచ్చు.*

*ఆగ్రహం ప్రదర్శించేందుకు గాంధీజీ సత్యాగ్రహాన్ని ఎంచుకున్నారు.*

*కోపం నేరుగా ఉన్నట్టుండి పుట్టుకు రాదు. దానికి కారణం కావాలి. మౌన పోరాటం, నిరాహార దీక్ష, అలగడం, సహాయ నిరాకరణ లాంటి 'మెతక కోపపు పద్ధతులు సమాజానికి మేలు చేస్తాయి.*

*కోపం వ్యక్తిగతం కాకూడదని జిడ్డు కృష్ణమూర్తి 'ది సాంగ్స్ ఆఫ్ లైఫ్'లో సూచించారు. వ్యక్తిగతం అయితే మాత్రం కోపం ఒక శాపమే..!*✍️
 ఆలోచన ఎక్కడ అంతమవుతుందో అక్కడే 'సత్యం' ప్రారంభం అవుతుంది. అభిప్రాయం ఉన్న చోట 'సత్యం' ఉండదు. అభిప్రాయంలతో కూడిన మనసే అసత్యం. నిశబ్దం తో ఎంతో ప్రశాంతంగా, శున్యస్థితి లో ఉన్న ఆత్మే 'సత్యం'. మన ప్రశ్న కి సమాధానం బాహ్యం లో దొరకదు మన అంతరంలోనుండే బావిలోనుండి నీళ్ళను తోడినట్లుగా పైకి లాగితే ఏ ఆలోచనలు లేని ఖాళీ పాత్రలా మైండ్ ఉన్నపుడు 'సత్యం' అవగతమై 'ప్రజ్ఞ' గా నింపబడుతుంది. ధ్యానమే దీనికి మార్గం. 🧘‍♂️🧘‍♂️🧘‍♂️పిరమిడ్ మహిళా ట్రస్ట్ 🧘‍♂️🧚‍♂️🧘‍♂️విశాఖపట్నం.

Speak What is Essential [ అవసరమైనంత వరకే మాట్లాడు ]

 ⚛️ *ది మైండ్ (పాశుపతాస్త్రం)* ⚛️
     💥💥🔺💥💥🔺💥💥🔺💥💥
          DAY - 43 ; PART - 3

🔸 TOPIC : Speak What is Essential
[ అవసరమైనంత వరకే మాట్లాడు ]

🔺 SOME SPEAK TO INFORM.
Some speak to Influence.
Some speak to Entertain.
Some speak to Persuade.
Some speak to Enlighten.
 — కొంత మంది (మీకు) తెలియచేయటానికి మాట్లాడతారు.
— కొంతమంది ప్రోద్బలం (ప్రభావితం) చేయడానికి మాట్లాడతారు.
— కొంతమంది వినోదం(సరదా) కోసం మాట్లాడతారు.
— కొంతమంది నచ్చచెప్పడానికి మాట్లాడతారు.
— కొంతమంది జ్ఞానోదయం కల్గించడానికి మాట్లాడతారు.

🔺 Whatever the reason it may be, before you Speak let your words Pass through your Heart. 
— కారణమేదైనా కానీ, మాట్లాడే ముందు ఆ మాటలు మీ హృదయం గుండా పోనియ్యి .

🔺 -Words have the Power to transform the person.
- Words have the Power to heal the person.
- Words have the Power to break the person.
- Words have the power to destroy the person.
- Words Reflect the contents of your Heart.
- Let your words Pass through your Heart before you Speak.
 1. మాటలకు మనిషిలో పరివర్తన కల్గించే శక్తి వుంది !
 2.మాటలకు  మనిషికి ఉపశమనం కల్గించే శక్తి వుంది !
3. మాటలకు మనిషిని గాయపరచగల శక్తి వుంది !
4.మాటలకు మనిషిని పతనం చేయగల శక్తి వుంది !
— మాట్లాడే ముందు మీ మాటలను మీ హృదయం గుండా పోనీయండి !

