ఎవరి ఎదుగుదల కొరకు వారు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారాలు చేస్తారు వారిని వారు ఉద్దరించుకోడానికి వారి వారి ప్రచారాలు రకరకాలుగా. ... ఎవరినో ఉద్ధరించడానికి కాదు... కానీ నీ ప్రచారాలు వినేవారికి లబ్ది చేకూరీతే కొంత లబ్ది ప్రచారకులు కూడా ఆటోమేటిక్ గా పొందుతారు..
నాగరికత ముసుగులో బంధాలు అనుబంధాలు డబ్బు చుట్టు తిరుగుతూ కుటుంబ వ్యవస్థ అంటే నేను, నా భార్య/భర్త పిల్లల వరకే పరిమితం... ఇదే వ్యవస్థ పుట్ట గొడుగులు లాగా అధ్యాత్మిక రంగంలో కూడా అర్ధం పర్ధం లేని వ్యక్తిగత అజెండా, వ్యక్తిగత కుంపట్లతో చెదలు, తుప్పు లాగా నిప్పు పై నివురు లాగ కప్పుకున్నారు.... ముందుగా అధ్యాత్మిక రంగంలో మార్పులు వస్తే ఆటోమేటిక్ గా కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు సహజంగానే వస్తాయి ప్రేమతత్వం, కృతజ్ఞతాభావం, క్షమాగుణం సేవా భావంతో... కావాల్సింది కొంత సమయం మరికొంత సరైన సాధన మాత్రమే.
ఆద్యాత్మిక రంగంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం.. ఓషో మార్గం, బుద్ధుని మార్గం, కృష్ణుని మార్గం, రాముని మార్గం, అల్లాహ్ మార్గం, క్రీస్తు మార్గం, రమణ మార్గం, సాయి మార్గం అలాగే ఈమధ్య వచ్చిన పత్రీజీ మార్గం... ఆన్ని మార్గాలలో ఉన్న సారాంశం నిన్ను నీవు తెలుసుకో, నీ సమస్యలకు కారణం నీవు చేసిన చెడు పనుల వలన మాత్రమే... అందరూ దుఃఖ రహిత జీవితం గురించి మాత్రమే చెప్పారు... ప్రస్తుత సాధకులు సరైన సాధన ద్వారా అంతరంగంలో కి ప్రవేశించినపుడు మాత్రమే సరైన ఆత్మజ్ఞానం పొంది వారు చెప్పారు, వీరు చెప్పారు అనే ప్రచారాలు మానేసి నేను చెబుతున్నా అనే స్థితికి ఎదగాలి.. ఆధ్యాత్మిక సత్యాన్ని ఆత్మజ్ఞానంతో చదివినవారు మాత్రమే చెప్పగలరు, చేయగలరు... ప్రతి ఒక్కరికీ ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అనే రెండు జీవిత అనుభవాలను కలిగియుంటారు.. ఏది ఎమైనా ఎంత ఎక్కువ సరైన సాధన చేస్తోరో వారే మహా మహా గొప్ప సాధకులు.. ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు కలిగి యుంటారు.
పెండలం జైపూర్ క్రిష్టల్ మాయలో ఎవరూ పడకండి... గతంలో కూడా ఇలాగే ఒకతను ప్రచారాలు చేసి ప్రస్తుతం చిరునామా లేకుండా పోయాడు.
సరైన సాధన తప్ప మిగతావన్నీ మాయా ప్రచారాలు మనసు మాయలో... మాయ గాళ్లకు మనసు సహకరిస్తుంది.మనసుకు మాయ గాళ్ళకు వీడని బంధం ఉంది.
మనసు మాయను మనసుతోటే జయించాలి... అదే శ్రద్దవాన్ లభితె... అనగా నేను ధ్యానం చేస్తున్నాను, ఈ ధ్యాన సాధనలో శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి చేరుకుంటున్నారు అని subconceous మైండ్ కి ఫీడింగ్ ఇచ్చి సాధనకు కూర్చోండి అది కూడా కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో.
No comments:
Post a Comment