🔺 Speak only when it is absolutely necessary.
- Speak to only those who are ready to listen.
- Speak what is essential.
- Speak only if your words are more beautiful than Silence.
— ఖచ్చితంగా అవసరమైతేనే మాట్లాడు !
— వినడానికి సిద్ధంగా వున్నవారితోనే మాట్లాడు !
— అవసరమైనంతే మాట్లాడు !
—  (నోటి)మాటలు మౌనం కంటే అందంగా వుంటేనే మాట్లాడు !

🔸 సేకరణ : ది మైండ్, సేత్, రామ్తా పుస్తకాల నుండి.
by V V Ramana, Vijayawada
🕉️

Thursday, June 15, 2023

1998లో జరిగిన ఈ యదార్థ సంఘటన అయోధ్యలో నాటి పరిస్తితుల దృష్ట్యా ఏ వార్తాపత్రికలోగానీ, వార్తా చానెల్‌లోగానీ ఇంతవరకు చూపబడలేదు..

 1998లో జరిగిన ఈ యదార్థ సంఘటన అయోధ్యలో నాటి పరిస్తితుల దృష్ట్యా ఏ వార్తాపత్రికలోగానీ, వార్తా చానెల్‌లోగానీ ఇంతవరకు చూపబడలేదు..

ఈ సంఘటన జియో సినిమాలో ఉన్న ఇన్‌స్పెక్టర్ అవినాష్ సిరీస్‌లో చాలా వివరంగా చిత్రీకరించారు...

1998 లో అయోధ్యకు దాదాపు 20 కిలోల R D X (విస్ఫోటక పదార్థం) వస్తోందని ఇంటిలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి..వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)ని మోహరించారు. చాలా వరకు R D X ని పోలీసులు సమయానికి గుర్తించారు..రికవర్ చేశారు ..అదృష్టవశాత్తు అయోధ్యలో ఎటువంటి పేలుడు సంభవించలేదు.

ఈ మొత్తం బాం రికవరీలో ఒక అద్భుతం చోటు చేసుకుంది..
ఒక te₹₹orist bb0mb డిస్పోజల్ స్క్వాడ్‌గా మారువేషంలో అయోధ్యలోని పురాతన హనుమాన్ గడి ఆలయంలోకి ప్రవేశించి, వాటర్ కూలర్లో బాం ను పెట్టి టైమర్‌ను అమర్చాడు.. పోలీసులకు చివరి గంటలో దొరికిపోయాడు..అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను బాం ను హనుమాన్ గఢీ లో అమర్చానని చెప్పాడుగానీ ఎక్కడ అనేది చెప్పలేదు..అతను బాం ను సెట్ చేసిన టైమ్ కు ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉంది..

ఈ గందరగోళంలో అప్పటికే  ఆలయం లోపల ఉన్న ఇన్‌స్పెక్టర్ అవినాష్ మిశ్రా నేతృత్వంలో మొత్తం పోలీసులు బాం కోసం వెతికారు. వారు ఆలయంలోని ప్రతి మూలలో వెతికారు కానీ  బాంబ్ లాంటిదేమీ కనిపించలేదు..

అప్పుడు ఇన్స్పెక్టర్ అవినాష్ గుడి ప్రాంగణం లోపల వాటర్ కూలర్ దగ్గర ఒక చిన్న కోతి కూర్చుని రెండు వైర్లు చేతిలో పెట్టుకుని ఆడుకుంటూ నోట్లో పెట్టుకొని నమలడం గమనించాడు.. 
ఆ వాటర్ కూలర్లో బాం అమర్చబడిందని అనుమానించిన పోలీసులు ఆ కోతి దృష్టిని వైర్‌ల నుండి మరల్చడానికి కోతి వైపు అరటిపండ్లను విసిరారు..
అరటిపండ్లను కోతి వైపు విసిరిన వెంటనే అది తీగలను విడిచిపెట్టి అరటిపండ్లను కూడా  తీసుకోకుండానే వెళ్లిపోయింది..
వెంటనే, b0mb డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించారు.. వాటర్ కూలర్ ను తెరవగానే లోపల ఉన్న  టైమర్-సెట్ b0mb కనుగొనబడింది..
వెంటనే బాం డిస్పోజల్ చేసే నిపుణుడు ఉద్విగ్నంగా అరిచాడు "సార్, ఈ బాంబ్ ఇప్పటికే డిఫ్యూజ్ చేయబడింది. చూడండి, టైమర్ సరిగ్గా 3 సెకన్లలో బాం పేలుతుందనగా ఆగిపోయింది. ఆ చిన్న కోతి వైర్లు కత్తిరించి మమ్మల్ని రక్షించిందని ఆనందంగా చెప్పాడు "
ఇన్స్పెక్టర్ అవినాష్ ఆ కోతి కోసం వెతికాడు అప్పటికే అది హనుమాన్ఘడి  దేవాలయ శిఖరంపై ఉన్న శిఖర కాషాయ ద్వజాన్ని విజయచిహ్నంగా తీవ్ర ఆవేశంతో ఊపుతూ కనిపించింది..
ఇన్స్పెక్టర్ అవినాష్ రెండు చేతులూ పైకెత్తి మమ్మల్నీ..ప్రభు రామచంద్రుడి జన్మభూమిని కాపాడడానికి వచ్చిన సాక్షాత్ హనుమంతుడివే అంటూ హనుమాన్ చాలీసా పఠించారు.. 
ఇది ఖచ్చితంగా భక్త హనుమాన్ ప్రపంచానికి నేరుగా ఇచ్చిన సందేశం..అయోధ్య నా ప్రభు భగవాన్ శ్రీరామునికి చెందినదని అయోధ్యకు మానవమాత్రుడు పరిష్కరించలేని ఇబ్బంది వచ్చినప్పుడు స్వయంగా తానే స్వయంగా ఒక కోతి రూపంలో వచ్చి అయోధ్యను కాపాడుతానని ప్రకటించాడు.. 

కాపీ పోస్ట్... 

#జైశ్రీరామ్

చేదు నిజం క్షమించండి

 *చేదు నిజం క్షమించండి* 

తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకు, ఒక తండ్రి నుండి వారికి అంకితం:   

ఒక అమ్మాయికి... ఆమె తండ్రి ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు.  

ఒకరోజు తండ్రి  ఆ అమ్మాయిని అడిగాడు, 

 ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదట ఏం చేశావు..?  

*అమ్మాయి :* నాన్న నేను స్క్రాచ్ గార్డ్ మరియు కవర్ ఆర్డర్ చేసాను...   

*తండ్రి :* ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేసారా...?   

*అమ్మాయి :* ఎవరూ లేరు   

*తండ్రి :* ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా..?  

*కుమార్తె :* లేదు, కానీ తయారీదారు స్వయంగా కవర్ మరియు స్క్రాచ్ గార్డును వేసుకోమని సలహా ఇచ్చాడు ...   

*తండ్రి :* సరే ఐతే ఐఫోన్ కూడా చెడ్డగా కనబడుతోంది, అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా..?   

*అమ్మాయి :* లేదు, అది చెడిపోకూడదు, అందుకే కవర్ ఆర్డర్ చేసాను..  


*తండ్రి :* కవర్ వేశాక  దాని అందం తగ్గిందా..?  

*అమ్మాయి :* లేదు, దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది.   

తండ్రి ఆప్యాయంగా కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు....

అమ్మా  ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు, 

అది ఎలా ఉన్నా పని చేస్తుంది,  

కానీ కవర్ వేసుకోమని   నిన్ను ఎవ్వరు బలవంతపెట్టలేదు, 

పైగా కవర్ వేయడం వల్ల  అది ఇంకా అందంగా కనిపిస్తుంది , 

ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా  ఉంటుంది. 

కాబట్టి   దానికి శ్రద్దగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా, 

మరి  నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది,   మరియు అందమైనది,  

ఐ ఫోన్ కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం, తన అందం , 

అలాగే ఆడపిల్ల  ఇంటికి గౌరవం.

నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం పెరుగుతుంది. 

తగ్గదు తల్లి అన్నాడు.  

 అంతే దీనికి తండ్రి ముందు కన్నీళ్లు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం లేదు.  

బాలికలకు వినయపూర్వకమైన విన్నపం - భారతీయ సంస్కృతి, విలువలు మరియు గుర్తింపును కాపాడుకోండి...

 ఏదైనా పొరపాటు ఉంటే మన్నించండి.

అందముగా రక రకాల జడలతో అలంకరించుకునే జుట్టును పాశ్చాత్య ధోరణి భ్రమలో పడి విరబోసుకుని తిరుగుతున్నారు.

జుట్టు విరబోసుకుని తిరిగేవి దయ్యాలు మాత్రమే.

ఆ విషయం ఎవ్వరూ ఈ చిన్నారి తల్లులకు అర్థమయ్యే విధంగా చెప్పడం లేదు.

వారి కాలేజీ లలో ఈ విషయాలు చెప్పరు.

కనుక ఓ బంగారు తల్లులారా మీరు హిందూ సంస్కృతికి ప్రతినిధులు. 

కనుక దయచేసి హిందూ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నించండి.

పాశ్చాత్యులు మన హిందూ సంస్కృతిని నేర్చుకుంటున్నారు.

గమనించండి.

ఆలోచించండి.ఆలోచించండి.

శుభం భూయత్...

- *రాంకర్రి జ్ఞాన కేంద్ర*
     www.ramkarri.org
         8096339900

ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 361 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం. ఖాళీ మనసు చైతన్యంతో నిండి వుంటుంది. కాబట్టి 'ఖాళీ' అన్న మాటకు భయపడకు. ఒకసారి అన్ని సరిహద్దుల్ని అధిగమించి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆకాశంలా విస్తరిస్తావు. అనంతమవుతావు. 🍀*

*ధ్యానమంటే మనసులోని విషయాలనన్నిట్నీ ఖాళీ చెయ్యడం. జ్ఞాపకం, వూహా, దురభిప్రాయాలు, ఆలోచనలు, కోరికలు, ఆశలు, అనుభూతులు అన్నిట్నీ, నీకు బయటికి దేనినీ పంపాల్సిన పని లేని రోజు నీ జీవితంలో గొప్ప రోజు. అక్కడ స్వచ్ఛమైన ఖాళీ వుంటుంది. అక్కడ స్వచ్ఛమైన చైతన్యాన్ని చూస్తావు. మనసుకు సంబంధించి అక్కడ ఏమీ లేదు. కానీ అది పొంగి పొర్లేది. అస్తిత్వం తొణికిసలాడేది.*

*ఖాళీ మనసు చైతన్యంతో నిండి వుంటుంది. కాబట్టి 'ఖాళీ' అన్న మాటకు భయపడకు. అది వ్యతిరేకమయింది కాదు. అట్లా అనుకోవడం పాత అలవాటు. దాని వల్ల నష్టమెక్కువ. ఒకసారి అన్ని సరిహద్దుల్ని అధిగమించి నువ్వు స్వేచ్ఛ పొందితే ఆకాశంలా విస్తరిస్తావు. అనంతమవుతావు. అదే దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకోవడం, లేదా బుద్ధునితత్వం, దాన్ని మరింకే పేరుతోనైనా పిలువు. ధర్మం, తావో, సత్యం, నిర్వాణం - అవన్నీ దాన్నే చెబుతాయి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

Tuesday, June 13, 2023

నేనెవడను? అనేది ప్రశ్నకాదు, అదే అంతిమసమాధానం.

 నేనెవడను? అనేది ప్రశ్నకాదు, అదే అంతిమసమాధానం.

   
అన్నిటికీ అవకాశంగా ఉండే ఆకాశానికి 
తన రూపమేమో తెలియనట్లు...

రమణుడికి-
తానున్నానని తెలుస్తోందిగాని...
తానెవరో తెలియడం లేదు...

అందుకే తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కణ్ణీ అడిగాడు-
"నేనెవడను?" అని.

విన్నవారు అదొక సాధనాప్రక్రియ అనుకుని...
ఎవడి స్థానాల్లోకి వాళ్లు వెళ్లి, నేనెవడను? అని సాధన మొదలుపెట్టేశారు...
ఆత్మవిచారం మీద చాలా పుస్తకాలు వ్రాసేశారు...
అనుభూతులు, అనుభవాలు అంటూ ఏకరువు పెడుతున్నారు...

అదంతా ఉత్తదే...

"ఏ అనుభవమూ లేకపోవడమే ఆత్మానుభవం" 
అని సత్యాన్ని బద్దలు కొట్టి చెప్పిన మహనీయుడు 
సద్గురు సుబ్రహ్మణ్యులు.

* * *

నీవు నీవుగా ఉండడమే సాధన.
నీవు నీవుగా ఉండడమే సిద్ధి.

"ఉన్నరీతిన ఉండు..."
ఇదే సారవంతమైన ఉపదేశం.

ఉన్నరీతిన ఉంటే, మనసు-
ఇటు గతంలోకి...అటు భవిష్యతులోకి...జారదు...

అలా జారకుండా...
"ప్రస్తుతం"లో ఉండే మనసు పేరే ఆత్మ.
"ప్రస్తుతం"లో ఉండే స్థితి పేరే మోక్షం.

ఇటు గతంలోకి జారక, అటు భవిష్యత్తులోకి జారక...
సదా "వర్తమానం"లో సంస్థితమై ఉండేవాడికి... 
ఏ అనుభవమూ ఉండదు.

నిజానికి తానెవరో తనకే తెలియనివాణ్ణి గుఱించి
"ఫలానావాడు" అని మనం ఎలా నిర్థారించగలం?
అది ఎంత తెలివితక్కువ పని?

అలా తానెవరో నిర్థారించుకోలేకే...
నేనెవడను? అని వచ్చిన ప్రతి ఒక్కణ్ణీ అడిగాడు
భగవాను.

దానికి సమాధానం ఎవరూ చెప్పలేదు, చెప్పలేరు...

మనమేమో మన ప్రశ్నను తీసుకెళ్లి సమాధానం కోసం 
రమణుణ్ణి అడిగితే, ఆయన మళ్లీ ప్రశ్ననే ఇచ్చినట్లైంది. 

నిజానికి నేనెవడను? అనేది ప్రశ్నకాదు.
అదే అంతిమసమాధానం.

తానెవరో తనకు తెలియకపోవడమే - ఆత్మజ్ఞుని లక్షణం.
తానెవరో తనకు తెలిసినట్టు అనిపించడమే - అజ్ఞాని లక్షణం. 

కాబట్టి-
ఏదో తెలుసుకోవడానికి, ఏదో అవడానికి సాధన చేయడం మాని,
ఏమీ తెలియకుండా ఉండడానికి, ఏమీ కాకుండా ఉండడానికి
సాధన చేయండి...

నీవెవడవు? అని నిన్నెవరైనా  అడిగితే,
"నేను ఫలానా"  అని నీవు చెప్పగలిగితే,
నీకు తెలియవలసింది తెలియనట్టు.
నీవు పొందవలసినదానిని పొందనట్టు.
నీవు ఏది కావాలో అది కానట్టు

"నాకు తెలియదు" అని నీవు సమాధానం చెప్పగలిగితే,
నీకు తెలియవలసింది తెలిసినట్టు.
నీవు పొందవలసింది పొందినట్టు.
నీవు ఏది కావాలో అది అయినట్టు.

***

ఏకోహం...
ఉండేది  నేనొక్కణ్ణే.
నాకు అన్యమేమీ లేదు.
కనుక నన్ను నేను తెలుసుకోవడానికి నేనెవరినయ్యా?

* * *